News
News
X

BRS Joinings : బీఆర్ఎస్‌లో చేరిన ఒడిషా మాజీ సీఎం సహా కీలక నేతలు - మహాభారత్‌ను నిర్మిద్దామని కేసీఆర్ పిలుపు !

ఒడిషా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ సహా పలువురు నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మహా భారత్‌ను నిర్మిద్దామని వారికి కేసీఆర్ పిలుపునిచ్చారు.

FOLLOW US: 
Share:

BRS Joinings :  ఒడిశా మాజీ ముఖ్య‌మంత్రి గిరిధ‌ర్ గ‌మాంగ్ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో గిరిధ‌ర్‌కు సీఎం కేసీఆర్ పార్టీ కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. గిరిధ‌ర్‌తో పాటు 12 మంది మాజీ ఎమ్మెల్యేలు, న‌లుగురు మాజీ ఎంపీలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్‌లో చేరిన వారిలో హేమ గమాంగ్, జ‌య‌రాం పాంగీ, రామ‌చంద్ర హ‌న్ష్‌డా, బృందావ‌న్ మ‌జ్హీ, న‌బీన్ నంద‌, రాథా దాస్, భ‌గీర‌థి సేతి, మ‌య‌దార్ జేనా ఉన్నారు. గిరిధర్ గమాంగ్‌ను  బీఆర్ఎస్ ఒడిషా శాఖ అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశం ఉంది. 
   
దేశంలోని అన్ని వ‌ర్గాలు సంతోషంగా ఉండేలా ఒక మ‌హాన్ భార‌త్ నిర్మిద్దాం అని బీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. స‌క‌ల మాన‌వాళి సంక్షేమ‌మే బీఆర్ఎస్ స్వ‌ప్నం అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. దేశ భ‌విష్య‌త్ కోస‌మే బీఆర్ఎస్ ఆవిర్భ‌వించింద‌ని తేల్చిచెప్పారు. ఒడిశా మాజీ సీఎం గిరిధ‌ర్ గ‌మాంగ్ బీఆర్ఎస్ పార్టీలో చేరిన సంద‌ర్భంగా తెలంగాణ భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన స‌మావేశంలో కేసీఆర్ ప్ర‌సంగించారు.  రైతులు దేశ రాజ‌ధాని స‌రిహ‌ద్దుల్లో 13 నెల‌ల ఉద్య‌మం ఎందుకు చేశారు. ఇప్ప‌టికీ రైతుల‌కు ఒక భ‌రోసా ఇవ్వ‌లేక‌పోయింది కేంద్రం. అందుకే అబ్ కీ బార్ కిసాన్ స‌ర్కార్ అనే నినాదాన్ని ఎత్తుకున్న‌ది బీఆర్ఎస్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీల‌ను గెలిపించండి.. దేశంలో నీళ్లు, క‌రెంట్ ఎందుకు రావో నేను చూస్తాను. మ‌న‌సు పెట్టి ప‌ని చేస్తే ఏదైనా సాధ్య‌మే. తెలంగాణ‌కు అందుకు సాక్ష్యమని... తెలంగాణ‌లో సాధ్య‌మైంది.. దేశ‌మంత‌టా ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. 

తెలంగాణ‌లో ప్ర‌తి ఇంటికి తాగునీరు ఇస్తున్నాం.. దేశ‌మంతా ఎందుకు ఇవ్వ‌లేం. తెలంగాణ‌లో రైతు ఆత్మ‌హ‌త్య‌లు ఆగిపోయాయి.. వ‌ల‌స‌లు వాప‌స్ వ‌స్తున్నాయి. నేను చెప్పేది ధ‌న్ కీ బాత్ కాదు.. మ‌న్ కీ బాత్. క‌రెంట్‌కు దేశంలో కొద‌వ లేదు.. 4 ల‌క్ష‌ల మెగావాట్ల స్థాపిత విద్యుత్ ఉంది. అన్ని ధ‌ర‌లు పెంచుకుంటూ పోవాలి.. జ‌నం జేబులు కొట్టేయాల‌నేదే కేంద్రం యావ‌. పేదోడి క‌డుపు కొట్టాలి.. ఉన్నోడి జేబులు నింపాలి.. దేశంలో న‌డుస్తున్న‌ది ఇదే. రైతులు కూడా చ‌ట్ట‌స‌భ‌ల్లోకి కూడా రావాలి. రైతులు నాగ‌లి ప‌ట్ట‌డ‌మే కాదు.. రాజ్యాంగాన్ని న‌డిపే నాయ‌కులుగా మారాల‌న్నారు కేసీఆర్. 

