అన్వేషించండి

Minister KTR UK Tour : పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ యూకే టూర్, కంపెనీల ప్రతినిధులతో వరుస భేటీలు

Minister KTR UK Tour : పెట్టుబడుల లక్ష్యంగా మంత్రి కేటీఆర్ పది రోజుల పాటు విదేశీ పర్యటన చేస్తున్నారు. ఇవాళ్టి నుంచి యూకే, దావోస్ పర్యటన కొనసాగనుంది. ప్రపంచ ఆర్థిక సదస్సులో కేటీఆర్ పాల్గొనున్నారు.

Minister KTR UK Tour : తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షణే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ఓ బృందం మంగళవారం లండన్‌ కు బయల్దేరివెళ్లింది. మే 18 నుంచి 26వ తేదీ వరకూ ఈ బృందం యూకేలో పర్యటించనుంది.  యూకేలోని పలు కంపెనీల ప్రతినిధులు, వాణిజ్యవేత్తలతో మంత్రి కేటీఆర్ సమావేశమవుతారు. ఆ తర్వాత 22వ తేదీ నుంచి 26 వరకు స్విట్జర్లాండ్ దావోస్‌లో నిర్వహించే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమ్మిట్ లో మంత్రి పాల్గొంటారు. యూకే ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో నిర్వహించే రెండు రౌండ్‌ టేబుల్‌ సమావేశాల్లో కేటీఆర్ పాల్గొంటారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలతలు, పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం, ఇతర సౌకర్యాలు, ప్రభుత్వ రాయితీలను వారికి వివరించనున్నారు. 

యూకే, దావోస్ లో టూర్ 

తెలంగాణలోని అవకాశాలను వివరిస్తూ పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా మంత్రి కేటీఆర్ బృందం పదిరోజుల పాటు విదేశీ పర్యటన సాగనుంది. ప్రపంచ వేదికపై తెలంగాణ గురించి మరోమారు మంత్రి కేటీఆర్ ప్రస్తవించనున్నారు. ఈ పర్యటనలో పలు ప్రముఖ ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమోటివ్ పరిశ్రమల అధిపతులతో మంత్రి కేటీఆర్ సమావేశమవుతారు. ప్రపంచ కంపెనీల పెట్టుబడులకు గమ్యస్థానం లక్ష్యంతో ఇక్కడి విధానాలు, పరిస్థితులను కేటీఆర్ వారికి వివరిస్తారు.  

ప్రపంచ వేదికపై తెలంగాణ 

కోవిడ్ అనంతరం జరుగుతున్న పెద్ద సమావేశం ప్రపంచ ఆర్థిక సదస్సు. ఈ సదస్సులో ఆరోగ్యం, విద్యుత్​, సుస్థిరత తదితర అంశాల్లో దీర్ఘకాలిక ప్రయోజనాలు, సాంకేతికతల వినియోగంపై ఈ సదస్సులో చర్చించినున్నారు. ఈ సదస్సులో ప్రధాని మోదీ, ఏపీ సీఎం జగన్ కూడా పాల్గొనున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక నిర్వహించనున్న ప్యానెల్ చర్చల్లో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు. తెలంగాణలోని అత్యుత్తమ విధానాలు, అనుకూల పరిస్థితులను ఈ సదస్సులో కేటీఆర్ వివరించున్నారు. దాదాపు 35 మంది వ్యాపార ప్రముఖులతో ఆయన సమావేశం కానున్నారు. ఈ సదస్సు సందర్భంగా దావోస్ లో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక లాంజ్ ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన వివరాలను అందులో ప్రదర్శనకు ఉంచనున్నారు. 

