అన్వేషించండి

TSRTC MD Sajjanar: లీవ్ దొరకలేదని డ్రైవర్ ఆత్మహత్యాయత్నం! అసలు విషయం చెప్పిన సజ్జనార్

Telangana ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం ఘటనపై సంస్థ ఎండీ సజ్జనార్ స్పందించారు. డ్రైవర్ శంకర్ ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారని.. చెప్పాపెట్టకుండా సెలవులు తీసుకున్నారని తెలిపారు.

TSRTC MD Sajjanar responds on Driver suicide attempt- హైదరాబాద్: టీఎస్ ఆర్టీసీ డ్రైవర్‌కు లీవ్ ఇవ్వకుండా వేధించడం వల్లే ఆయన ఆత్మహత్యాయత్నం చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనపై టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు. నల్లగొండ జిల్లా దేవరకొండ డిపోనకు చెందిన డ్రైవర్‌ శంకర్ కు సెలవు మంజూరు చేయకుండా వేధించడం వల్లే ఆత్మహత్యాయత్నం చేశారన్న వార్తల్లో నిజం లేదన్నారు. డ్రైవర్ శంకర్ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఏప్రిల్ 18, 19 తేదీల్లో డ్యూటీకి గైర్హాజరు అయ్యారు. అయినా ఏప్రిల్ 20న అధికారులు డ్యూటీ కేటాయించారు. ఆదివారం సెలవు కావాలని డిపో అధికారులను డ్రైవర్ శంకర్ సంప్రదించగా.. వాళ్ళు లీవ్ పొజిషన్ చూసి సెలవు మంజూరు చేస్తామన్నారు. కానీ సెలవు ఇవ్వబోమని డ్రైవర్ కు ఏ అధికారి చెప్పలేదని క్లారిటీ ఇచ్చారు.

ఆర్టీసీ అధికారులు తనకు సెలవు మంజూరు చేయడం లేదని, వేధిస్తున్నారని డ్రైవర్ శంకర్ ఆరోపించాడు. పురుగుల మందు తాగుతున్నానంటూ సెల్ఫీ వీడియో తీసుకుని వాట్సాప్ గ్రూప్ ల్లో శంకర్ శనివారం షేర్ చేశాడు. వెంటనే డిపో అధికారులు అక్కడికి వెళ్లి డ్రైవర్‌ను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ పురుగుల మందు తాగలేదని ధ్రువీకరించిన అనంతరం డాక్టర్లు అతడ్ని డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం డ్రైవర్ శంకర్ ఆయన ఇంట్లోనే సురక్షితంగా ఉన్నాడని సజ్జనార్ తెలిపారు.
ఉద్దేశపూర్వకంగానే డ్రైవర్ ఇలా చేశాడు
డ్రైవర్ శంకర్ ఉద్దేశ్యపూర్వకంగానే ఈ ఘటనకు పాల్పడ్డారని సజ్జనార్ చెప్పారు. గతంలోనూ సెలవుల విషయంలో అధికారులపై బెదిరింపులకు దిగారని గుర్తుచేశారు. ఆయన లీవ్ రికార్డు సరిగా లేదు. గత మూడు నెలల్లో 10 సాధారణ లీవ్ లు, 20 సిక్ లీవ్ లను డ్రైవర్ శంకర్ తీసుకున్నారని సజ్జనార్ స్పష్టం చేశారు.

సిబ్బందికి సెలవుల మంజూరు విషయంలో నిబంధనల ప్రకారమే టీఎస్ ఆర్టీసీ నడుచుకుంటోందన్నారు. లీవ్ పొజిషన్, కారణం తీవ్రతను బట్టి సిబ్బందికి సెలవులను మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. ఉద్దేశ్యపూర్వకంగా, సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించే ఇలాంటి ఘటనలను టీఎస్ఆర్టీసీ ఏమాత్రం ఉపేక్షించదు అని దుష్ప్రచారం చేస్తున్న వారిని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలపై పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సజ్జనార్ తెలిపారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget