Minister Errabelli: రామప్ప దేవాలయం వద్ద అట్టహాసంగా ఉత్సవాలు, కేసీఆర్‌కు మంత్రి ఎర్రబెల్లి కృతజ్ఞతలు
Minister Errabelli: రామప్ప దేవాలయానికి వారసత్వ గుర్తింపు వచ్చేందుకు కృషి చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంత్రి ఎర్రబెల్లి కృతజ్ఞతలు తెలిపారు.
Minister Errabelli: వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా రామప్ప దేవాలయం వల్ల మంగళవారం ఘనంగా వేడుకలు జరిగిన విషయం తెలిసిందే. తెలంగాణ టూరిజం శాఖ, తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అట్టహాసంగా వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులకు ఎర్రబెల్లి కృతజ్ఞతలు తెలిపారు. శిల్పం, వర్ణం, కృష్ణం అనే పేరుతో ఈ ఉత్సవాలను నిర్వహించినందుకు అభినందనలు తెలిపారు. శిల్పం, వర్ణం, కృష్ణం ఈ మూడు పదాలు మూడు అంశాలకు ప్రతీకలుగా పేర్కొన్నారు.
ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం రామప్ప. వరంగల్ నగరానికి 70 కి.మీ. దూరంలో ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలంలోని పాలంపేట అనే గ్రామం దగ్గర ఉంది. రామలింగేశ్వర దేవాలయంగా పూజలు అందుకుంటూ ఎంతో ప్రాముఖ్యతను పొందింది. శిల్పుల గొప్ప పనితనానికి రామప్ప దేవాలయం నిదర్శనం. ఈ దేవాలయం పక్కనే కాకతీయులు నిర్మించిన రామప్ప చెరువు, వేల ఎకరాల పంటల సాగుకు మరియు తాగునీటికి ఉపయోగపడుతుంది. కాకతీయ రాజు గణపతి దేవుడు ఈ దేవాలయంలో వేయించిన శిలాశాసనం ప్రకారం ఈ దేవాలయాన్ని 13-14 శతాబ్ధాల మధ్య రేచర్ల రుద్రయ్య నిర్మించాడు.
వారసత్వ హోదా హెరిటేజ్
కాకతీయుల కాలంలో క్రీస్తు శకం 1213లో నిర్మించిన రామప్ప దేవాలయానికి జూలై 15, 2021 న ప్రపంచ వారసత్వ హోదా దక్కింది. చైనాలోని పూజౌ లో నిర్వహించిన యునెస్కో హెరిటేజ్ కమిటీ సమావేశాల్లో ప్రపంచవ్యాప్తంగా 21 దేశాల ప్రతినిధులు ఓటింగ్ ప్రక్రియలో పాలుపంచుకున్నారు. 17 దేశాల వారు రామప్పకు అనుకూలంగా ఓటు వేశారు. ప్రపంచవ్యాప్తంగా 255 కట్టడాలు యునెస్కో వారసత్వ హోదా గుర్తింపు కోసం పోటీ పడ్డాయి. రామప్ప కట్టడం యునెస్కో జాబితాలో చోటు పాదించుకోవడం భారతీయులందరికీ గర్వకారణం. యునెస్కో రామప్పకు వారసత్వ హోదా ఇవ్వడం ద్వారా 800 సంవత్సరాల నాటి రామప్ప దేవాలయానికి తగిన గుర్తింపు లభించింది. భవిష్యత్తులో మరిన్ని నిధులు వచ్చి అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. తద్వారా రామప్ప పర్యాటక ప్రాంతంగా దేశవ్యాప్త గుర్తింపుకు నోచుకుంటుంది.
అద్భుత శిల్ప కళా చాతుర్యం:
రామప్పగుడి ఆలయ నిర్మాణంలోని శిల్ప నైపుణ్యం వర్ణించనలవికానిది. ఇన్నేళ్ళు గడిచినా, ఈ నాటికి చూపరులకు అమితానందాన్ని కలిగిస్తుంది. భరత నాట్య శాస్త్రమంతా మూర్తీ భవించి, స్తంభాల మీదా, కప్పుల మీదా, కనబడుతుంది. జాయన సేనాని రచించిన నృత్తరత్నావళిలో ఉదహరించిన నాట్యశిల్పమంతా రామప్ప గుడిలో తొణికిసలాడుతుంది.
ఆలయ ప్రత్యేకతలు
ఈ దేవాలయం ఎన్నో యుద్ధాలకు, దాడులకు, ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకొని నిలబడింది. దేవాలయ ప్రాంగణంలో చిన్న కట్టడాలను నిర్లక్ష్యంగా వదలి వేయడం వలన అవి కొన్ని ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి. కొంత మంది ఇక్కుడున్న నీళ్ళపై తేలే ఇటుకలను తీసుకొని వెళ్ళిపోవడం ప్రారంభించారు. అప్పటినుంచి భారతీయ పురాతత్వ పర్యవేక్షక శాఖ దీన్ని ఇపుడు తమ ఆధీనంలోకి తీసుకొని పరిరక్షిస్తుంది. ప్రధాన ద్వారం దగ్గర ప్రాకారం కూడా శిథిలమై ఉంది. ఇప్పుడు పడమర వైపు ఉన్న చిన్న ద్వారం ద్వారానే ప్రవేశం ఉంది.
ప్రపంచ వారసత్వ సంపదగా రామప్ప
ప్రపంచ వారసత్వ సంపదగా రామప్ప దేవాలయం గుర్తింపు దక్కించుకుంది. వారసత్వ కట్టడాల విశిష్టతల పరిశీలన కోసం చైనాలోని ఫ్యూజులో వర్చువల్ గా సమావేశమైన వరల్డ్ హెరిటేజ్ కమిటీ (యునెస్కో) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మన దేశం నుంచి 2020 సంవత్సరానికి రామప్పకు మాత్రమే ఈ ఖ్యాతి దక్కింది. తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ గుర్తింపు పొందిన తొలి కట్టడంగా రామప్ప రికార్డు సృష్టించింది.