News
News
X

Munugode Bypolls: రాజగోపాల్ రెడ్డికి ఓటు వేస్తే మోరిలో వేసినట్టే: ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి

మునుగోడు ఉప ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించాలని, బీజేపీకి ఓటు వేశారంటే, అది మోరిలో వేసినట్లేనన్నారు నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి.

FOLLOW US: 

తన స్వార్థం కోసం, కాంట్రాక్టుల కోసం పార్టీ మారిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మునుగోడు ఉప ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాలని ఓటర్లను నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కోరారు. ఒక్కడి ప్రయోజనాల కోసం నియోజకవర్గాన్ని తాకట్టు పెట్టి, ఉప ఎన్నికలతో మునుగోడు ప్రజల ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీసిన బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి ఓటర్లు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. రాజగోపాల్ రెడ్డికి ఓటు వేశారంటే, అది మోరిలో వేసినట్లేనన్నారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆదివారం మునుగోడు మండలంలోని గూడపూర్ గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. 

సంక్షేమ పాలనకు నిదర్శనం.. 
పోరాడి సాధించుకున్న రాష్ట్రం తెలంగాణను సీఎం కేసీఆర్ విజయమార్గంలో నడిపిస్తున్నారని అన్నారు. దేశంలో కొత్త రాష్ట్రం అయినప్పటికీ కేసీఆర్‌ నాయకత్వంలో దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు. అన్ని వర్గాల వారికి టీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయం చేసిందన్నారు. పేద ఆడబిడ్డల పెళ్లిళ్లు ఇక బారం కాకూడదని పథకాలు, రైతుల కన్నీళ్లు తుడిచేందుకు రైతు బంధు, వ్యవసాయ బోర్లకు మీటర్లు లేని మోటార్లు కేసీఆర్ సంక్షేమ పాలనకు నిదర్శనం అన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని స్థానిక ప్రజలను ఆయన కోరారు.

అన్ని వర్గాల వారికి పథకాలు 
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లు జరిపిస్తున్న వ్యక్తి కేసీఆర్ అన్నారు. వికలాంగులకు రూ.3016 పింఛన్లు, వయసు మీద పడిన పెద్దోళ్లతో పాటు ఎయిడ్స్ పేషెంట్స్, బీడీ కార్మికులు, పైలేరియా బాధితులు, ఇలా ఎంతో మందికి ప్రతినెలా రూ.2016 ఇస్తున్నారని గుర్తుచేశారు. రైతాంగానికి రైతుబంధు, 24 గంటలు ఉచిత కరెంటు పథకాలు తెచ్చి అన్నదాతల కన్నీళ్లు తుడిచారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం... రాష్ట్రాల్లో అభివృద్ధిని సహించలేక ఉచిత కరెంటు తొలగించి, మీటర్లు పెట్టి ఏటా రూ. 15,000 వసూలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కనుక బీజేపీకి ఓటు వేస్తే, మోరిలో వేసినట్టేనని అన్నారు. 

భారీ మెజార్టీతో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం
మునుగోడు ఓటర్లు టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి బ్రహ్మరథం పట్టనున్నారని తెలంగాణ పశుసంవర్దక శాఖ, సినిమాటోగ్రఫి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ చేపడుతున్న కార్యక్రమాలే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తాయని దీమా వ్యక్తం చేశారు. భారీ మెజార్టీతో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం సాధిస్తారని, మునుగోడు ప్రజలకు టీఆర్ఎస్ వెంట ఉన్నారని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నాంపల్లిలోని పలు వార్డులలో పాదయాత్ర, ఇంటింటి ప్రచారం నిర్వహించారు మంత్రి తలసాని. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

News Reels

మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యమని అభిప్రాయపడ్డారు. దేశంలోనే ఆదర్శ వంతమైన పాలన అందిస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రమన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశంలో మరే రాష్ట్రంలోనూ లేవన్నారు. ఆసరా పింఛన్లు, అన్నదాతలకు 24 గంటల కరెంట్‌, రైతు బంధు, దళితులకు దళిత బంధు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. మిషన్‌ భగీరథ, మిషన్ కాకతీయతో ఫ్లోరోసిస్ సమస్యకు చెక్ పెట్టిన ఘనత కేసీఆర్ దేనన్నారు. గడిచిన ఎనిమిది సంవత్సరాలలో సీఎం కేసీఆర్ సబ్బండ వర్గాలకు మేలు చేసే కార్యక్రమాలు చేశారని చెప్పార. కాంట్రాక్టుల కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు.

Published at : 16 Oct 2022 04:57 PM (IST) Tags: TRS Telangana Munugode Bypolls Munugode ByElections Munugode Kancharla Bhupal Reddy

సంబంధిత కథనాలు

Petrol-Diesel Price, 30 November 2022: పెరిగిన క్రూడ్ ఆయిల్ ప్రైస్- తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలపై ఎఫెక్ట్‌!

Petrol-Diesel Price, 30 November 2022: పెరిగిన క్రూడ్ ఆయిల్ ప్రైస్- తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలపై ఎఫెక్ట్‌!

Gold-Silver Price 30 November 2022: బంగారం కొనాలంటే మాత్రం ఆలస్యం చేయకండి- ఈ నగరంలో కొంటే మరింత తగ్గనున్న రేట్‌!

Gold-Silver Price 30 November 2022: బంగారం కొనాలంటే మాత్రం ఆలస్యం చేయకండి- ఈ నగరంలో కొంటే మరింత తగ్గనున్న రేట్‌!

Gold-Silver Price 29 November 2022: 53వేల రూపాయల కంటే దిగువకు బంగారం- తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇవే!

Gold-Silver Price 29 November 2022:  53వేల రూపాయల కంటే దిగువకు బంగారం- తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇవే!

TS News Developments Today: బైంసాలో బీజేపీ బహిరంగసభ నేడు, హాజరుకానున్న కేంద్రమంత్రి

TS News Developments Today: బైంసాలో బీజేపీ బహిరంగసభ నేడు, హాజరుకానున్న కేంద్రమంత్రి

Petrol-Diesel Price, 29 November 2022: డీజిల్‌ కొట్టించాలంటే మాత్రం ఈ జిల్లాల్లో బెటర్!

Petrol-Diesel Price, 29 November 2022: డీజిల్‌ కొట్టించాలంటే మాత్రం ఈ జిల్లాల్లో బెటర్!

టాప్ స్టోరీస్

Praja Sangrama Yatra: 6 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు- వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: బండి సంజయ్

Praja Sangrama Yatra: 6 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు- వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: బండి సంజయ్

IND vs NZ 3rd ODI: వర్షంతో మూడో వన్డే రద్దు- 1-0తో సిరీస్ కైవసం చేసుకున్న కివీస్

IND vs NZ 3rd ODI: వర్షంతో మూడో వన్డే రద్దు- 1-0తో సిరీస్ కైవసం చేసుకున్న కివీస్

YS Sharmila: గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు - ఎమ్మెల్సీ కవితకు షర్మిల స్ట్రాంగ్ రిప్లై

YS Sharmila: గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు - ఎమ్మెల్సీ కవితకు షర్మిల స్ట్రాంగ్ రిప్లై

Allu Arjun Landed in Russia : రష్యాలో అల్లు అర్జున్ అండ్ 'పుష్ప' టీమ్

Allu Arjun Landed in Russia : రష్యాలో అల్లు అర్జున్ అండ్ 'పుష్ప' టీమ్