(Source: ECI/ABP News/ABP Majha)
Mahaboobnagar News : పాలమూరులో అభివృద్ధి పరుగులు పెట్టాలి..అధికారులతో మంత్రుల సమీక్ష !
దేశంలోనే గ్రామీణాభివృద్ధిలో పాలమూరు అగ్రస్థానంలో ఉందని తెలంగాణ మంత్రులు ప్రకటించారు. మంత్రి ఎర్రబెల్లి అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది.
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి లో దేశంలో తెలంగాణ నెంబర్ వన్‌గా ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహబూబ్ నగర్ అభివృద్దిపై ప్రజాప్రతినిధులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. స్వచ్ఛ, పారిశుద్ధ్య, ఆన్లైన్ ఆడింటింగ్, ఈ పంచాయతీ, ఓడీఎఫ్ ఇలా అన్ని రంగాల్లో తెలంగాణ గ్రామాలే ముందున్నాయన్నారు. ఇంటింటికీ నల్లాల ద్వారా మంచినీటి సరఫరా, ఫ్లోరైడ్ రహిత మంచినీరు, 100 శాతం స్కూల్స్ లో మంచినీరు అందిస్తున్న రాష్ట్రం కూడా తెలంగాణదేనని ఆయన స్పష్టం చేశారు.
Also Read: రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన... పంట నష్టాన్ని పరిశీలించనున్న సీఎం
పల్లె ప్రగతి, నిరంతరం పారిశుద్ధ్యం, కరోనా నివారణ, టీకాలు వంటి కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగాలని..గ్రామాల్లో ఉదయం 7 గంటలకల్లా ట్రాక్టర్లు ప్రజలకు చెత్త సేకరణకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. కార్యదర్శులు కూడా 7 గంటల కే గ్రామాల్లో విధుల్లో ఉండాలని.. ఎమ్మెల్యేలు మండలాల వారీగా తమ నియోజవర్గం సమీక్షలు జరపాలని సూచించారు. ఉపాధి హామీ నిధులను విరివిగా వాడుకుని పంచాయతీ భవనాలకు, కాలువల పూడిక తీత వంటి పనులు చేపట్టాలన్నారు. త్వరలోనే మరిన్ని సీసీ, బిటి రోడ్లు, మురుగునీటి కాలువలకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
వైకుంఠధామాలను దేవాలయంలా తీర్చిదిద్దాలని..వాటికి మిషన్ భగీరథ నీటిని వాడాలన్నారు.పూల మొక్కలతో ఫెన్సింగ్ చేసి సుందరంగా సిద్ధంగా చేయాలన్నారు. పూర్తి చేసిన వైకుంఠ ధామాలను, డంపింగ్ యార్డులను వెంటనే అందుబాటులో కి తేవాలని అధికారులను ఆదేశించారు. వెనుకబడిన పాలమూరు జిల్లా పై సీఎం కెసిఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన గిరిజన , ఎస్సీ రిజర్వు గ్రామ పంచాయతీల భవనాల నిర్మాణాలకు సబ్ ప్లాన్ నిధుల వినియోగంపై కేసీఆర్ ఆదేశాల ప్రకారం చర్యలుతీసుకోవాలన్నారు.
Also Read: టార్గెట్ 2023... వరంగల్ లో దూకుడు పెంచిన బీజేపీ
ఉపాధిహామీ కింద కల్వకుర్తి ఎత్తిపోతల పంప్ హౌస్ లోకి నీళ్లు వచ్చే ఇన్ ఫాల్ రెగ్యులేటర్ వెంటనే నిర్మించాలని కాలువలు తవ్వాలన్నారు. ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు, మైనర్ కాలువల పూడిక తీయడానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి ఉపాధిహామీ కింద పూర్తి చేయాలని మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. రూరల్ వాటర్ సప్లైలో సంబంధిత ఏజెన్సీలలో క్షేత్రస్థాయిలో ఉద్యోగుల సంఖ్య పెంచి సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. గతంలో సీఎం కెసిఆర్ ఆదేశించిన మేరకు కోయిల్ సాగర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని డ్రింకింగ్ వాటర్ కు కేటాయించాలని మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. కేసీఆర్ ఆదేశించిన విధంగా... పనులు జరిగేట్లు అధికారులు చర్యలు తీసుకోవాలనికోరారు.
Also Read: ఈ సంక్రాంతికి దుమ్ములేపిన చికెన్ సేల్స్.. 60 లక్షల కిలోలు తినేసిన హైదరాబాదీలు, మటన్ సేల్స్ ఎంతంటే..