(Source: ECI/ABP News/ABP Majha)
Durga Puja Pandal Kolkata: మహిషాసురిడిగా మహాత్ముడు- దుర్గా మాత మండపంలో గాంధీకి అవమానం!
Gandhi As Asura In Durga Puja Pandal: మహాత్మా గాంధీకి ఘోర అవమానం జరిగింది. బంగాల్‌లోని దుర్గా మాత మండపంలో గాంధీని మహిషాసురిడిగా చిత్రీకరించారు.
Durga Puja Pandal Kolkata: జాతిపిత మహాత్మా గాంధీని హిందూ మహాసభ అవమానించింది. బంగాల్ రాజధాని కోల్‌కతాలో దుర్గా మాత మండపంలో గాంధీని మహిషాసురుడిగా చిత్రీకరించారు.
ఇదేంటి?
కోల్‌కతాలోని హిందూ మహా సభ పండల్‌లో మహాత్మా గాంధీని మహిషాసురుడిగా చిత్రీకరించడం వివాదానికి దారి తీసింది. అసుర అనే రాక్షసుడిని మహాత్మా గాంధీగా చిత్రీకరించిన అఖిల భారత హిందూ మహాసభ నిర్వాహకులు ఇబ్బందుల్లో పడ్డారు. దసరా నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో అఖిల భారతీయ హిందూ మహాసభ ఈ మండపాన్ని ఏర్పాటు చేసింది. దుర్గా మాత వధించిన అసురుడి ముఖం.. గుండ్రటి కళ్లద్దాలతో బాపూను తలపించింది.
నిర్లక్ష్యంగా
ఈ వివాదంపై మీడియా ప్రశ్నించగా ఆల్ ఇండియా హిందూ మహాసభ బంగాల్ రాష్ట్ర విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రచూర్ గోస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
మార్పు
బంగాల్ హిందూ మహాసభ చేసిన పనిని పలు పార్టీల నేతలు ఖండించారు. దీంతో నిర్వాహకులు విగ్రహాన్ని మార్చారు. హోం మంత్రిత్వ శాఖ ఒత్తిడి మేరకు పూజ నిర్వాహకులు గాంధీ చిత్రాన్ని మార్చారు.
ఘనంగా
మరోవైపు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి కేవలం భారత్‌లోనే కాకుండా పలు దేశాల్లో ఘనంగా జరుపుకున్నారు. మహాత్ముడి జయంతి సందర్భంగా ఐక్యరాజ్య సమితిలో అంతర్జాతీయ అహింసా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమంలో గాంధీజీ ప్రత్యేక అతిథిగా కన్పించడం విశేషం.
ఇదీ సంగతి
యునెస్కో మహాత్మా గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ పీస్ అండ్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ (ఎంజీఐఈపీ) 10వ వార్షికోత్సవాలను శుక్రవారం ఐరాసలో ప్రారంభించారు. ఈ సందర్భంగా గాంధీ జయంతిని పురస్కరించుకుని అంతర్జాతీయ అహింసా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అహింసా లెక్చర్ సిరీస్ సందర్భంగా ఐరాసకు భారత ప్రతినిధి బృందం.. గాంధీజీ హోలోగ్రామ్‌ను ప్రదర్శించింది.
ఈ హోలోగ్రామ్‌ను హైదరాబాద్‌లోని మహాత్మా గాంధీ డిజిటల్ మ్యూజియం రూపొందించింది. ఇది గాంధీజీ హోలోగ్రామ్‌లో రెండో ఎడిషన్ అని ఈ మ్యూజియం డైరెక్టర్ బిరాడ్ యాజ్నిక్ తెలిపారు. డిజిటల్ గ్రాఫిక్ ఫైల్స్‌ను సంగ్రహించి వాటిని మోషన్ గ్రాఫిక్స్‌తో కలిపామని, దీంతో హోలోగ్రామ్ స్క్రిప్ట్‌ను చదివేలా చేశామన్నారు.
ఆ హోలోగ్రామ్‌ను చూడగానే అచ్చం జాతిపితే సమావేశాలకు వచ్చారనే భావన కలిగింది. ఈ హోలోగ్రామ్‌కు ఉన్న వాయిస్ ఓవర్.. విద్యపై మహాత్ముడి అభిప్రాయాలను పంచుకుంది. దీంతో గాంధీజీ స్వయంగా మాట్లాడుతున్నట్లు కన్పించింది.
Also Read: Mulayam Singh Yadav Health: ములాయం సింగ్ పరిస్థితి విషమం- క్రిటికల్ కేర్ యూనిట్‌కు తరలింపు!
Also Read: Jansuraj Padyatra: 3,500 కిమీ పాదయాత్ర ప్రారంభించిన పీకే- జనాలు లేక నిరాశ!