Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్‌లో జోరుగా చేరికలు - జాబితాలో గ్రేటర్ డిప్యూటీ మేయర్, రంగారెడ్డి జడ్పీ చైర్మన్
Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పలువురు నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. గ్రేటర్ డిప్యూటీ మేయర్, రంగారెడ్డి జడ్పీ చైర్మన్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు.
Many leaders are showing interest in joining Telangana Congress Party : మహేశ్వరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డిలు శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి నివాస గృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వారు పుష్పగుచ్చాలు అందజేశారు. బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరడానికి ఇప్పటికే పలు దఫాలుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో తీగల కృష్ణారెడ్డి చర్చలు కొనసాగించారు. ఆయన కోడలు, జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే విదేశీ పర్యటన ముగించుకుని ఇటీవలే వచ్చిన జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి, తీగల కృష్ణారెడ్డి తో కలిసి ముఖ్యమంత్రిని కలవడంతో అతి త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇవ్వకనే ఇచ్చారు. గతంలో తెలుగుదేశం పార్టీలో కొనసాగిన రేవంత్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి లకు అప్పట్లోనే మంచి సత్సంబంధాలు ఉండడడం కాంగ్రెస్ పార్టీలో చేరాలని తీగల నిర్ణయించుకున్నారు.
కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ డి. రాజేశ్వర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి , పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని రాజేశ్వర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు రేవంత్ రెడ్డి పార్టీలోకి స్వాగతం పలికారు. నిజామాబాద్ నగరానికి చెందిన డి రాజేశ్వర్ కాంగ్రెస్ కార్యకర్తగా మున్సిపల్ కౌన్సిలర్ గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన టువంటి కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి చేరారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ అనుచరుడిగా రాజేశ్వరరావుకు పేరు ఉంది. జుక్కల్ నియోజకవర్గం నుంచి ఒకసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వైఎస్ జమానాలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు. వైయస్ అండతో ఎమ్మెల్సీ పదవిని దక్కించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్‌ఏస్‌లో చేరారు. బీఆర్ఎస్ పార్టీలో క్రిస్టియన్ మైనారిటీ కోటాలో రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశం దక్కించుకున్నారు. గడచిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీ పదవిని పొడిగిస్తారని ఆశపడిన రాజేశ్వరరావుకు నిరాశ మిగిలింది. జుక్కల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని యోచన చేసిన కేసీఆర్ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే మళ్లీ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు సమాచారం.
ఆదివారం కాంగ్రెస్‌లో చేరనున్న నగ్రేటర్ డిప్యూటీ మేయర్
బీఆర్ఎస్ పార్టీకి GHMC డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి దంపతుల రాజీనామా చేశారు. రేపు ఉదయం 11 గంటలకు గాంధీ భవన్ లో దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని బీఆర్ఎస్ హైకమాండ్ పంపారు.
లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కాంగ్రెస్ లో చేరేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నరాు. గ్రేటర్ లో కాంగ్రెస్ బలహీనంగా ఉండటంతో ఎక్కువ మందిని పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.