Konda Surekha: హైకమాండ్‌కు వివరణ ఇచ్చిన కొండా సురేఖ - మీడియాతో మాట్లాడవద్దని ఆదేశాలు - వాట్ నెక్ట్స్ ?
Telangana Congress: కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కు మంత్రి సురేఖ వివరణ ఇచ్చారు. తన ఇబ్బందులన్నీ చెప్పానన్నారు. అంతకు మించి మీడియాతో మాట్లాడేందుకు ఆసక్తి చూపించలేదు.

Minister Surekha gave explanation to Congress in charge Meenakshi Natarajan: తెలంగాణ మంత్రి కొండా సురేఖ తన మాజీ ఓఎస్‌డీ సుమంత్ వివాదంపై పార్టీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌లకు వివరణ ఇచ్చారు. ఈ విషయంలో పరిష్కారం కోసం ప్రయత్నిస్తామని వారు కొండా సురేఖకు హామీ ఇచ్చారు. ఇక ఈ అంశాన్ని పార్టీ పెద్దలే చూసుకుంటారని మంత్రి సురేఖ తెలిపారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సిమెంటు కంపెనీల యాజమాన్యులను బెదిరించి డబ్బు వసూలు చేస్తున్నాడనే ఆరోపణలు మంత్రి కొండా సురేఖ ఓఎస్‌డీ సుమంత్‌పై రావడంతో వివాదం మొదలైంది. ఈ ఘటన ప్రభుత్వ దృష్టికి వచ్చిన తర్వాత సుమంత్‌ను ఓఎస్‌డీ పదవి నుంచి తొలగించారు. ఈ క్రమంలో పోలీసులు మంత్రి నివాసానికి చేరుకుని సుమంత్‌ను విచారించడానికి ప్రయత్నించారు. దీంతో మంత్రి కుమార్తె సుస్మితా పటేల్ మీడియాతో మాట్లాడుతూ, పార్టీ పెద్దలు తమపై కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. "తల్లిదండ్రులను లక్ష్యంగా చేసుకుని బురదజల్లుతున్నారు" అని అన్నారు.
ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద మంత్రి కొండా సురేఖ
— Sarita Avula (@SaritaAvula) October 16, 2025
మా పార్టీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్, తెలంగాణ పిసిసి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తో కూర్చొని సుదీర్ఘంగా చర్చలు జరిపినo తాజా పరిణామాలపై.
ఈ విషయంలో పరిష్కారం కోసం వారు ప్రయత్నం చేస్తాం అని హామీని ఇచ్చారు.
పార్టీ పెద్దలు సెటిల్ చేస్తా… pic.twitter.com/GbLX8MXmXP
ఈ అంశంపై మీడియాతో మాట్లాడాలని కొండా సురేఖ అనుకున్నరాు. కానీ మీనాక్షి నటరాజన్ మంత్రి సురేఖతో ఫోన్‌లో మాట్లాడి, "మీడియా ముందు వెళ్లకండి, కూర్చొని చర్చిద్దాం" అని సూచించారు. గురువారం మధ్యాహ్నం ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మంత్రి కొండా సురేఖ, కుమార్తె సుస్మితాతో కలిసి మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్‌లను కలిశారు. క్యాబినెట్ సమావేశానికి హాజరు కాకుండా ఈ భేటీలో పాల్గొన్నారు. నిన్నటి పోలీస్ ఎపిసోడ్, సుమంత్ వ్యవహారం, గత అంశాలపై మాట్లాడారు.
మా పార్టీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి నాయకుడు మహేష్ కుమార్ గౌడ్‌లతో కూర్చుని చర్చించానని సమావేశం తర్వాత కొండా సురేఖ తెలిపారు. ఈ విషయంలో పరిష్కారం కోసం వారు ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. ఇక ఈ విషయం వారే చూసుకుంటారని భరోసాతో వెళ్తున్నా. నేను చెప్పాల్సింది చెప్పాను, పార్టీ పెద్దలతో జరుగుతున్న విషయాలు వివరించాను. నాకున్న ఆలోచనలు, ఇబ్బందులు చెప్పాను. వారందరూ కూర్చొని మాట్లాడి ఒక సొల్యూషన్ తీసుకుంటామన్నారు. వాళ్లు ఏ నిర్ణయం తీసుకున్నా సరే, అందుకు కట్టుబడి ఉంటానని చెప్పారు.
ఈ వ్యవహారంలో కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. నేరుగా కొండా సురేఖ ముఖ్యమంత్రి కుటంబసభ్యులను టార్గెట్ చేయడంతో ఆమె విషయంలో సీఎం కూడా ఆగ్రహంగా ఉన్నారని అంటున్నారు.





