ఎన్నిక‌ల్లో గెల‌వ‌డ‌మే నాయ‌కుల‌కు ల‌క్ష్యంగా మారిందని కేసీఆర్ పేర్కొన్నారు. ఏదో ర‌కంగా ఓట్లు సంపాదించుకోవ‌డ‌మే రివాజుగా మారింది. స్వాతంత్ర్యం ఇచ్చి 75 ఏండ్లు అవుతున్న‌ప్ప‌టికీ తాగ‌డానికి నీళ్లు ఇవ్వ‌ట్లేదు. ఒడిశా మ‌హాన‌దిలో ఎంత శాతం నీళ్ల‌ను వాడుకుంటున్నా. ఈ 75 ఏండ్ల‌లో మ‌నం ఏం సాధించిన‌ట్టు? జాతి, ధ‌ర్మం పేరు చెప్పి గెలిచే వారు ఏం చేస్తారు? పెద్ద పెద్ద ఉప‌న్యాసాలు ఇస్తారు.. కానీ తాగ‌డానికి గుక్కెడు నీళ్లు ఇవ్వ‌రని మండిప‌డ్డారు కేసీఆర్. అమెరికా, చైనా అభివృద్ధి చెందిన దేశాల కంటే వ‌న‌రులు ఎక్కువ ఉన్నాయి. కానీ మ‌న దేశం అభివృద్ధి చెంద‌డం లేదు. భార‌త్ త‌న ల‌క్ష్యాన్ని మ‌రిచింద‌ని పేర్కొన్నారు. దేశ యువ‌త అమెరికా వెళ్లేందుకు త‌హ‌త‌హ‌లాడుతున్నారు. అమెరికా గ్రీన్ కార్డు వ‌స్తే సంబురాలు చేసుకుంటున్నారు. దేశంలో స‌రిప‌డా నీళ్లున్నా పొలాల‌కు మ‌ళ్ల‌వు, స‌రిప‌డా క‌రెంట్ ఉన్న చీక‌ట్లు తొల‌గ‌వు. ప్ర‌భుత్వాలు మారినా రైతులు, కార్మికుల ప‌రిస్థితి మార‌లేదు. దేశంలో గుణాత్మ‌క మార్పు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని కేసీఆర్ అన్నారు.

ఒడిషా నుంచి కీలక నేతల రాకతో తెలంగాణ భవన్ సందడిగా మారింది. 

Published at : 27 Jan 2023 08:56 PM (IST) Tags: Giridhar Gamang Former Odisha CM Joins BRS Former Odisha CM Joins BRS

సంబంధిత కథనాలు

SRTRI: నిరుద్యోగ యువతకు ఉచిత ఉపాధి శిక్షణ, ఆపై ఉద్యోగాలు!

SRTRI: నిరుద్యోగ యువతకు ఉచిత ఉపాధి శిక్షణ, ఆపై ఉద్యోగాలు!

Bandi Sanjay : కేసీఆర్ మళ్లీ గెలిస్తే తెలంగాణ ప్రజల చేతికి చిప్ప తథ్యం- బండి సంజయ్

Bandi Sanjay : కేసీఆర్ మళ్లీ గెలిస్తే తెలంగాణ ప్రజల చేతికి చిప్ప తథ్యం- బండి సంజయ్

మరో రెండు నెలల పాటు BRS ఆత్మీయ సమ్మేళనాలు- మంత్రి కేటీఆర్

మరో రెండు నెలల పాటు BRS ఆత్మీయ సమ్మేళనాలు- మంత్రి కేటీఆర్

పర్యావరణ సమతుల్యతలో పెద్దపులి అగ్రభాగం, సేవ్ టైగర్ ఉద్యమానికి ఎంపీ సంతోష్ కుమార్ మద్దతు

పర్యావరణ సమతుల్యతలో పెద్దపులి అగ్రభాగం, సేవ్ టైగర్ ఉద్యమానికి ఎంపీ సంతోష్ కుమార్ మద్దతు

Mlc Kavitha : నిజమైన డిగ్రీ ఉన్న వాళ్లకు ఉద్యోగాలు లేవు, డిగ్రీ లేని వ్యక్తికి అత్యున్నత ఉద్యోగం - ఎమ్మెల్సీ కవిత

Mlc Kavitha :  నిజమైన డిగ్రీ ఉన్న వాళ్లకు ఉద్యోగాలు లేవు, డిగ్రీ లేని వ్యక్తికి అత్యున్నత ఉద్యోగం - ఎమ్మెల్సీ కవిత

టాప్ స్టోరీస్

Perni Nani : ప్రస్తుత కేబినెట్ తోనే ఎన్నికలకు, మంత్రివర్గ మార్పులపై పేర్ని నాని క్లారిటీ

Perni Nani : ప్రస్తుత కేబినెట్ తోనే ఎన్నికలకు, మంత్రివర్గ మార్పులపై పేర్ని నాని క్లారిటీ

Minister Gangula Kamalakar : బీఆర్ఎస్ ను ఓడించేందుకు బి.ఆర్.ఎస్ కుమ్మక్కు, మనమంతా కేసీఆర్ బలగం - మంత్రి గంగుల

Minister Gangula Kamalakar : బీఆర్ఎస్ ను ఓడించేందుకు బి.ఆర్.ఎస్ కుమ్మక్కు, మనమంతా కేసీఆర్ బలగం - మంత్రి గంగుల

YSRCP Leader Meet Nara Lokesh: నారా లోకేష్‌తో నెల్లూరు వైసీపీ నేత సీక్రెట్ మీటింగ్, నిజమేనా?

YSRCP Leader Meet Nara Lokesh: నారా లోకేష్‌తో నెల్లూరు వైసీపీ నేత సీక్రెట్ మీటింగ్, నిజమేనా?

SRH vs RR, IPL 2023: బట్లర్, సంజూ, జైశ్వాల్ బాదుడే బాదుడు! సన్‌రైజర్స్ టార్గెట్‌ 204

SRH vs RR, IPL 2023: బట్లర్, సంజూ, జైశ్వాల్ బాదుడే బాదుడు! సన్‌రైజర్స్ టార్గెట్‌ 204