Breaking News Telugu Live Updates: ప్రేమ పేరిట వివాహితకు వేధింపులు, కిరోసిన్ పోసి నిప్పుపెట్టిన యువకుడు
Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం
LIVE

Background
ప్రేమ పేరిట వివాహితకు వేధింపులు, కిరోసిన్ పోసి నిప్పుపెట్టిన యువకుడు
శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తొండుపల్లిలో వివాహితపై యువకుడు కిరోసిన్ పోసి నిప్పుపెట్టాడు. కొంతకాలం నుంచి సదరు వివాహితను ప్రేమిస్తున్నట్టు పెళ్లి చేసుకోవాలని యువకుడు మహిళ వెంటపడుతున్నాడు. సదరు మహిళపై కిరోసిన్ పోసి అతను కూడా కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు ఘటనా స్థలానికి చేరుకొని ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణలో ప్రాజెక్ట్ ల అవినీతిపై సీబీఐ కి పిర్యాదు చేసిన షర్మిల
ఢిల్లీ: సీబీఐ కి పిర్యాదు చేసిన వైఎస్ షర్మిల
తెలంగాణ లో ప్రాజెక్ట్ ల పేరుతో జరిగిన అవినీతి పై పిర్యాదు చేసిన వైఎస్ షర్మిల
విచారణ జరిపించాలని వినతి పత్రం ఇచ్చిన వైఎస్ షర్మిల
కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో లక్ష కోట్ల అవినీతి - వైఎస్ షర్మిల
మెగా కంపెనీ తో కలిసి లక్ష కోట్ల అవినీతి - వైఎస్ షర్మిల
Munugode By Election: టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన సీఎం కేసీఆర్
మునుగోడు ఉప ఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జీ, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని పార్టీ అధినేత సిఎం కేసిఆర్ ప్రకటించారు. ఉద్యమకారుడుగా పార్టీ ఆవిర్భావ కాలం నుంచీ కొనసాగుతూ, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేస్తున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డినే కోరుకుంటూ, స్థానిక నాయకులు కార్యకర్తలు, జిల్లా పార్టీ నాయకత్వం, నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలను, సర్వే రిపోర్టలను పరిశీలించిన మీదట సిఎం కెసిఆర్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు.
AP 3 Capitals: మూడు రాజధానులు కోసం ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే రాపాక
అంబేద్కర్ కోనసీమ జిల్లా.. రాజోలు.
మూడు రాజధానులు కోసం ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు
మలికిపురం లో కనకదుర్గమ్మ ఆలయంలో ఎమ్మెల్యే రాపాక మూడు రాజధానులకు మద్దతుగా ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే రాపాక మాట్లాడుతూ మూడు రాజధానుల నిర్ణయానికి ప్రజలందరూ మద్దతు తెలియజేస్తున్నారని, పరిపాలన వికేంద్రీకరణను ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని విభజించే సమయంలో హైదరాబాద్ తెలంగాణకు వెళ్లిపోవడంతో ఆంధ్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఈ రాజకీయ వికేంద్రీకరణ ద్వారా, మూడు రాజధానుల నిర్మాణంతో ప్రజలకు మేలు చేకూరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Munugode By Election: మునుగోడు నామినేషన్ల తొలిరోజే రెండు చోట్ల డబ్బు స్వాధీనం
ఉమ్మడి నల్గొండ జిల్లా మునుగోడు ఉపఎన్నిక కు నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. మునుగోడు ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలకు ముందే నగదు లభ్యమైంది. నామినేషన్ల మొదటి రోజే మునుగోడు నియోజకవర్గంతో పాటు హైదరాబాద్ లోనూ భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. జూబ్లీహిల్స్ లో 50 లక్షల రూపాయలు కారులో తరలిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారని సమాచారం. ఈ నగదుకు ఎన్నికల ప్రచారానికి సంబంధం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

