Thummala Nageswara Rao 'సన్ ఫ్లవర్ రైతులు తొందరపడొద్దు' - కనీస మద్దతు ధరపై మార్క్ ఫెడ్ అధికారులకు మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు
Telangana News: తెలంగాణలో సన్ ఫ్లవర్ రైతులు తొందర పడొద్దని.. తక్కువ ధరకు పంటను విక్రయించవద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.
Minister Thummala Key Advice to Sun Flower Farmers: తెలంగాణలో (Telangana) సన్ ఫ్లవర్ రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswararao) కీలక సూచన చేశారు. రైతులు ఎవరూ తొందర పడొద్దని క్వింటా రూ.6,760 కంటే తక్కువ ధరకు విక్రయించొద్దని సూచించారు. అలాగే, శుక్రవారం నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని.. పంటకు కనీస మద్దతు ధర కల్పించాలని మార్కెటింగ్, మార్క్ ఫెడ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ
అటు, ఈ అంశంపై మంత్రి తుమ్మలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) మంత్రికి ట్విట్టర్ వేదికగా వేదికగా విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో సన్ ఫ్లవర్ రైతులు మద్దతు ధర లేక నష్టపోతున్నారని అన్నారు. 'ఈ ఏడాది మద్దతు ధర రూ.6,760 ఉండగా మార్కెట్ లో మాత్రం రూ.4 వేల నుంచి రూ.5 వేలకే రైతులు అమ్ముకుంటున్నారు. ప్రతి క్వింటాలుకు దాదాపు రూ.2 వేలు నష్టపోతున్నారు. గతంలో మా ప్రభుత్వం మార్కెట్ యార్డుల్లో మద్దతు ధరకు రైతుల నుంచి సన్ ఫ్లవర్ కొని రైతులను ఆదుకున్నాం. మీరు వెంటనే అధికారులను ఆదేశించి రాష్ట్ర వ్యాప్తంగా సన్ ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మద్దతు ధరకు సన్ ఫ్లవర్ కొని రైతుల ప్రయోజనాలు కాపాడాలని కోరుతున్నాను.'
గౌరవనీయులైన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు గారికి..
— Harish Rao Thanneeru (@BRSHarish) February 22, 2024
రాష్ట్రవ్యాప్తంగా సన్ఫ్లవర్ పండించిన రైతులు మద్దతు ధర రాకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ సంవత్సరం మద్దతు ధర రూ. 6760 ఉండగా మార్కెట్లో మాత్రం రూ. 4 వేల నుంచి రూ. 5 వేలకే రైతులు అమ్ముకుంటున్నారు. ప్రతి…
Also Read: Jahnavi Kandula Case : జాహ్నవి కందుల కుటుంబానికి అన్యాయమే - తీవ్రంగా స్పందించిన కేటీఆర్