అన్వేషించండి

Sathupally Crime మంచిగా ఉండాలని సూచిస్తే, ఏకంగా ఇల్లు తగులబెట్టాడు - పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు

Thief Sets Jailor House On Fire: జైలులో సత్ప్రవర్తన కలిగి ఉండాలని చెప్పిన దానిపై కోపం పెంచుకున్న ఓ దొంగ జైలర్‌ ఇంట్లో సామాన్లు ద్వంసం చేయడంతోపాటు వాటిని తగులబెట్టాడు.

Thief Sets Jailor House On Fire: జైలులో సత్ప్రవర్తన కలిగి ఉండాలని చెప్పడంతో కోపం పెంచుకున్న ఓ దొంగ.. జైలర్‌ ఇంట్లో సామాన్లు ధ్వంసం చేయడంతోపాటు వాటిని తగులబెట్టాడు. ఇంట్లో ఉన్న సర్టిఫికెట్లను ముక్కలుగా కత్తిరించి తన కోపాన్ని ప్రదర్శించాడు. దొంగ చేసిన ఈ పని ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఖమ్మం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. 
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణానికి చెందిన సోమాచారి అనే దొంగను పోలీసులు పట్టుకున్నారు. అయితే ఇతను చేసిన నేర ప్రవృత్తి గురించి పోలీసులు చెప్పిన విషయాలు హాట్ టాపిక్‌గా మారాయి. సత్తుపల్లి సీఐ కరుణాకర్‌ చెప్పిన వివరాలిలా ఉన్నాయి.

సత్తుపల్లి పట్టణంలోని అడపా సత్యనారాయణ వీదికి చెందిన నడిపల్లి రామారావు ఇంట్లో ఇటీవల చోరీ జరిగింది. ఈ ఘటనలో రూ.10 లక్షల మేర నగుదు, ఆభరణాలు దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ విషయంపై ధర్యాప్తు చేసిన పోలీసులు సీసీ పుటేజీల ఆదారంగా పాత నేరస్తుడు అయిన సోమాచారి ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. చోరీ చేసిన సమయంలో సీసీ కెమెరాలను ధ్వంసం చేసేందుకు సోమాచారి విఫలయత్నం చేశాడు. 
చోరీ సొత్తుతో విలువైన సామాగ్రి కొనుగోలు..
విలాసాలకు అలవాటు పడిన సోమాచారి చోరీ చేసిన సొత్తుతో రూ.1.61 లక్షల విలువైన సామ్‌సంగ్‌ పోల్డింగ్‌ ఫోన్‌తోపాటు రూ.35 వేల క్లాసిక్‌ వాచ్, రూ.7 వేలు విలువైన జియో స్మార్ట్‌ ఫోన్, రూ.8,800ల స్పీకర్లు కొనుగోలు చేసి వాటిని కొరియర్‌ ద్వారా ఇంటికి పంపినట్లు పోలీసులు గుర్తించారు. మిగిలిన డబ్బులో కొంత కుటుంబ సభ్యులుకు ఇచ్చి నగదుతో హైదరాబాద్, షిర్డి, నాసిక్‌లకు అద్దె కార్లలో తిరుగుతూ ఖరీదైన మద్యం సేవించినట్లు, జల్సాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. సోమాచారి నుంచి రూ.1.93 లక్షల నగదును రికవరీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రూ.10 లక్షల నగదును అపహరించిన సోమాచారి ఆ సొమ్ముతో ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయడంతోపాటు జల్సాలకు ఆ డబ్బును ఖర్చు చేశారు. 
మంచి చెప్పినందుకు ఇంటికే నిప్పు పెట్టాడు..
సోమాచారిని విచారిస్తున్న సందర్భంగా మరిన్ని విషయాలు పోలీసుల దర్యాప్తులో తేలాయి. 2019లో ఓ కేసులో సోమాచారి పోలీసులకు పట్టుబడ్డాడు. మూడేళ్ల జైలు శిక్ష విధించారు. మరో కేసులో సత్తుపల్లి జైలులో ఉన్న సమయాన అక్కడ జైలర్‌ హనుమంతరావు అతనిని మంచిగా మెలగాలని సూచించారు. ఈ విషయంపై కోపం పెంచుకున్న సోమాచారి జూలైలో జైలు నుంచి విడుదలయ్యాక జైలర్‌ హనుమంతరావుపై కక్ష సాధించాలని భావించాడు. జైలు నుంచి విడుదలయ్యాక వారం రోజుల్లో హనుమంతరావు ఇంట్లో ఎవరు లేరని గమనించి అతని ఇంట్లో ఉన్న సామాన్లు ద్వంసం చేశాడు. ఇంటికి నిప్పంటించాడు. దీంతోపాటు ఇంట్లో ఉన్న సర్టిఫికెట్లను కత్తిరించాడు.

జైలులో సత్ప్రవర్తనతో మెలగాలని సూచించిన జైలర్‌పై కోపం పెంచుకున్న సోమాచారి ఈ విధంగా జైలర్‌పై తన కోపాన్ని ప్రదర్శించినట్లు పోలీసులు వివరించారు. రామారావు ఇంట్లో చోరీ చేయడంతో పోలీసులకు చిక్కిన సోమాచారి గతంలో చేసిన నేరాలు బయటకు వచ్చినట్లు సీఐ వివరించారు. దొంగతనాలకు పాల్పడుతున్న సోమాచారికి తండ్రి, తమ్ముడు సహకరించారని వారు పరారీలో ఉన్నారని సీఐ వివరించారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన సీఐ కరుణాకర్, సిబ్బంది ఎన్‌.శ్రీనివాసరావు, లక్ష్మణ్‌రావులను ఏసీపీ వెంకటేశ్‌ అభినందించారు. కాగా సత్ప్రవర్తన కలిగి ఉండాలని చెప్పిన జైలర్‌ ఇంటినే తగులబెట్టిన సోమాచారి విషయం ఇప్పుడు ఖమ్మం జిల్లాలో చర్చానీయాంశంగా మారింది. జల్సాలకు అలవాటుపడి దొంగతనాలకు పాల్పడితే ఎప్పటికైనా పోలీసులకు చిక్కడం తప్పదనే విషయం సోమాచారి సంఘటనలో బహిర్గతమైంది. 
 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Embed widget