కేసీఆర్ నాయకత్వంతోనే సువర్ణ ఆంధ్రప్రదేశ్ సాధ్యం: మంత్రి జగదీష్ రెడ్డి ( Image Source : Minister Jagadish Reddy Twitter )
Minister Jagadish Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. రాయల తెలంగాణ అంశం వదిలి ఆంధ్ర ప్రజలు సువర్ణ ఆంధ్రప్రదేశ్ కోసం ఆ దిశగా ఆలోచన చేయాలన్నారు. అలాగే అక్కడి ప్రభుత్వాల వైఫల్యాలతోనే రాయల తెలంగాణ అంశం తెరమీదకు వచ్చిందన్నారు. సూర్యాపేటలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గులాబీ జెండాను మంత్రి జగదీష్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాయల తెలంగాణ అంశంపై స్పందిస్తూ ప్రత్యేక రాయలసీమ, రాయల తెలంగాణ ఇప్పుడు సాధ్యం కాదన్నారు. తెలంగాణ అభివృద్ధి దిశగా దూసుకుపోవడమే రాయల తెలంగాణ డిమాండ్ కు కారణం అని చెప్పారు. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అమలు అవుతున్న పథకాలను చూసి మిగతా రాష్ట్రాల ప్రజలు తమను కూడా తెలంగాణలో కలుపుకోవాలని కోరుతున్నట్లు వివరించారు. ఇది సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి సాక్ష్యం అన్నారు.
"ఇవాళ తెలంగాణ వైపు చూస్తున్నరు అంటే తెలంగాణ పరిపాలన గొప్పతనం ఉంది. కేసీఆర్ పరిపాలన దక్షతకు అది నిదర్శనం. కానీ రాయలసీమను రాష్ట్రంతో కలుపుకోవడం అనేది మాత్రం సాధ్యం కాదు. కానీ ఉంది వాళ్ల చేతుల్లో. పరిపాలనను మార్చుకుంటే సువర్ణ ఆంధ్రప్రదేశ్ చేసుకునే అవకాశం ఉంది. కేసీఆర్ నాయకత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా బలంగా కోరుకుంటున్నరు. అందులో సందేహం లేదు. తప్పుకుండా మిగతా రాష్ట్రాలు కోరుకోవడంలో కూడా తప్పులేదు. ఇవాళ ఉన్న కక్ష పూరిత రాజకీయాలు కాకుండా పరిపాలనను ప్రజల కోసం పని చేసే వాళ్లను వాళ్ల చేతిలోకి గనుక ఇస్తే తప్పకుండా ఆంధ్ర ప్రదేశ్ సువర్ణ ఆంధ్రప్రదేశ్ అవుతుంది." - మంత్రి జగదీష్ రెడ్డి
ఏపీ పరిపాలన మార్చుకుంటే సూవర్ణాంధ్రప్రదేశ్ గా చేసుకునే అవకాశముంది. pic.twitter.com/by7EnEa6i8
— Jagadish Reddy G (@jagadishBRS) April 25, 2023
తెలంగాణలో కలపండి లేకపోతే తమ దగ్గరకి రండి అని కేసీఆర్ ను ఆహ్వానిస్తున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చినట్లే ఆంధ్రప్రదేశ్ ను సువర్ణాంధ్ర నిర్మాణం చేయడం సాధ్యమని కేసీఆర్ గతంలోనే చెప్పినట్లు వెల్లడించారు. కేసీఆర్ నాయకత్వాన్ని ఆంధ్ర ప్రజలు బలంగా కోరుకుంటున్నారని, వెనకబాటుకు కారణం అయిన పరిపాలకుల మీద ఆంధ్ర ప్రజలు తిరుగుబాటు చేయాలన్నారు. అభివృద్ధి సాధించే నాయకత్వాన్ని ఎన్నుకునే దిశగా ఆంధ్ర ప్రజలు, నాయకులు ఆలోచించాలని కోరారు.
కేసీఆర్ పాలన కావాలని పక్క రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారు. pic.twitter.com/fcMBnIx65H
— Jagadish Reddy G (@jagadishBRS) April 25, 2023
"భారతదేశం మొత్తంలోనే తెలంగాణ ఒక అద్భుతమైన పరిపాలను అందిస్తున్నది కేసీఆర్ నాయకత్వంలో అనేది అద్భుతమైన ఉదాహరణ. ఇవాళ మమ్మల్ని కూడా తెలంగాణల కలపండి అని అడిగిర్రు. అయితే ఇప్పుడొస్తున్న డిమాండ్.. గతంలో ఏదైతే డిమాండ్ వచ్చిందో దానికి ఇవాళ వచ్చినదానికి తేడా ఉంది. ఇది కేవలం ఏపీ నుంచే కాదు. ఓ పక్కన కర్ణాటక నుంచి వస్తా ఉంది. మరోపక్క మహారాష్ట్ర నుంచి, ఛత్తీస్ గఢ్ డిమాండ్ వస్తోంది. తెలంగాణను ఆనుకొని ఉన్న రాష్ట్రాలతో పాటు సరిహద్దు పంచుకోని రాష్ట్రాలు సైతం ఇవాళ ఇదే కోరుకుంటున్నాయి." - మంత్రి జగదీష్ రెడ్డి
TS Police DV: పోలీసు అభ్యర్థులకు అలర్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు ఖరారు! ఇవి తప్పనిసరి!
Group 1 Exam: 'గ్రూప్-1' ప్రిలిమ్స్ పరీక్ష వాయిదాపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఏమందంటే?
TS Inter Exams: ఇంటర్ సప్లిమెంటరీ హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!
Top 10 Headlines Today: మెగాస్టార్ ఇంట గ్రాండ్ ఎంగేజ్‌మెంట్, సుప్రీంకోర్టులో సునీత పిటిషన్ విచారణ, తెలంగాణలో బీసీలకు లక్ష
Top 10 Headlines Today: కేసీఆర్ వ్యూహం ఏంటీ? అవినాష్ అరెస్టు విడుదల!, రహానే-భరత్‌పైనే భారం, ఇవే మార్నింగ్ చూడాల్సిన వార్తలు
KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు
Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు
Apsara Murder Case Update : అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? - మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !
Schools Reopen: వేసవి సెలవులు పొడిగింపు ప్రచారం - విద్యాశాఖ ఏం చెప్పిందంటే?