KTR Tweet: గాంధీని అవమానించడంపై కేటీఆర్ ఫైర్- ఎన్ని జన్మలెత్తినా సాధించలేరని ట్వీట్!
KTR Tweet: మహాత్మా గాంధీని అవమానించడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
KTR Tweet: కోల్‌కతాలోని హిందూ మహా సభ పండల్‌లో మహాత్మా గాంధీని మహిషాసురుడిగా చిత్రీకరించడం వివాదానికి దారి తీసింది. అసుర అనే రాక్షసుడిని మహాత్మా గాంధీగా చిత్రీకరించడంపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతోంది. ఈ వివాదంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు.
కొంతమంది విష గురువులు, గాడ్సే అభిమానులు.. గాంధీ ఖ్యాతిని తగ్గిద్దామని ప్రయత్నాలు చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. అయినా వారికి అది సాధ్యం కాదన్నారు.
The only Indian who is acknowledged by the world as Vishwa Guru is Mahatma Gandhi Ji
— KTR (@KTRTRS) October 3, 2022
No matter how hard the self-styled Vish Gurus & their Godse loving disciples would like to desecrate Mahatma & denigrate his ideology, they will not succeed in a million years#MahatmaGandhiji https://t.co/M59F6LkLAP
ఇదీ జరిగింది
జాతిపిత మహాత్మా గాంధీని హిందూ మహాసభ అవమానించింది. బంగాల్ రాజధాని కోల్‌కతాలో దుర్గా మాత మండపంలో గాంధీని మహిషాసురుడిగా చిత్రీకరించారు. కోల్‌కతాలోని హిందూ మహా సభ పండల్‌లో మహాత్మా గాంధీని మహిషాసురుడిగా చిత్రీకరించడం వివాదానికి దారి తీసింది. అసుర అనే రాక్షసుడిని మహాత్మా గాంధీగా చిత్రీకరించిన అఖిల భారత హిందూ మహాసభ నిర్వాహకులు ఇబ్బందుల్లో పడ్డారు. దసరా నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో అఖిల భారతీయ హిందూ మహాసభ ఈ మండపాన్ని ఏర్పాటు చేసింది. దుర్గా మాత వధించిన అసురుడి ముఖం.. గుండ్రటి కళ్లద్దాలతో బాపూను తలపించింది.
నిర్లక్ష్యంగా
ఈ వివాదంపై మీడియా ప్రశ్నించగా ఆల్ ఇండియా హిందూ మహాసభ బంగాల్ రాష్ట్ర విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రచూర్ గోస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
మార్పు
బంగాల్ హిందూ మహాసభ చేసిన పనిని పలు పార్టీల నేతలు ఖండించారు. దీంతో నిర్వాహకులు విగ్రహాన్ని మార్చారు. హోం మంత్రిత్వ శాఖ ఒత్తిడి మేరకు పూజ నిర్వాహకులు గాంధీ చిత్రాన్ని మార్చారు.
Also Read: Helium Tank Blast Tamil Nadu: రద్దీ మార్కెట్‌లో పేలిన హీలియం ట్యాంక్- వైరల్ వీడియో!
Also Read: Durga Puja Pandal Kolkata: మహిషాసురిడిగా మహాత్ముడు- దుర్గా మాత మండపంలో గాంధీకి అవమానం!