అన్వేషించండి

Harish Rao: మధ్యప్రదేశ్ సీఎం మాటలు చూస్తుంటే.. వంద ఎలుకలు తిన్న పిల్లి శాకహారి అన్నట్లు ఉంది

జీఓ 317పై రాజకీయ లబ్ధి కోసమే.. బీజేపీ నాటకాలు ప్రదర్శిస్తోందని మంత్రి హరీశ్ రావు అన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు జీఓ వచ్చిందని చెప్పారు.

రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే జీఓ 317 వచ్చిందని.. దానిపై బీజేపీ నాటకాలు ఆడటం విడ్డూరంగా ఉందని.. మంత్రి హరీశ్ రావు అన్నారు. బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చేసిన వ్యాఖ్యలపై హరీశ్‌రావు ఘాటుగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వ 14కోట్ల ఉద్యోగాల హామీ ఏమైనట్టు అని ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రభుత్వం త్వరగా నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రయత్నిస్తుంటే బీజేపీ అడ్డుకుంటోదని హరీశ్‌రావు అన్నారు. అవినీతిపై శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ వంటి నేతలు మాట్లాడటం విచిత్రంగా ఉందని విమర్శించారు. శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ అవాకులు చవాకులు పేలారని.. కుంభకోణాల్లో మునిగిన శివరాజ్‌ సింగ్‌ కేసీఆర్‌ను విమర్శిస్తున్నారని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. శివ రాజ్ సింగ్ సీఎం మాటలు చూస్తుంటే.. వంద ఎలుకలు తిన్న పిల్లి శాకహారిని అన్నట్లు ఉందని విమర్శించారు. శివరాజ్‌సింగ్‌కు టీఆర్ఎస్, కేసీఆర్‌ను విమర్శించే హక్కు లేదని స్పష్టం చేశారు.

శివరాజ్ సింగ్ చౌహన్ దొడ్డిదారిన ఎమ్మెల్యే అయిన విషయం అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. తెలంగాణకు మధ్యప్రదేశ్‌కు పోలికే లేదని హరీశ్ రావు అన్నారు. ఏ రంగంలో మధ్యప్రదేశ్‌ అభివృద్ధి సాధించింది? మధ్యప్రదేశ్‌లో వ్యాపం కుంభకోణం సంగతి ఏంటి? అని ప్రశ్నించారు. కాళేశ్వరంలో అవినీతి లేదని కేంద్రమే చెప్పిందని స్పష్టం చేశారు. 

సీఎం కేసీఆర్‌కు శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు పోలికే లేదని.. దొడ్డిదారిన శివరాజ్‌సింగ్ సీఎం అయ్యారని మంత్రులు తలసాని, శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రజలే అధిష్ఠానంగా కేసీఆర్‌ సీఎం అయ్యారన్నారు. ప్రధాని, బీజేపీ సీఎంలు.. కేసీఆర్‌ను ప్రశంసించలేదా? బీజేపీ నేతలకు ఉద్యోగులపై నిజంగా ప్రేమ ఉందా? అని ప్రశ్నించారు. తెలంగాణ మాదిరిగా బీజేపపీ పాలిత ప్రాంతాల్లో జీతభత్యాలు ఇస్తున్నారా? అని అడిగారు.

Also Read: KCR CPM : కమ్యూనిస్టు పార్టీలతో కేసీఆర్ కీలక చర్చలు.. ప్రగతి భవన్‌లో విజయన్, ఏచూరీలతో విందు భేటీ !

Also Read: PM Modi Call to Bandi Sanjay: బండి సంజయ్ కు ప్రధాని మోదీ ఫోన్... 317జీవోపై ప్రధాని ఆరా

Also Read: Vanama Raghava: వనమా రాఘవకు 14 రోజుల రిమాండ్... రామకృష్ణను బెదిరించినట్లు అంగీకరించిన రాఘవ... ఏఎస్పీ రోహిత్ రాజ్ వెల్లడి

Also Read: Weather Updates: ఏపీలో పెరుగుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు.. తెలంగాణను దట్టంగా కమ్మేసిన మేఘాలు, మూడు రోజుల వర్ష సూచన

టాప్ హెడ్ లైన్స్

Toxic Actor Yash: నాలాంటి వాడికి పెద్ద కలలు కనే ధైర్యం ఇచ్చారు! తెలుగు స్పీచ్‌తో అదరగొట్టిన టాక్సిక్ హీరో యశ్
నాలాంటి వాడికి పెద్ద కలలు కనే ధైర్యం ఇచ్చారు! తెలుగు స్పీచ్‌తో అదరగొట్టిన టాక్సిక్ హీరో యశ్
Breaking News: హైదరాబాద్‌లో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు
హైదరాబాద్‌లో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget