అన్వేషించండి

KCR: ఇది దద్దమ్మ ప్రభుత్వం కాకుంటే ఏందన్నట్టు? నా బిడ్డను తీసుకపోయి అరెస్ట్ చేసిన్రు - కేసీఆర్

Telangana News: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భువనగిరిలో రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దద్దమ్మ ప్రభుత్వంగా అభివర్ణించారు.

KCR Comments in Bhuvanagiri: తనను దేవుడు తెలంగాణ కోసమే పుట్టించారని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రజల గుండె చీలిస్తే కనిపించేది కేసీఆర్ అని.. కేసీఆర్ గుండె చీలిస్తే కనిపించేది తెలంగాణ ప్రజలు అని వ్యాఖ్యానించారు. సూర్యాపేట నుంచి మధ్యాహ్నం బయలుదేరిన  కేసీఆర్.. అర్వపల్లి, తిరుమలగిరి, జనగాం మీదుగా భువనగిరి చేరుకున్నారు. మార్గమధ్యలో పలు చోట్ల కార్యకర్తలు ప్రజలకు అభివాదం చేశారు. సాయంత్రం 7 గంటలకు ప్రారంభమైన భువనగిరి రోడ్డు షోలో స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. 

‘‘మొత్తం మూడు పార్టీలు పోటీలో ఉన్నాయి. పిచ్చిగా ఉన్మాదంతో కాకుండా ఏపార్టీకి ఓటు వేయాలో ఏ పార్టీ మనకోసం పనిచేస్తదో ఆలోచించి ఓటేయాలి. బీజేపీ మేకిన్ ఇండియా అంటూ పెద్ద పెద్ద నినాదాలు చేస్తూ ఒక్కటి అమలు చేస్తలేదు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళల మీద దాడులు జరుగుతున్నాయి. డాలరు విలువ 83 రూపాయలకు పెరిగింది. ఒకపార్టీ దేవుని పేరు చెప్పి ఓట్లు అడుగుతంది.. ఇంకో పార్టీ దేవుని మీద ఒట్లు.. ఇదీ నడుస్తాంది. మనం అద్భుతంగా యాదాద్రిని నిర్మించుకున్నం కానీ ఎన్నడూ ఓట్లకోసం వాడుకోలే. భువనగిరిలో బీజేపీ కాంగ్రెస్ మిలకత్ అయినయి. అక్షింతలు తీర్థాలు మన పిలగాన్ల కడుపునింపుతదా? తలకాయ తెగిపడ్డా కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టనని చెప్పిన మోడీకి. 

కేంద్రం ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇయ్యలే. తెలంగాణకు అన్యాయం చేసింది బీజేపీ. ఇప్పుడు యువత భవిష్యత్తు మీదే ఆలోచించాలి.  మన శత్రువే కాంగ్రెస్ పార్టీ. నాడు ఎవ్వడు లేకున్నా తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చుకుని పదేండ్లు నడిపినాం. తల్లికొడివలే అందరినీ కాపాడుకున్నాం. మొదటి సంవత్సరంలోనే చెడిపోయిన కరెంటును బాగుచేసుకున్నాం. రైతులకు రైతుబంధు ఇచ్చుకున్నాం. బసవపురం రిజర్వాయర్ కట్టుకున్నం. కాంగ్రెస్ పెద్దలు ఐదెకరాలకు రైతుబంధు ఇస్తామంటున్నారు. మరి ఆరో ఏకరం వాడు ఎటుపోవాలి? పొలాలను ఎండబెట్టిండ్రు. బోర్లు ఎండినాయి పూడికలు తీసే క్రేన్లు మల్లోచ్చినాయి. ధాన్యం కొంటలేరు. రాత్రిపూట మోటర్ పెట్టి పాము కాట్లకు సచ్చే దుర్మార్గపు పాలన కాంగ్రెస్ ది. 

కేసీఆర్ పొంగనే కట్క బంజేసినట్టే నీళ్లు ఆగినాయి కరెంటు ఆగింది. దద్దమ్మ ప్రభుత్వం కాకుంటే ఏందన్నట్టు. రైతులు చనిపోతే ఒక్క మంత్రి పోలె సీఎం పోలె. నా కండ్లముందాలనే పంట ఎండిపోతే ఎంజేయాల్నే నోరుమూసుకుని ఊకోవాల్నా కొట్లాడాల్నా? ఫీజు రీఎంబర్స్‌మెంట్ ఇస్తాలేరు. చేనేత కార్మికులను ఆదుకుంటలేరు. నిరుద్యోగ భత్యం లేదు.. అంతా బోగస్. పంట ధాన్యానికి ఐదొందలు బోనస్ అన్నరు ఇప్పుడు లేదు అంటున్రు. రెండు లక్షలు రుణమాఫీ అన్నారు ఇచ్చిండ్రా? కల్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం తుస్సుమన్నది బోనస్ అయింది.

నా గుండె చీలిస్తే కనపడేది ప్రజలే
గృహజ్యోతికి విద్యుత్తు.. పరిస్థితి అన్న వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రాలు పోయినట్టు అయింది. స్కూటీ రాలేదు కానీ లూటీ అయితాది. నన్ను తెలంగాణ కోసం పుట్టించిండ్రు దేవుడు. ప్రజల గుండె చీలిస్తే కనిపించేది కేసీఆర్.. కేసీఆర్ గుండె చీలిస్తే కనపడితే కనిపించేది తెలంగాణ ప్రజలు. దేర్ హోగా మగర్ అందేర్ నహీ.. మనది సెక్యులర్ పార్టీ. నా బిడ్డను తీసుకపోయి అరెస్ట్ చేసిండ్రు.. ప్రాణం పోయేదాకా న్యాయం కోసం కొట్లాడుతాం. బీఆర్ఎస్ కారు గుర్తుమీద ఓటేసి క్యామ మల్లేష్ గారిని గెలిపించండి. ఆయన 24 గంటలు మీ సేవలో వుంటాడు తలలో నాలుక లాగా ఉంటాడు. ఇదే ఉత్సాహం మే 13 దాకా చూయించి బీఆర్ఎస్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి’’ అని కేసీఆర్ పిలుపు ఇచ్చారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Game Changer Third Single: నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Embed widget