By: ABP Desam | Updated at : 18 Oct 2022 02:45 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
బండి సంజయ్
Bandi Sanjay : టీఆర్ఎస్ నేతల కళ్లు మునుగోడు నియోజకవర్గ భూములపై పడ్డాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ఎన్నికల ప్రచారం పేరుతో టీఆర్ఎస్ దండుపాళ్యం ముఠా మునుగోడులో ఊరూరా తిరుగుతూ భూముల గురించి ఆరా తీస్తున్నాయని అన్నారు. టీఆర్ఎస్ గెలిచిన వెంటనే ఈ నియోజకవర్గంలోని భూములన్నీ కబ్జా చేయబోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగా టీఆర్ఎస్ నేతలు ఓటుకు రూ.40 వేలు ఇవ్వబోతున్నారని చెప్పారు. టీఆర్ఎస్ నేతలిచ్చే డబ్బులన్నీ పేదల రక్తం పీల్చి సంపాదించిన సొమ్మేనని విమర్శించారు. ఆ పైసలన్నీ కచ్చితంగా తీసుకోవాలని, ఓటు మాత్రం పువ్వు గుర్తుకు వేసి టీఆర్ఎస్ కు బుద్ది చెప్పాలన్నారు. మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా బండి సంజయ్ తిరుగుండ్లపల్లి, తమ్మడపల్లిలో రోడ్ షో ప్రారంభించారు. రోడ్ షో లో ప్రజలు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
యుద్ధం మొదలైంది
తెలంగాణలో యుద్ధం స్టార్ట్ అయ్యిందని బండి సంజయ్ తెలిపారు. రాక్షసులకు, రామదండు మధ్య యుద్ధం మొదలైందన్నారు. సిద్దిపేటలో ఆడోళ్ల పుస్తెల తాడును తెంపుకొచ్చిన టీఆర్ఎస్ దండుపాళ్యం ముఠా మునుగోడు మీద పడిందన్నారు. మునుగోడులో ఆత్మగౌరవానికి, అహంకారానికి మధ్య జరుగుతున్న పోరాటం అన్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఏమొచ్చిందని అన్నోళ్లంతా ఇవాళ మునుగోడులోనే ఉన్నారన్నారు. ఏకంగా 15 మంది మంత్రులు, 86 ఎమ్మెల్యేలంతా మునుగోడు ప్రజల కాళ్ల దగ్గరకు వచ్చారన్నారు. అడిగిందల్లా ఇస్తామని ఆశ చూపుతున్నారన్నారు. మునుగోడులో ఇంటింటికీ తిరిగి ఓటుకు రూ.40 వేలు పంచేందుకు టీఆర్ఎస్ నేతలు సిద్ధమయ్యారన్నారు. అవన్నీ పేదోళ్ల రక్తం తాగి సంపాదించిన పైసలే అని మండిపడ్డారు. పేదోళ్లు పైసలు పడేస్తే ఓట్లేస్తారని కేసీఆర్ అనుకుంటున్నారని, ఆ పైసలన్నీ పక్కా తీసుకోండి ఓటు ఎవరికి వేయాలో అక్కడ వేసి టీఆర్ఎస్ కు బుద్ది చెప్పాలన్నారు.
ఓటమి భయంతో కేసీఆర్ ఢిల్లీకే పరిమితం
"ఇన్నాళ్లు టీఆర్ఎస్ నేతలు సంపాదించిన డబ్బలు సరిపోనట్లున్నాయి. ఇప్పుడు టీఆర్ఎస్ నేతల కళ్లు మునుగోడు భూముల మీద పడ్డాయి. ఊరూరూ తిరుగుతూ భూముల గురించి ఆరా తీస్తున్నారు. రేపు టీఆర్ఎస్ గెలిస్తే ఇక్కడ భూములన్నీ కబ్జా చేయబోతున్నారు. హుజూరాబాద్, దుబ్బాకలో ఎన్నికలొచ్చాయి కాబట్టే అక్కడ అంతో ఇంతో అభివృద్ధికి నిధులొచ్చాయి. మునుగోడులో కూడా అంతే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయంగానే గట్టుప్పల్ మండలం ఏర్పాటైంది. కొత్త రోడ్లు మంజూరు అవుతున్నాయి. గొర్లకు డబ్బులొస్తున్నాయి. ఇన్నాళ్లుగా దళితులకు మూడెకరాలు, డబుల్ బెడ్రూం ఇళ్లు, పెన్షన్లు ఇవ్వాలని అడిగితే ఏనాడూ కేసీఆర్ పట్టించుకోలేదు. ఎన్నికలు రాగానే అన్నీ ఇస్తామని ఆశపెడుతున్నారు. ఇన్ని చేసినా ఉపఎన్నికల్లో బీజేపీయే గెలుస్తుందని సర్వేల రిపోర్టులు రాగానే కేసీఆర్ కు భయం పట్టుకుని జ్వరం వచ్చింది. ఏం చేయాలో తెలియక ఢిల్లీకే పరిమితమయ్యారు. మునుగోడులో బీజేపీ కార్యకర్తలకు ఇళ్లు ఇవ్వనీయడంలేదు. రేపు టీఆర్ఎస్ గెలిస్తే ఇక్కడ భూములన్నీ కబ్జా చేయబోతున్నారు. ఇక్కడ యువతకు ఉద్యోగాల్లేవు. ఉద్యోగాలు రానోళ్లు, దళిత బంధు రానోళ్లు, డబుల్ బెడ్రూం ఇండ్లు రానోళ్లు, టీఆర్ఎస్ పాలనలో దగాపడ్డోళ్లంతా బీజేపీకి ఓటేయాలని కోరుతున్నారు."- బండి సంజయ్
Telangana Election Results 2023 LIVE: ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ, తెలంగాణ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ
Telangana Elections Resluts 2023: 'కారు' హ్యాట్రికా! లేక అధికారం 'హస్త' గతమా ? - తెలంగాణ ప్రజల తీర్పు ఏంటి ?
Postal Ballot Box Issue: ఆర్డీవో ఆఫీసులో పోస్టర్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్, కాంగ్రెస్ నేతల ఆందోళనతో ఉద్రిక్తత
DK Shivakumar to Hyderabad: కాంగ్రెస్ భారీ స్కెచ్, రంగంలోకి డీకే శివకుమార్ - కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సేఫ్!
Telangana Election Results 2023: విజయోత్సవ ర్యాలీలు, వేడుకలు చేస్తే కఠిన చర్యలు - నేతలు, కార్యకర్తలకు అలర్ట్
YS Jagan Review Cyclone Michaung: 140 రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు- తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష
Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!
Congress Complaint: బీఆర్ఎస్ పై సీఈవోకు కాంగ్రెస్ ఫిర్యాదు - రాజీనామాలు సమర్పించేందుకే కేబినెట్ భేటీ ఉండొచ్చన్న ఉత్తమ్
Weather Update: మిచాంగ్ తుపానుగా మారిన వాయుగుండం, ఏపీపై తీవ్ర ప్రభావం - భారీ వర్ష సూచనతో IMD రెడ్ అలర్ట్
/body>