అమెరికా టూర్ సక్సెస్ 

ఇటీవల మంత్రి కేటీఆర్‌ అమెరికా పర్యటనకు వెళ్లివచ్చారు. ఈ పర్యటనలో పలు అమెరికన్‌ కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులకు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. అమెరికా పర్యటనలో భాగంగా ఎడ్వెంట్‌ సంస్థ ఫార్మా రంగంలో రూ.1750 కోట్లు, న్యూజెర్సీలోని ఔషధ కంపెనీ స్లేబ్యాక్‌ ఫార్మా రూ.1500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి. స్లేబ్యాక్‌ గడచిన ఐదేండ్లలో రాష్ట్రంలో రూ.2300 కోట్ల పెట్టుబడులు పెట్టింది. వీటితో పాటు మరో రూ.1500 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనుంది. మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనలో సుమారు 35 సమావేశాలు నిర్వహించారు. రాష్ర్టానికి రూ.7500 కోట్ల పెట్టుబడులను రాబట్టారు. ఈ తరహాలో యూకే నుంచి కూడా రాష్ర్టానికి పెద్దఎత్తున పెట్టుబడులు తెచ్చే లక్ష్యంతో తాజా పర్యటనను రూపొందించారు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagan: సూపర్ సిక్స్ ఎగ్గొట్టేందుకే బడ్జెట్ - చంద్రబాబుపై జగన్ కీలక వ్యాఖ్యలు
సూపర్ సిక్స్ ఎగ్గొట్టేందుకే బడ్జెట్ - చంద్రబాబుపై జగన్ కీలక వ్యాఖ్యలు
KTR In Lagcherla Attack: లగచర్ల దాడి ఘటనలో భారీ ట్విస్ట్- రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు, అవసరమైతే చంపేందుకు రెడీ!
లగచర్ల దాడి ఘటనలో భారీ ట్విస్ట్- రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు, అవసరమైతే చంపేందుకు రెడీ!
WhatsApp New Feature: వాట్సాప్‌లో భారీ మార్పు చేయనున్న మెటా - గ్యాలరీ ఎంతలా మారిపోనుందంటే?
వాట్సాప్‌లో భారీ మార్పు చేయనున్న మెటా - గ్యాలరీ ఎంతలా మారిపోనుందంటే?
Tata Curvv: టాటా కర్వ్ కొనాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్ - భారీగా పెరిగిన వెయిటింగ్ పీరియడ్!
టాటా కర్వ్ కొనాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్ - భారీగా పెరిగిన వెయిటింగ్ పీరియడ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan: సూపర్ సిక్స్ ఎగ్గొట్టేందుకే బడ్జెట్ - చంద్రబాబుపై జగన్ కీలక వ్యాఖ్యలు
సూపర్ సిక్స్ ఎగ్గొట్టేందుకే బడ్జెట్ - చంద్రబాబుపై జగన్ కీలక వ్యాఖ్యలు
KTR In Lagcherla Attack: లగచర్ల దాడి ఘటనలో భారీ ట్విస్ట్- రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు, అవసరమైతే చంపేందుకు రెడీ!
లగచర్ల దాడి ఘటనలో భారీ ట్విస్ట్- రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు, అవసరమైతే చంపేందుకు రెడీ!
WhatsApp New Feature: వాట్సాప్‌లో భారీ మార్పు చేయనున్న మెటా - గ్యాలరీ ఎంతలా మారిపోనుందంటే?
వాట్సాప్‌లో భారీ మార్పు చేయనున్న మెటా - గ్యాలరీ ఎంతలా మారిపోనుందంటే?
Tata Curvv: టాటా కర్వ్ కొనాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్ - భారీగా పెరిగిన వెయిటింగ్ పీరియడ్!
టాటా కర్వ్ కొనాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్ - భారీగా పెరిగిన వెయిటింగ్ పీరియడ్!
Pushpa 2: 'పుష్ప 2' ఫ్యాన్స్‌కు క్రేజీ అప్డేట్ ఇచ్చిన శ్రీవల్లి - డబ్బింగ్ స్టూడియోలో నేషనల్ క్రష్ రష్మిక
'పుష్ప 2' ఫ్యాన్స్‌కు క్రేజీ అప్డేట్ ఇచ్చిన శ్రీవల్లి - డబ్బింగ్ స్టూడియోలో నేషనల్ క్రష్ రష్మిక
The Rana Daggubati Show: 'ది రానా దగ్గుబాటి షో' ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్ - ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చ అంటే?
'ది రానా దగ్గుబాటి షో' ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్ - ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చ అంటే?
Vizag Crime News: విశాఖలో పట్టపగలే దారుణం, ఇంట్లోకి ప్రవేశించి మహిళపై హత్యాయత్నం! ట్విస్ట్ ఏంటంటే
విశాఖలో పట్టపగలే దారుణం, ఇంట్లోకి ప్రవేశించి మహిళపై హత్యాయత్నం! ట్విస్ట్ ఏంటంటే
Patnam Narendar Reddy: లగచర్ల దాడి కేసు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ప‌ట్నం న‌రేంద‌ర్‌రెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్
లగచర్ల దాడి కేసు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ప‌ట్నం న‌రేంద‌ర్‌రెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్
Embed widget