Telangana News: రాష్ట్రంలో 2 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు కొత్త పాలకవర్గాలు
Agricultural Market Committees: రాష్ట్రంలో 2 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు కొత్త పాలకవర్గాలను నియమిస్తూ వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.రఘునందన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు.
New Governing Bodies of Market Committees: తెలంగాణలో 2 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు కొత్త పాలకవర్గాలు ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలో 197 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు నూతన కార్యవర్గాలను ఏర్పాటుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. ఈ క్రమంలో రెండు మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలను నియమిస్తూ వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎం.రఘునందన్ రావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా సదాకుల కుమార్, ఆదిలాబాద్ జిల్లా బోధ్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా బొడ్డు గంగయ్య నియమితులయ్యారు. నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏర్పడిన మొదటి కమిటీ పాలకవర్గం సదాశివపేట. ఈ మేరకు కమిటీ ఏర్పాటుకు సహకరించిన వారికి, కొత్త కార్యవర్గానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభినందనలు తెలిపారు.
Also Read: Rajyasabha Election: తెలంగాణ మూడు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం - వారి ఎన్నిక లాంఛనమే!