News
News
వీడియోలు ఆటలు
X

Narasimha Jayanti: యాదాద్రిలో నిత్యకల్యాణం నిలిపివేత - మంగళవారం నుంచి నరసింహ స్వామి జయంత్యుత్సవాలు

Narasimha Jayanti: యాదాద్రిలో లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో మంగళవారం నుంచి స్వామి వారి జయంత్యుత్సవాలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే రోజూ జరిగే నిత్య కల్యాణాన్ని నిలిపివేశారు.

FOLLOW US: 
Share:

Narasimha Jayanti: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో మంగళ వారం నుంచి స్వామి వారి జయంత్యుత్సవాలను నిర్వహించబోతున్నారు. ఈ క్రమంలోనే ప్రతిరోజూ జరిగే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నిత్య కల్యాణం, శ్రీ సుదర్శన హోమం, బ్రహ్మోత్సవాలను నిలిపి వేస్తున్నట్లు యాదాద్రి ఆలయ కార్యనిర్వాహక అధికారి గీత తెలిపారు. మొక్కు కల్యాణం నిర్వహించే భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. అత్సవాలు పూర్తయిన తర్వాత మే 5వ తేదీ నుంచి నిత్య కల్యాణం, హోమం, బ్రహ్మోత్సవాలు పునః ప్రారంభం అవుతాయని వివరించారు. అనుబంధ పాతగుట్ట ఆలయంలోనూ మే 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు నిత్య కల్యాణం నిలిపి వేస్తున్నట్లు ఈవో చెప్పారు.  

సాధారణ సమయాల్లో యాదాద్రి దర్శన వేళలివే

  • ఉదయం 3 గంటల నుంచి 3.30 గంటలకు సుప్రభాతం 
  • ఉదయం 3.30 గంటల నుంచి 4 గంటల వరకు బిందె తీర్థం, ఆరాధన
  •  ఉదయం 4 గంటల నుంచి 4.30 గంటల వరకు స్వామివారికి బాలభోగం
  • ఉదయం 4.30 గంటల నుంచి 5.30 గంటల వరకు నిజాభిషేకం
  • ఉదయం 5.30 గంటల నుంచి 5.45 గంటల వరకు అలంకార సేవ
  • ఉదయం 5.45 గంటల నుంచి 6.30 వరకు స్వామి వారికి సహస్రనామార్చన, ఆండాల్ అమ్మవారికి కుంకుమార్చన 
  • ఉదయం 6.30 గంటల నుంచి 8 గంటల వరకు సర్వ దర్శనాలు
  • ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు వీఐపీ బ్రేక్ దర్శనం
  • ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు సర్వదర్శనాలు
  • మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.45 గంటల వరకు మధ్యాహ్నా రాజభోగం
  • మధ్యాహ్నం 12.45 గంటల నుంచి 4 గంటల వరకు సర్వ దర్శనాలు
  • సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు వీఐపీ బ్రేక్ దర్శనం
  • సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు సర్వ దర్శనాలు
  • రాత్రి 7 గంటల నుంచి 7.30 గంటల వరకు తిరువారాధన
  • రాత్రి 7.30 గంటల నుంచి 8.15 గంటల వరకు స్వామివారికి సహస్రనామార్చన, ఆండాల్ అమ్మవారికి కుంకుమార్చన 
  • రాత్రి 8.15 గంటల నుంచి 9.15 గంటల వరకు సర్వదర్శనాలు 
  • రాత్రి 9.15 గంటల నుంచి 9.45 గంటల వరకు రాత్రి నివేదన, ఆరగింపు
  • రాత్రి 9.45 గంటల నుంచి 10 గంటల వరకు శయనోత్సవ దర్శనం, ప్రధానాలయ ద్వార బంధనం
  • ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 9.15 గంటల వరకు జరిగే సర్వదర్శన వేళల్లో సువర్ణపుష్పార్చన, వేదాశీర్వచనం
  • ఉదయం 8.30 గంటల నుంచి 10 గంటల వరకు సుదర్శన నారసింహ హోమం
  • ఉదయం 10.30 గంటల నుంచి 12 గంటల వరకు స్వామివారి నిత్య కల్యాణోత్సం, బ్రహ్మోత్సవం.
  • సాయంత్రం 5 గంటల నుంచి 6.30 గంటల వరకు స్వామివారి వెండి జోడు సేవోత్సవాలు
  • సాయంత్రం 6.45 గంటల నుంచి 7 గంటల వరకు దర్భారు సేవ
  • ప్రతీ మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి 11 గంటల వరకు విష్ణు పుష్కరిణి, ప్రధానాలయంలోని క్షేత్రపాలకుడికి నాగవల్లీ దళార్చనలు
  • ప్రతీ శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఊంజల్ సేవోత్సవం

అయితే ఇలా రోజూ జరిగే పలు సేవలను ఆలయ అర్చకులు నిలిపివేశారు. స్వామి వారి జయంత్యుత్సవాల నిర్వహణ కారణంగానే ఇలా చేసినట్లు ఆలయ అర్చకులు ప్రకటించారు. 

Published at : 01 May 2023 12:21 AM (IST) Tags: Nalgonda narasimha swamy Telangana News Yadadri Temple Narasimha Swamy Jayanthi

సంబంధిత కథనాలు

TS PGECET Results: తెలంగాణ పీజీఈసెట్‌ - 2023 ఫలితాలు వెల్లడి, డైరెక్ట్ లింక్ ఇదే!

TS PGECET Results: తెలంగాణ పీజీఈసెట్‌ - 2023 ఫలితాలు వెల్లడి, డైరెక్ట్ లింక్ ఇదే!

Top 10 Headlines Today: తెలుగు రాష్ట్రాల్లో జై బాలయ్య మేనియా- మహబూబ్‌నగర్‌ టూర్‌లో కేటీఆర్

Top 10 Headlines Today: తెలుగు రాష్ట్రాల్లో జై బాలయ్య మేనియా- మహబూబ్‌నగర్‌ టూర్‌లో కేటీఆర్

Top 10 Headlines Today: తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఎందుకీ గడ్డుకాలం, తొలిరోజు పైచేయి సాధించిన ఆస్ట్రేలియ జట్టు

Top 10 Headlines Today: తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఎందుకీ గడ్డుకాలం, తొలిరోజు పైచేయి సాధించిన ఆస్ట్రేలియ జట్టు

Skill Based Courses: 'నైపుణ్య' డిగ్రీ కోర్సులకు ముందుకు రాని కళాశాలలు!

Skill Based Courses: 'నైపుణ్య' డిగ్రీ కోర్సులకు ముందుకు రాని కళాశాలలు!

తెలంగాణ రాజకీయాల్లో ‘ధరణి’ దుమారం- తగ్గేదేలే అంటున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు!

తెలంగాణ రాజకీయాల్లో ‘ధరణి’ దుమారం- తగ్గేదేలే అంటున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు!

టాప్ స్టోరీస్

Sharwanand: సీఎం కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్ - వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఆహ్వానం

Sharwanand: సీఎం కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్ - వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఆహ్వానం

Ambati Rayudu : జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?

Ambati Rayudu :  జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?

CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం