News
News
వీడియోలు ఆటలు
X

నిజామాబాద్ జిల్లాకు గోల్డ్‌ మెడల్, భద్రాద్రి, హన్మకొండకు వెండి, ఖమ్మంకు కాంస్యం

ప్రతిభ కనబర్చినందుకు రాష్ట్రానికి 4 జాతీయ అవార్డులు

వైద్య సిబ్బందిని అభినందించిన మంత్రి హరీశ్ రావు

FOLLOW US: 
Share:

టీబీ రహిత రాష్ట్రం దిశగా తెలంగాణ అడుగులు వేస్తున్నది. టీబీ నియంత్రణలో ప్రతిభ కనబర్చిన 4 జిల్లాలకు కేంద్రం జాతీయ అవార్డులు ప్రకటించింది. మార్చి 24న ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్‌ వారణాసిలో జరిగిన జాతీయస్థాయి కార్యక్రమంలో తెలంగాణ టీబీ విభాగం అధికారులు ఈ అవార్డులను అందుకున్నారు. TB నిర్మూలన కార్యక్రమాల సూచికల ఆధారంగా, తెలంగాణ ప్రస్తుతం దేశంలోనే మూడవ ఉత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రంగా నిలిచింది.

2015 కేసులతో పోల్చితే తెలంగాణలో TB కేసుల తగ్గింపు ప్రతి లక్ష జనాభాకు గణనీయంగా తగ్గింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ప్రకారం, తగ్గింపు లక్ష్యం 80శాతం కాగా, 60 శాతం తగ్గించిన నిజామాబాద్ కు బంగారు పతకం దక్కింది. 40 శాతం తగ్గించిన భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ జిల్లాలకు సిల్వర్ మెడల్ వచ్చింది. 20 శాతం తగ్గించిన ఖమ్మంకు కాంస్య పతకం లభించింది.   ఈ అవార్డులను రాష్ట్ర టీబీ విభాగం జాయింట్ డైరెక్టర్ డా. రాజేశం, నిజామాబాద్ DMHO సుదర్శనం, ప్రపంచ ఆరోగ్య సంస్థ కన్సల్టెంట్ శ్రీగణ, ప్లానింగ్ ఆఫీసర్ వాసు ప్రసాద్ కలిసి తెలంగాణ ప్రభుత్వం తరుపున పతకాలు అందుకున్నారు.

రాష్ట్రంలో టీబీ వ్యాధిని నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్తున్నది. ఇందులో భాగంగా TB ప‌రీక్ష‌ల సంఖ్య భారీగా పెంచ‌డంతోపాటు వైద్య స‌హాయం త‌క్ష‌ణ‌మే అందించేందుకు ఏర్పాట్లు చేసింది. కుటుంబంలో ఎవరికైనా టీబీ గుర్తిస్తే మిగతా సభ్యులకు కూడా పరీక్షలు చేస్తున్నారు. హైద‌రాబాద్ ప్ర‌భుత్వ ఛాతీ ఆసుప‌త్రిని అపెక్స్ టీబీ ఆసుప‌త్రిగా గుర్తించ‌డంతోపాటు మ‌ల్టీ డ్ర‌గ్ థెర‌పీ, డ్ర‌గ్ రెసిస్టెన్స్ టీబీ చికిత్స పొందేవారి కోసం ప్ర‌త్యేక వార్డులు ఏర్పాటు చేశానే. టీబీ నోటిఫైబుల్ డిసీజ్ కాబట్టి ప్రైవేటులో గుర్తించిన కేసులకు కూడా పూర్తి ఉచితంగా అన్నిర‌కాల వైద్య ప‌రీక్ష‌లతోపాటు చికిత్స కూడా అందిస్తున్నారు. ఈ మేర‌కు అన్ని కార్పొరేటు, ప్రైవేటు ఆసుప‌త్రుల‌తో క‌లిసి ప్రభుత్వం ప‌ని చేస్తున్నది.

తెలంగాణ‌లో ప్ర‌త్యేకంగా టీబీ నుంచి కోలుకున్నవారిని టీబీ ఛాంపియ‌న్స్‌ గా గుర్తించి శిక్ష‌ణ ఇచ్చి, వారి ద్వారా ప్ర‌జ‌ల‌లో అవ‌గాహ‌న తెస్తున్నారు. ఇందుకోసం ప్ర‌త్యేక మొబైల్ యాప్ దీక్ష ద్వారా ఆన్‌ లైన్‌ లో శిక్ష‌ణ ఇస్తున్నారు. టీబీ వ్యాధిబారిన ప‌డినవారికి ప్ర‌భుత్వం ‘‘నిక్ష‌య్ పోష‌ణ యోజ‌న కింద పోషకాహారం కోసం ప్ర‌తి నెల రూ.500 చొప్పున వ్యాధి నుంచి బ‌య‌టప‌డే వ‌ర‌కు ఆర్థిక స‌హాయం అందిస్తోంది.

టిబి తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండి మ‌ల్టి డ్ర‌గ్ థెర‌పీ తీసుకునేవారికి రూ.1200 ర‌వాణా ఛార్జీలు, గిరిజ‌న ప్రాంతాల‌తో వీటికి అద‌నంగా మ‌రో రూ.750 అందిస్తున్నారు. బాధితులకు పోషకాహార కిట్స్ అందిస్తున్నారు. ఇలా ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల టీబీ నియంత్రణలో రాష్ట్రం గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది.

2025 నాటికి పూర్తిస్థాయి నిర్మూలనే లక్ష్యం: మంత్రి హరీశ్ రావు

టీబీ నియంత్రణలో సత్తా చాటి అవార్డులు పొందిన జిల్లాలకు ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు కృషి చేసిన వైద్యాధికారులను ఆయన అభినందించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో తెలంగాణలో 2025 నాటికి పూర్తిస్థాయిలో క్ష‌య వ్యాధి  నిర్మూల‌నే లక్ష్యంగా నిర్ధేశించుకుని ప‌రీక్ష‌లు, వైద్యం వేగ‌వంతం చేస్తున్నట్లు హరీష్‌ రావు తెలిపారు. టీబీ నిర్మూలన లక్ష్యం దిశగా వైద్యాధికారులు కృషి చేయాలని ఆయన సూచించారు.

Published at : 24 Mar 2023 10:50 PM (IST) Tags: Govt Tuberculosis Telangana Khammam Treatment NIZAMABA

సంబంధిత కథనాలు

Dr.BRAOU BEd Exam: అంబేడ్కర్‌ సార్వత్రిక బీఈడీ ప్రవేశపరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

Dr.BRAOU BEd Exam: అంబేడ్కర్‌ సార్వత్రిక బీఈడీ ప్రవేశపరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

Hyderabad Traffic Diversion: జూన్ 4న ఐకియా ఫ్లై ఓవర్ మూసివేత సహా హైద‌రాబాద్‌ లో ఆ రూట్లలో ట్రాఫిక్‌ ఆంక్షలు ఇలా

Hyderabad Traffic Diversion: జూన్ 4న ఐకియా ఫ్లై ఓవర్ మూసివేత సహా హైద‌రాబాద్‌ లో ఆ రూట్లలో ట్రాఫిక్‌ ఆంక్షలు ఇలా

Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్

Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్

Sharmila On KCR : సంపద వెదకడం అమ్ముకోవడమే కేసీఆర్ పని - షర్మిల ఘాటు విమర్శలు

Sharmila On KCR : సంపద వెదకడం అమ్ముకోవడమే కేసీఆర్ పని - షర్మిల ఘాటు విమర్శలు

TSPSC News : తవ్వకొద్దీ అక్రమాలు - టీఎస్‌పీఎస్సీ కేసులో ఇంకెన్ని అరెస్టులు ?

TSPSC News :  తవ్వకొద్దీ  అక్రమాలు - టీఎస్‌పీఎస్సీ కేసులో ఇంకెన్ని అరెస్టులు ?

టాప్ స్టోరీస్

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!

ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?