Tiger in Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో మళ్లీ కనిపించిన పెద్దపులి- మహారాష్ట్ర నుంచి వచ్చినట్లు అటవీశాఖ అనుమానం
Adilabad Tiger News | మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి వచ్చిన పులి ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో సంచరిస్తోంది. గొల్లఘాట్, తాంసి (కె), ప్రాంతాల ప్రజలు పులి సంచారంతో వణికిపోతున్నారు.

Tiger in Adilabad | భీంపూర్: గత కొన్ని రోజులుగా ప్రశాంతంగా ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం మరోసారి కలకలం రేపుతోంది. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని తాంసి, గొల్లఘాట్ శివారులో పులి సంచరిస్తోంది. పెన్ గంగానది ఒడ్డున ఉన్న మహారాష్ట్ర (Maharashtra)లోని తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి వచ్చిన పెద్దపులి గొల్లఘాట్, తాంసి (కె), ప్రాంతాల్లో తిరుగుతోంది. తాంసి (కె) గ్రామ సమీపంలోనీ పిప్పల్ కోటి రిజర్వాయర్ పని ప్రదేశంలో సోమవారం రాత్రి సమయంలో లారీ డ్రైవర్లకు పెద్దపులి కనిపపించింది. దీంతో గమనించిన డ్రైవర్లు పెద్దపులి వీడియోను రికార్డ్ చేశారు. ఆపై వారి నుండి ఆ విడియో వైరల్ అవుతూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
పులి సంచారం గురించి సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు తాంసి, ఆర్లి (టీ) సెక్షన్ అధికారి మోపత్ రావ్, బీట్ ఆఫీసర్లు సాయి, శ్రీనివాస్, రామేశ్వర్, అనిమల్ ట్రాకర్ లు సోనేరావు, కృష్ణలు మంగళవారం నాడు పులి సంచరించిన ప్రాంతంలో పులి పాద ముద్రలను గాలించగా.. ఎలాంటి పాదముద్రలు తమకు లభ్యం కాలేదని తెలిపారు. ఇద్దర్ సెక్షన్ల అధికారులు, రెండు టీంలు గా బేస్ క్యాంపు ఏర్పాటు చేసి పులి జాడ కోసం తిరుగుతున్నారు. పులి సంచరించే ప్రాంతాల్లో 8 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పులి సంచారం నేపథ్యంలో ఆ ప్రాంత వాసులు జగ్రత్తగా ఉండాలని స్థానికును అప్రమత్తం చేశారు. ఎవరికైనా పులి కనిపించినా, పులి గురించి ఏమైనా సమాచారం తెలిపిన అటవీ శాఖ అధికారులకు తెలియజేయాలని సూచించారు.





















