News
News
X

TS Congress Tagore : టీ కాంగ్రెస్‌లో మరో దుమారం - ఇంచార్జ్ పదవికి ఠాగూర్ గుడ్ బై ?

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ పదవికి మాణిగం ఠాగూర్ గుడ్ బై చెప్పినట్లుగా తెలుస్తోంది. త్వరలో కొత్త ఇంచార్జ్ ను నియమించే అవకాశం ఉందంటున్నారు.

FOLLOW US: 
Share:

TS Congress Tagore :    తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిగం ఠాగూర్ తన బాధ్యతల నుంచి వైదొలిగినట్లుగా తెలుస్తోంది. టీ కాంగ్రెస్‌కు సంబంధిచిన అన్ని వాట్సాప్ గ్రూపుల నుంచి ఆయన వైదొలగడంతో ఒక్క సారిగా కలకలం బయలు దేరింది. తెలంగాణ కాంగ్రెస్ శిక్షణా శిబిరాన్ని బుధవారం ప్రారంభించారు. మల్లి ఖార్జున ఖర్గే ఫోన్ చేసినప్పటికీ సీనియర్లు ఎవరూ హాజరు కాలేదు. ఇక తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలతో తాను వేగలేనని ఆయన బాధ్యతల నుంచి వైదొలికినట్లుగా తెలుస్తోంది. మాణిగం ఠాగూర్ బాధ్యతల నుంచి వైదొలిగారని... నాలుగైదు రోజుల తర్వాత  హైకమాండ్ కొత్త ఇంచార్జ్ ను ప్రకటించే అవకాశం ఉందని సీనియర్ నేత మల్లు రవి చెబుతున్నారు. 

ఠాగూర్‌పై సీనియర్ల తీవ్ర ఆరోపణలు

తమిళనాడుకు చెందిన ఎంపీ అయిన మాణిగం ఠాగూర్ తెలంగాణకు ఇంచార్జ్ గా వచ్చినప్పటి నుండి ఓ వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వడంతో కోమిటరెడ్డి వెంకటరెడ్డి ఆయనపై తీవ్రమైన విమర్శలు చేశారు. డబ్బులు తీసుకుని పదవి వచ్చేలా చేశారన్నారు. ఆ తర్వాత కూడా పలువురు ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా చేస్తున్నారని.. సీనియర్లను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు చేశారు. అయితే మాణిగం ఠాగూర్ మాత్రం పార్టీ అంతర్గత విషయాలపై ఎప్పుడూ బయట మాట్లాడలేదు. 

బీఆర్ఎస్‌తో పొత్తు ప్రతిపాదనలు సీనియర్లు తెచ్చారా? 

కానీ ఇటీవల కొంత మంది సీనియర్లు.. తెలంగా ణ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడం కన్నా.., భారత రాష్ట్ర సమితితో కలిసి ఎన్నికలకు వెళ్లడం మంచిదన్న అభిప్రాయాన్ని మాణిగం ఠాగూర్ వద్ద వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. అయితే  బీఆర్ఎస్‌తో వెళ్లడం అంటే.. కాంగ్రెస్ పార్టీ ఆత్మహత్య చేసుకున్నట్లేనని అలాంటి ఆలోచనలేమీ పెట్టుకోవద్దని  ఠాగూర్ తో పాటు రేవంత్ రెడ్డి కూడా సీనియర్లకు తెగేసి చెప్పినట్లుగా చెబుతున్నారు. ఈ కారణంగా సీనియర్లు మరింత అసంతృప్తికి లోనయ్యారని.. వారంతా  రేవంత్ ను .. ఠాగూర్ ను టార్గెట్ చేసుకున్నారని అంటున్నారు. చాలా కాలంగా ఈ గ్రూపు గొడవలను భరిస్తున్నానని ఇక ముందు తాను భరించలేనని.. రాహుల్ గాంధీకి మాణిగం ఠాగూర్ తేల్చి చెప్పారని అంటున్నారు. 

హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది ?

ఇప్పుడు హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. సీనియర్లు ఇతర పార్టీలతో టచ్ లో ఉన్నారని కాంగ్రెస్ హైకమాండ్‌కు అనేక ఫిర్యాదులు వచ్చాయి. అయితే వారిపై ముందుగానే చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. అందుకే దిగ్విజయ్ సింగ్ ను పంపి.. సీనియర్ల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అయితే తాము టీ పీసీసీ నిర్వహించే కార్యక్రమాలను వెళ్లబోమని సీనియర్లు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్రకు కూడా అనుమతి ఇవ్వవొద్దని ఎవరి నియోజకవర్గాల్లో వారు పాదయాత్ర చేసుకునేలా చాన్స్ ఇస్తే చాలని సీనియర్లు అంటున్నారు. మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలు కీలక మలుపులు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Published at : 04 Jan 2023 07:06 PM (IST) Tags: Manikyam Tagore Telangana Congress Telangana Congress Seniors Manigam Tagore Telangana Congress Politics

సంబంధిత కథనాలు

దర్శకుడు కె.విశ్వనాథ్‌ మృతిపై సీఎం జగన్ దిగ్భ్రాంతి- తెలుగు సినీరంగానికి తీరన లోటని కామెంట్‌!

దర్శకుడు కె.విశ్వనాథ్‌ మృతిపై సీఎం జగన్ దిగ్భ్రాంతి- తెలుగు సినీరంగానికి తీరన లోటని కామెంట్‌!

KCR Political strategy : గవర్నర్‌తో రాజీ - బడ్జెట్ పై సైలెన్స్ ! బీజేపీపై కేసీఆర్ దూకుడు తగ్గిందా ?

KCR Political strategy : గవర్నర్‌తో రాజీ - బడ్జెట్ పై సైలెన్స్ ! బీజేపీపై కేసీఆర్ దూకుడు తగ్గిందా ?

TSPSC: 'గ్రూప్-4' రాతపరీక్ష తేదీని వెల్లడించిన టీఎస్‌పీఎస్సీ! ఎగ్జామ్ ఎప్పుడంటే?

TSPSC: 'గ్రూప్-4' రాతపరీక్ష తేదీని వెల్లడించిన టీఎస్‌పీఎస్సీ! ఎగ్జామ్ ఎప్పుడంటే?

TSWRES Inter Admissions: తెలంగాణ గురుకుల సైనిక పాఠశాలలో ఇంటర్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్! పరీక్ష ఎప్పుడంటే?

TSWRES Inter Admissions: తెలంగాణ గురుకుల సైనిక పాఠశాలలో ఇంటర్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్! పరీక్ష ఎప్పుడంటే?

TSSPDCL Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్- 1601 'కరెంటు' కొలువుల భర్తీకి నోటిఫికేషన్లు

TSSPDCL Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్- 1601 'కరెంటు' కొలువుల భర్తీకి నోటిఫికేషన్లు

టాప్ స్టోరీస్

K Viswanath : హిందీలోనూ విశ్వనాథ్ హిట్టే, ఆయన 'స్వయంకృషి' - ఓ తీరని కోరిక

K Viswanath : హిందీలోనూ విశ్వనాథ్ హిట్టే, ఆయన 'స్వయంకృషి' - ఓ తీరని కోరిక

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!

Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!

K.Viswanath: చిరంజీవితో విశ్వనాథ్‌కు ప్రత్యేక అనుబంధం - కళా తపస్విని కన్నతండ్రిలా భావించే మెగాస్టార్!

K.Viswanath: చిరంజీవితో విశ్వనాథ్‌కు ప్రత్యేక అనుబంధం - కళా తపస్విని కన్నతండ్రిలా భావించే మెగాస్టార్!