News
News
వీడియోలు ఆటలు
X

తెలంగాణ సచివాలయం గురించి మరికొన్ని ఇంట్రస్టింగ్ ముచ్చట్లు!

సచివాలయ ప్రారంభానికి ఎవరెవరు వస్తారు?

సెక్రటేరియట్‌కు ఎన్ని గేట్లుంటాయి? ఏ ద్వారం ఎవరికి?

FOLLOW US: 
Share:

తెలంగాణ సచివాలయం! వందేళ్ల విజన్‌తో కడుతున్న ఆధునిక పాలనా దేవాలయం! సాగర తీరాన ఠీవీగా నిలబడ్డ సౌథంలో ప్రతీ అణువూ అబ్బురం! ప్రతీ అంతస్తు అద్భుతం! రాజసం ఉట్టిపడే ఈ పరిపాలనా భవనం సకల సౌకర్యాల సమాహారం! అడుగడుగునా ఆధునిక సాంకేతికత మేళవించిన ఈ సచివాలయంలో ఊహకందని సదుపాయాలెన్నో! ఫర్నిచర్ దగ్గర్నుంచి పూలకుండీల వరకు.. టెక్నాలజీ మొదలుకుని టాయిలెట్ల వరకు.. అంతా ఇంటర్నేషనల్ స్టాండర్ట్!

ఏప్రిల్ 30న ప్రారంభమయ్యే తెలంగాణ సచివాలయ ప్రారంభానికి సంబంధించి సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  సీఎం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉదయం శాస్త్రోక్తంగా నిర్వహించే కార్యక్రమాలను రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి నిర్వహిస్తారు. అనంతరం పండితులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ప్రారంభ కార్యక్రమం వుంటుంది. సంబంధిత సమయాన్ని త్వరలో ప్రకటిస్తారు. సచివాలయం ప్రారంభం కాగానే ముందుగా ముఖ్యమంత్రి చాంబర్లో ఆసీనులౌతారు. వెంటవచ్చిన మంత్రులు కార్యదర్శులు సీఎంవో సిబ్బంది తదితర సచివాలయ సిబ్బంది వారి వారి చాంబర్లల్లోకి వెళ్లి సీట్లల్లో కూర్చుంటారు.

ఈ కార్యక్రమానికి సచివాలయ సిబ్బందితో పాటు మంత్రులు, ఎంపీలు , ఎమ్మెల్సీలు,ఎమ్మెల్యేలు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ చైర్మన్లు, అన్ని శాఖల హెచ్‌ఓడీలు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, DCCB, DCMS చైర్మన్లు జిల్లా గ్రంథాలయాల చైర్మన్లు, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు మున్సిపల్ మేయర్లు తదితరులు హాజరవుతారు.  

 అందరూ కలిపి దాదాపు 2500 మంది హాజరవుతారని అంచనా. ఆహ్వానితులకు అక్కడే భోజనాలు ఏర్పాటు చేస్తారు. నూతన సచివాలయంలో రక్షణ సహా పలు రకాల పకడ్బందీ చర్యలు ఇప్పటికే చేపట్టారు. సచివాలయం నాలుగు దిక్కుల్లో ప్రధాన ద్వారాలున్నాయి. వాటిల్లో నార్త్ వెస్ట్  ద్వారం అవసరం వచ్చినపుడు మాత్రమే ఓపెన్ చేస్తారు. ఈశాన్యం గేట్ నుంచి సచివాలయ సిబ్బంది, కార్యదర్శులు, ఇతర అధికారులు రాకపోకలు సాగిస్తారు. అదే వైపు పార్కింగు వుంటుంది. సౌత్ ఈస్ట్ ద్వారాన్న కేవలం విజిటర్స్ కోసం మాత్రమే కేటాయించారు. సచివాలయ సందర్శన సమయం మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు ఉంటుంది.

