News
News
X

Yadadri Road Accident: చౌటుప్పల్ లో ఆటో, ప్రైవేటు బస్సు ఢీ - ముగ్గురు దుర్మరణం, నలుగురికి తీవ్రగాయాలు

Yadadri Road Accident: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, ప్రైవేటు బస్సు ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.  

FOLLOW US: 
Share:

Yadadri Road Accident: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ - విజయవాడ రహదారి 65పై.. ఆటో, ప్రైవేటు బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కేడ మృతి చెందగా.. మరో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. విషయం గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే క్షతగాత్రులను కూడా వెంటనే అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి పంపించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ రోడ్డు ప్రమాదంతో ట్రాఫిక్ మొత్తం స్తంభించిపోయింది. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కల్గింది.

కాగా ఇదే రోజు 65వ నెంబర్ జాతీయ రహదారిపై కొర్లపహాడ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. గ్రామానికి చెందిన ప్రేమ్ కుమార్ కుటుంబంతో నకిరేకల్ లో నివాసం ఉంటున్నాడు. కొర్లపహాడ్ కు వచ్చి బైక్ పై తిరిగి వెళ్తుండగా... టోల్ ప్లాజా దాటిన తర్వాత ఓ హోటల్ వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా ఢీ కొట్టాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. 

నిన్నటికి నిన్న కొండగట్టులో రోడ్డు ప్రమాదం

జగిత్యాల జిల్లా కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొనగా.. బస్సు కండక్టర్ అక్కడికక్కడే మృతి చెందారు. బస్సులో ఉన్న ఎనిమిది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. విషయం గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను వెంటనే జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు కూడా సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు జగిత్యాల నుంచి వరంగల్ వెళ్తుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ప్రమాద సమయంలో బస్సులో 8 మంది ప్రయాణికులు ఉన్నారని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఈ రోజు కొండగట్టులో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. దీనికి కొద్ది దూరంలోనే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే చనిపోయిన కండక్టర్ కొడిమ్యాల మండలం శ్రీరాములపల్లికి చెందిన సత్తయ్యగా పోలీసులు గుర్తించారు. సత్తయ్య చనిపోయాడని ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేశారు. హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్న మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇంటి పెద్ద చనిపోవడంతో అనాథలం అయ్యామంటూ ఆయన భార్యా, పిల్లలు వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

గత నెల 24వ తేదీన వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు చేయించేందుకు కొండగట్టు వచ్చిన పవన్ కళ్యాణ్, అనంతరం ధర్మపురి వెళ్లారు. నేటి తన పర్యటన పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు. కొందరు యువకులు పవన్ కాన్వాయ్ ను ఫాలో అయ్యారు. ఈ క్రమంలో తమ అభిమాన నేత పవన్ కు అభివాదం చేస్తుండగా రెండు బైకులు ఢీకొనడంతో నలుగురు యువకులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలో ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు తలకు తీవ్ర గాయం కావడంతో దుర్మరణం చెందాడు. మరో ముగ్గురు యువకులకు గాయాలు కాగా, వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. 

Published at : 16 Feb 2023 04:05 PM (IST) Tags: Telangana Latest Crime News Three People Died Latest Road Accident Yadadri Road Accident Yadadri Bhuvanagiri New

సంబంధిత కథనాలు

TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!

TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!

TSPSC Paper Leak: 'పేపర్ లీక్' దర్యాప్తు ముమ్మరం, 40 మంది టీఎస్‌పీఎస్సీ సిబ్బందికి నోటీసులు జారీ!

TSPSC Paper Leak: 'పేపర్ లీక్' దర్యాప్తు ముమ్మరం, 40 మంది టీఎస్‌పీఎస్సీ సిబ్బందికి నోటీసులు జారీ!

“ఆరోగ్య మహిళ" స్కీమ్ అంటే ఏంటి? ఏయే టెస్టులు చేస్తారో తెలుసా

“ఆరోగ్య మహిళ

TS Police SI Admit Card: ఎస్‌సీటీ ఎస్‌ఐ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల - డైరెక్ట్ లింక్ ఇదే

TS Police SI Admit Card: ఎస్‌సీటీ ఎస్‌ఐ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల - డైరెక్ట్ లింక్ ఇదే

TSPSC Paper Leakage: 'గ్రూప్‌-1' పేపర్‌ మొదటి టార్గెట్, జూన్‌లోనే పేపర్‌ లీకేజీకి స్కెచ్‌!

TSPSC Paper Leakage: 'గ్రూప్‌-1' పేపర్‌ మొదటి టార్గెట్, జూన్‌లోనే పేపర్‌ లీకేజీకి స్కెచ్‌!

టాప్ స్టోరీస్

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం - వైసీపీ హై అలర్ట్

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం - వైసీపీ హై అలర్ట్

IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!

IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!

DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య

DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య

Pragya Nagra: ఉగాదికి ఇంత అందంగా ముస్తాబైన ఈ తమిళ బ్యూటీ ఎవరో తెలుసా?

Pragya Nagra: ఉగాదికి ఇంత అందంగా ముస్తాబైన ఈ తమిళ బ్యూటీ ఎవరో తెలుసా?