అన్వేషించండి

Falaknuma Express Fire Accident: ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ లో అగ్నిప్రమాదం, కేసు నమోదు చేసిన పోలీసులు

Falaknuma Express Fire Accident: ఫలక్ నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లో అగ్నిప్రమాదంపై రైల్వే యాక్ట్‌ సెక్షన్‌ 80/2023 కింద కేసు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

Falaknuma Express Fire Accident: ఫలక్ నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లో అగ్నిప్రమాదంపై అధికారులు కేసు నమోదు చేశారు. నల్గొండ జి.ఆర్.పి స్టేషన్లో అధికారులు కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదంలో 5 బోగీలు పూర్తిగా దగ్ధమైనట్లు రైల్వే యాక్ట్‌ సెక్షన్‌ 80/2023 కింద కేసు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు తెలిపారు. ఒక బోగీ పాక్షికంగా దగ్దమైనట్లు పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పగిడిపల్లి - బోమ్మాయిపల్లి స్టేషన్ల మధ్య ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ అగ్నిప్రమాదంపై విచారణకు ఆదేశించామని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ జైన్‌ తెలిపారు. ఉన్నతాధికారులతో కలిసి ఆయన రైలు ప్రమాదానికి గురైన ప్రాంతాన్ని సందర్శించారు.

హౌరా నుంచి సికింద్రాబాద్‌ వస్తున్న ఫలక్‌నుమా సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ లో అగ్ని ప్రమాదం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రయాణికుల అప్రమత్తతోనే ఘోర ప్రమాదం తప్పిందని అధికారులు చెబుతున్నారు. పొగలు రావడంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా అరుపులు, కేకలు పెట్టారని, అంతలోనే రైలు ఆగిపోవడంతో హుటాహుటినా అందరు రైలు దిగి ప్రాణాలు కాపాడుకున్నారని అధికారులు తెలిపారు. అయితే ఒక్కో బ్యాగు మాత్రమే ఉన్న వారు, ఒంటరిగా ప్రయాణం చేస్తున్నవారు వెంటనే రైలు దిగిపోగా.. ఎక్కువ లగేజీతో ప్రయాణిస్తున్న వారు, కుటుంబంతో కలిసి ఉన్న వారి పరిస్థితి దారుణంగా మారింది. ఓ వైపు మంటలు పెరిగిపోతూ ఒక బోగీ నుంచి మరో బోగీకి వ్యాపిస్తుండగా.. కిక్కిరిసిపోయిన ప్రయాణికుల నుంచి కుటుంబసభ్యులను, లగేజీని బయటకు తీసుకువచ్చేందుకు అవస్థ పడ్డట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మంటలు బోగీలకు వ్యాపించి పూర్తిగా కాలిపోయే లోపే ప్రయాణికులంతా దిగిపోవడంతో ప్రాణ నష్టం జరగలేదని చెబుతున్నారు. 

ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారంటే?

ఫలక్‌నుమా సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన ప్రమాదం గురించి చెబుతూ ప్రత్యక్ష సాక్షులు వణికిపోతున్నారు. ఓ ప్రయాణికుడు సిగరెట్ తాగడం వల్లే ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ఛార్జింగ్ పాయింట్ సమీపంలో సిగరెట్‌ తాగారని అంటున్నారు. అక్కడ సిగరెట్ కాల్చవద్దని పదే పదే అతనికి హెచ్చరించినా వినిపించుకోలేదని వివరిస్తున్నారు. దీని వల్ల ఎస్‌ 4లో మంటలు చెలరేగాయన్నారు. అవి క్షణాల్లోనే మిగిలిన మూడు బోగీల్లోకి వ్యాపించాయంటున్నారు. 

నాలుగు రోజుల క్రితమే బెదిరింపు లేఖ

దక్షిణ మధ్య రైల్వేకు నాలుగు రోజుల క్రితం ఓ బెదిరింపు లేఖ వచ్చినట్టు తెలుస్తోంది. ఎలాంటి ఫ్రమ్‌ అడ్రెస్ లేకుండానే వచ్చిందా లేఖ. మరో నాలుగు రోజుల్లో ఒడిశా తరహా ఘటన చూడబోతున్నారంటూ ఆగంతకులు ఆ లేఖలో హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ కోణంలో కూడా రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Telangana Mass Killing:షాబాద్‌, దైవాలగూడలో అర్థరాత్రి ఏం జరిగింది? పోలీసులు చెప్పింది వింటే వణుకుపుడుతుంది!
షాబాద్‌, దైవాలగూడలో అర్థరాత్రి ఏం జరిగింది? పోలీసులు చెప్పింది వింటే వణుకుపుడుతుంది!
Telangana Mass Killing: పోలీసుల నిర్లక్షంతోనే షాబాద్‌ మర్డర్స్‌! దైవాలగూడ ప్రజల ఆందోళన!
పోలీసుల నిర్లక్షంతోనే షాబాద్‌ మర్డర్స్‌! దైవాలగూడ ప్రజల ఆందోళన!
Breaking News: 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
Telangana BJP: తెలంగాణపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌! ఢిల్లీ నుంచి పెద్దల క్యూ! భారీగా చేరికలకు ప్లాన్!
తెలంగాణపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌! ఢిల్లీ నుంచి పెద్దల క్యూ! భారీగా చేరికలకు ప్లాన్!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
Telangana Political Mind Games: విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
Thamizh Murugan Vs God of War: ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
Lenin Collection Day 1: లెనిన్ కలెక్షన్లు... ఫస్ట్ డే అదరగొట్టిన అయ్యగారు - ఎన్ని కోట్లు వచ్చాయంటే?
లెనిన్ కలెక్షన్లు... ఫస్ట్ డే అదరగొట్టిన అయ్యగారు - ఎన్ని కోట్లు వచ్చాయంటే?
విష్ణు సహస్రనామ పఠనం: అద్భుత ప్రయోజనాలు, శక్తి రహస్యాలు!
విష్ణు సహస్రనామ పఠనం: అద్భుత ప్రయోజనాలు, శక్తి రహస్యాలు!
Cancer Risk: అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
CM Revanth Reddy Khammam Sabha: కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
Embed widget