IPL, 2022 | Qualifier 1 | Eden Gardens, Kolkata - 24 May, 07:30 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
RR
RR
IPL, 2022 | Eliminator | Eden Gardens, Kolkata - 25 May, 07:30 pm IST
(Match Yet To Begin)
LSG
LSG
VS
RCB
RCB

Bandi Sanjay: సీఎంవో ఆదేశాలతో ఎంపీ అర్వింద్ పై దాడి... బీజేపీ భయపడే పార్టీ కాదు... బండి సంజయ్ కామెంట్స్

బీజేపీ భయపడే పారిపోయే పార్టీ కాదని, ఇలాంటి దాడులు కొత్త కాదని బండి సంజయ్ అన్నారు. సీఎంవో ఆదేశాలతో పోలీసుల ఆధ్వర్యంలో ఎంపీ అర్వింద్ పై హత్యాయత్నం జరిగిందని ఆయన ఆరోపించారు.

FOLLOW US: 

ఇచ్చిన హామీలు అడిగితే దాడులు చేస్తారా, దాడులు చేసేందుకే గెలిపించారా ప్రజలు అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. ఇస్సాపల్లిలో బీజేపీ నాయకులను ఆయన పరామర్శించారు. నిజామాబాద్‌లోని నందిపేట్‌లో మాట్లాడిన ఆయన..తప్పు అని ప్రశ్నిస్తే దాడి చేస్తారా అని ప్రశ్నించారు. సీఎం ఆదేశాలతోనే దాడులు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి దాడులు కొత్త కాదన్నారు. 

భయపడే పార్టీ కాదు 

బీజేపీ భయపడి పారిపోయే పార్టీ కాదు. ముందుకే తప్ప వెనకడుగు వెయ్యం. రాష్ట్రం కోసం మీ కుటుంబం ఏం త్యాగం చేసిందో కేసీఆర్ చెప్పాలి. మొట్టమొదటి తెలంగాణ ద్రోహి కేసీఆర్. భాజపా ఎదుగుదల జీర్ణించుకోలేక దాడులకు తెగబడడం మూర్ఖత్వం. కుటుంబం కోసమేనా తెలంగాణ సాధించుకున్నది. నిరుద్యోగ భృతి, పీఆర్సీ, పంట కొనుగోళ్లు, 317 జీవో కోసం భాజపా కొట్లాడింది. భాజపా ప్రశ్నించడం మొదలు పెట్టిందని దాడులకు పాల్పడటం నీచమైన చర్య. మూర్ఖపు కుటుంబ పాలన అంతానికి పోరాటం చేస్తాం. మేము దాడులు చేయడం మొదలు పెడితే బిస్తర్ కట్టాల్సిందే. దొంగ దీక్షలు చేసిన కేసీఆర్.. భాజపా తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వకుంటే రాష్ట్రం వచ్చేదా.. కనీసం ఓటింగ్ లో కూడా కేసీఆర్ పాల్గొనలేదు. చట్టాన్ని కాపాడాల్సిన అధికారులు.. తెరాసకు మద్దతుగా మారితే మంచిది కాదు. అలాంటి వారిపై దాడులపై ప్రివిలేజ్ కమిటీలో తేలుస్తాం. అనేక మంది ఐపీఎస్ లు మధనపడుతున్నారు. భయపడి, లొంగిపోయి పనిచేస్తే సరైంది కాదు' అని బండి సంజయ్ అన్నారు. 

Also Read: ఎంపీ అర్వింద్‌కు ఫోన్ చేసి దాడిపై వాకబు చేసిన గవర్నర్ తమిళిశై ! ప్రభుత్వంతో పెరుగుతున్న దూరం.. బెంగాల్ తరహా పరిస్థితులు వస్తాయా ?

