Street Dogs Issue: కేటీఆర్ అంకుల్ వీధి కుక్కల బారి నుంచి కాపాడండి, కొంపల్లిలో చిన్నారుల వినూత్న ర్యాలీ
Street Dogs Issue: కొంపల్లి ఎన్సీఎల్ కాలనీలో కేటీఆర్ అంకుల్ వీధి కుక్కల బారి నుంచి రక్షించండి అంటూ చిన్నారులు ప్లకార్డులు పట్టుకుని నిరసన చేశారు. తమ సమస్యను పరిష్కరించాలని వేడుకున్నారు.
Street Dogs Issue: వీధి కుక్కల బారి నుంచి కాపాడండి కేటీఆర్(KTR) అంకుల్ అంటూ చిన్నారుల ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ చేశారు. మేడ్చల్ జిల్లా కొంపల్లి(Kompally) ఎన్సీఎల్ కాలనీ చిన్నారులు ప్లకార్డులతో ర్యాలీ(Rally) చేశారు. చిన్నారులకు వారి తల్లిదండ్రులు తోడైయ్యారు. కాలనీలో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని, అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన పట్టించుకోవడంలేదని కాలనీ వాసులు అంటున్నారు. వీధి కుక్కల బారి నుంచి మా పిల్లల్ని కాపాడమంటూ కాలనీ వాసులు ఆదివారం ర్యాలీ నిర్వహించారు. చిన్న పిల్లలు ప్లకార్డులు పట్టుకుని వీధి కుక్కల బారి నుంచి మమ్మల్ని కాపాడమంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే(Mla) అంకుల్, కమిషనర్ అంకుల్ ప్లీస్ సేవ్ అజ్ ఫ్రం స్ట్రీట్ డాగ్స్ అంటూ రోడ్డు పైకి వచ్చి వినూత్న నిరసన చేశారు.
కాలనీలో వీధి కుక్కలు స్వైర విహారం
మేడ్చల్-మల్కజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజికవర్గం కొంపల్లి పరిధిలోని నార్త్ ఎవెన్యూ కాలనీలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. కాలనీ వాసులు, పిల్లలు వీధి కుక్కల బారినపడడంతో ఎన్ని సార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో ఆదివారం కాలనీ వాసులు నిరసన ర్యాలీ చేశారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. ఇకనైనా అధికారులు స్పందించి తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని చిన్నారులు, కాలనీ వాసులు కోరుతున్నారు.
బయటకు రావాలంటే భయంగా ఉంది
"సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే వివేకానంద గారికి గత ఏడాది కాలంలో మా కాలనీలో 80-90 మంది కుక్కకాటుకు గురయ్యారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులకు చాలా సార్లు ఫిర్యాదు చేశాం. అయినా చర్యలు తీసుకోలేదు. కాలనీలో కుక్కల సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప నివారణకు చర్యలు లేవు. ఇది చాలా సీరియస్ ఇష్యూ. మా కాలనీలో ప్రణీత్ అనే అబ్బాయికి కుక్కలు కరవడం వల్ల ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సి వచ్చింది. పిల్లలు ఆడుకోడానికి బయటకు వెళ్లాలన్నా, ట్యూషన్, స్కూళ్లకు వెళ్లాలన్నా, పెద్ద వాళ్లు వాకింగ్ కి వెళ్లాలన్నా భయపడే పరిస్థితి ఉంది. ఈ సమస్యకు వీలైనంత త్వరగా పరిష్కారం చూపాలని వేడుకుంటున్నాం" అని కాలనీలోని ఓ బాలిక అన్నారు.
Also Read: CLP Meeting: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు, సీఎల్పీ భేటీలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు