Bhadradri Ramadasu: శ్రీరాముడి భక్తులు ఆనందపడే మరో దృశ్యం వెలుగులోకి- ఈసారి ఎక్కడంటే?
Khammam News: ఖమ్మం జిల్లాలో ఓ మర్రి చెట్టు తొర్రలో భక్త రామదాసు విగ్రహం తొలిసారి వెలుగులోకి వచ్చింది.
Ramadasu Statue: ఖమ్మం జిల్లాలో శ్రీరాముడి భక్తుడు కంచర్ల గోపన్న విగ్రహం వెలుగులోకి వచ్చింది. నేలకొండపల్లిలో రామదాసు ప్రతిమ తొలిసారిగా బయటపడింది. రాముడి భక్తుడిగా కీర్తి పొందిన కంచర్ల గోపన్న ఎలా ఉంటాడనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. ఆయనకు సంబంధించిన చాలా వివరాలు తెలియలేదు. ఇప్పుడు విగ్రహం వెలుగులోకి రావడంతో వీటిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో నివాసం ఉంటున్న శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంటి ఆవరణంలో గోపన్న విగ్రహం వెలుగు చూసింది. రావిచెట్టు తొర్రలో ఇది దొరికింది. పాతపోలీస్ స్టేషన్ ఫర్నీచర్ మార్చినప్పుడు ఇది చెట్టు తొర్రలో పెట్టేసి ఉంటారని తెలుస్తోంది. అయితే ఎక్కడి నుంచి వెలుగు చూసిందనే రికార్డులు మాత్రం లేవు. వెంటనే ఆయన చరిత్రకారులను పిలిచి విషయంపై చర్చించారు. వారంతా ఆ విగ్రహాన్ని పరిశీలించి ఇది రామదాసు విగ్రహమని నిర్ధారించారు.
రామదాసు విగ్రహాన్ని ఆయన వారసులకు అప్పగించారు. అనంతరం స్థానికంగా ఉండే ధ్యాన మందిరంలో దీన్ని ఉంచారు. రామదాసు జయంతి నాటికి ఈ విగ్రహం ప్రతిష్ఠాపనపై కార్యక్రమం చేపట్టాలని రామదాసు వారసులు కోరుతున్నారు. విగ్రహం ధోవతి ధరించి అర్థనగ్నంగా ఉంది. అంజలి ముద్ర, కత్తి, మీసాలు, లూజ్ హెయిర్, భుజాలపై శంకుచక్రాలు ఉన్నాయి.