సీఎంవో ఆదేశాలతో దాడులు

ఎంపీ అర్వింద్ పై దాడి గురించి సీపీకి ముందే తెలుసని బండి సంజయ్ ఆరోపించారు.  కానీ పోలీసులే దగ్గరుండి దాడులు చేయించారన్నారు. సీఎంవో కార్యాలయ ఆదేశాలకు అనుగుణంగానే దాడులు జరిగాయన్నారు. దాడి చేసే వారిని నియంత్రించకుండా ఎంపీని నిలువరించాలని సీపీ చూశారని ఆరోపించారు. ఎంపీపై దాడి చేస్తే ఇప్పటి వరకు ఎందుకు ఎఫ్ఐఆర్ ఫైల్ చెయ్యలేదని ప్రశ్నించారు.  ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడం దారుణమన్నారు. హత్యాయత్నం చేసిన అందరూ బయట తిరుగుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. తిరిగి తమపైనే కేసులు పెడతారని, కరీంనగర్ లో ఇదే జరిగిందన్నారు. ఇంతటి నిర్బంధం, అరాచకం చూడలేదన్నారు. గవర్నర్ ను కూడా గౌరవించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. బీజేపీకి అధికారం ఇవ్వాలని ప్రజలు నిర్ణయించుకున్నారని బండి సంజయ్‌ అన్నారు. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తీవ్రమైన మానసిక ఒత్తిడితోనే ఎంపీ అర్వింద్ పై దాడి చేశారని విమర్శించారు. నిజామాబాద్‌లోని నందిపేట్‌లో నిర్వహించిన ర్యాలీలో బండి సంజయ్ పాల్గొన్నారు. 

Published at : 27 Jan 2022 07:44 PM (IST) Tags: telangana nizamabad TS News Bjp chief bandi sanjay Attack on MP Arvind mp arvind

సంబంధిత కథనాలు

Revanth Reddy : అధికారంలోకి రాగానే మల్లారెడ్డిని జైలుకు పంపిస్తాం, రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Revanth Reddy : అధికారంలోకి రాగానే మల్లారెడ్డిని జైలుకు పంపిస్తాం, రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Karimnagar News : సిరిధాన్యాలతో సిరులు కురిపిస్తున్న మగువలు, విదేశాలకు బిస్కెట్లు, కేకుల ఎగుమతి

Karimnagar News : సిరిధాన్యాలతో సిరులు కురిపిస్తున్న మగువలు, విదేశాలకు బిస్కెట్లు, కేకుల ఎగుమతి

Breaking News Live Updates : డ్రాగా ముగిసిన భారత్, పాకిస్తాన్ హాకీ మ్యాచ్

Breaking News Live Updates : డ్రాగా ముగిసిన భారత్, పాకిస్తాన్ హాకీ మ్యాచ్

Renuka Chowdhury : మాజీ ఎంపీ రేణుకా చౌదరిపై కేసు నమోదు, వైద్యుడి సతీమణి ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్!

Renuka Chowdhury : మాజీ ఎంపీ రేణుకా చౌదరిపై కేసు నమోదు, వైద్యుడి సతీమణి ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్!

KTR IN Davos: తెలంగాణకు మరో అంతర్జాతీయ కంపెనీ- ఆగస్టు నుంచి స్విస్‌రే కంపెనీ కార్యకలాపాలు, ట్విట్టర్‌లో ప్రకటించిన కేటీఆర్

KTR IN Davos: తెలంగాణకు మరో అంతర్జాతీయ కంపెనీ- ఆగస్టు నుంచి స్విస్‌రే కంపెనీ కార్యకలాపాలు, ట్విట్టర్‌లో ప్రకటించిన కేటీఆర్
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Infinix Hot 12 Play: 7 జీబీ ర్యామ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఫోన్ రూ.9 వేలలోపే - సూపర్ ఫీచర్లు కదా!

Infinix Hot 12 Play: 7 జీబీ ర్యామ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఫోన్ రూ.9 వేలలోపే - సూపర్ ఫీచర్లు కదా!

Shekar Movie: శేఖర్ సినిమా ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్!

Shekar Movie: శేఖర్ సినిమా ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్!

Ind vs Pak, Hockey Asia Cup: చివరి నిమిషంలో షాక్ ఇచ్చిన పాక్ - మ్యాచ్ డ్రాగా ముగించిన భారత్!

Ind vs Pak, Hockey Asia Cup: చివరి నిమిషంలో షాక్ ఇచ్చిన పాక్ - మ్యాచ్ డ్రాగా ముగించిన భారత్!

Hyundai New Car: రూ.7 లక్షలలోపే హ్యుండాయ్ కొత్త కారు - ఎలా ఉందో చూశారా?

Hyundai New Car: రూ.7 లక్షలలోపే హ్యుండాయ్ కొత్త కారు - ఎలా ఉందో చూశారా?