తూర్పున ఉన్న గేట్ -మెయిన్ గేట్. దీన్ని ముఖ్యమంత్రి, CS , DGP, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,ఎంపీలు, చైర్మన్లు ఇంకా ముఖ్యమైన ఆహ్వానితులు, దేశ విదేశీ అతిథులు ప్రముఖుల కోసం మాత్రమే వినియోగిస్తారు. వికలాంగులకు వృద్దుల కోసం ఎలక్ట్రికల్ వాహనాలను ఏర్పాటు చేశారు. ప్రయివేట్ వాహనాలుకు సచివాలయంలోకి అనుమతి లేదు. సచివాలయం రక్షణకు సంబంధించి DGP విధి విధానాలు రూపొందించి పకడ్బందీ చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.

ఆరో అంతస్తులో ఉండే సీఎం చాంబర్ అధునాతంగా తీర్చిదిద్దారు. తెల్లనిరంగుతో కూడిన గోల్డ్ కలర్ పట్టీలతో తీర్చిదిద్దిన గోడలు, గోడల రంగుతో సరిపోయేవిధంగా మార్బుల్ ఫ్లోరింగ్, విశాలమైన కారిడార్లు ముచ్చటగొలిపేలా ఉన్నాయి. సీఎం చాంబర్లోని సమావేశ మందిరంలోని ఫర్నిచర్ రాయల్ లుక్‌తో వుంది. కలెక్టర్ల కాన్పరెన్స్ హాల్, ప్రజాప్రతినిధుల వెయిటింగ్ లాంజ్, విఐపీల వెయిటింగ్ లాంజ్ సెక్రటేరియట్‌లో ప్రధానాకర్షణ. మంత్రులకు కేటాయించిన శాఖలన్నీ ఒకేదగ్గర కొలువుదీరాయి. సచివాలయం ప్రహారీకి అంతర్గతంగా, బయటా రోడ్లు విశాలంగా ఉంటాయి. 

ఈ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి మరికొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. వాటిల్లో ఒకటి గృహలక్ష్మీ పథకం.  ఖాళీజాగలున్నవారికి 3 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసే ఈ స్కీం అమలుకు వెంటనే విధి విధానాలను రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దాంతోపాటు పోడుభూముల పట్టాల పంపిణీ కార్యక్రమం త్వరలో ప్రారంభించాలని సూచించారు. గొర్రెల పంపిణీ, దళిత బంధు కొనసాగింపుపై సీఎం నిర్ణయాలు తీసుకున్నారు.

Published at : 04 Apr 2023 11:40 PM (IST) Tags: Hyderabad Telangana KCR TS Govt secratariet

సంబంధిత కథనాలు

Telangana Formation Day: తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన 12 సంఘటనలు, చారిత్రక ఘట్టాలు ఇవే!

Telangana Formation Day: తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన 12 సంఘటనలు, చారిత్రక ఘట్టాలు ఇవే!

PSTU Admissions: తెలుగు యూనివర్సిటీ ప్రవేశ ప్రకటన విడుదల, కోర్సుల వివరాల ఇలా!

PSTU Admissions: తెలుగు యూనివర్సిటీ ప్రవేశ ప్రకటన విడుదల, కోర్సుల వివరాల ఇలా!

Hayath Nagar Deaths Case: రాజేశ్, టీచర్ మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి! అసలు విషయం తేల్చిన పోలీసులు

Hayath Nagar Deaths Case: రాజేశ్, టీచర్ మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి! అసలు విషయం తేల్చిన పోలీసులు

TSPSC Paper Leak Case: మరో 13 మంది అభ్యర్థులకు టీఎస్ పీఎస్సీ షాక్, జీవితాంతం ఎగ్జామ్ రాయకుండా డీబార్

TSPSC Paper Leak Case: మరో 13 మంది అభ్యర్థులకు టీఎస్ పీఎస్సీ షాక్,  జీవితాంతం ఎగ్జామ్ రాయకుండా డీబార్

Father Colombo Medical College: ఫాదర్ కొలంబో కల ఇప్పటికి నెరవేరింది, మూడు మెడికల్‌ కాలేజీల నగరంగా వరంగల్‌: మంత్రి హరీష్

Father Colombo Medical College: ఫాదర్ కొలంబో కల ఇప్పటికి నెరవేరింది, మూడు మెడికల్‌ కాలేజీల నగరంగా వరంగల్‌: మంత్రి హరీష్

టాప్ స్టోరీస్

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?

Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్

Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !