![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Mancherial: ఆ బ్రాండ్ బీర్ల కోసం పోరాటం, యువకుడి విజయంతో మందుబాబుల సన్మానం
Telugu News: కింగ్ ఫిషర్ లైట్ బీర్ల కోసం ఓ యువకుడు చేసిన ప్రయత్నం ఫలించింది. అతణ్ని తోటి మందుబాబులు అందరూ సన్మానించారు. ఈ విషయం సర్వత్ర చర్చనీయాంశం అవుతోంది.
![Mancherial: ఆ బ్రాండ్ బీర్ల కోసం పోరాటం, యువకుడి విజయంతో మందుబాబుల సన్మానం Mancherial drunkers facilitates District President of Drunkards Welfare Association Mancherial: ఆ బ్రాండ్ బీర్ల కోసం పోరాటం, యువకుడి విజయంతో మందుబాబుల సన్మానం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/30/c2ac748defacf2850501be8da57773f11714482893988234_original.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Kingfisher Beers in Telangana: లైట్ బీర్ల పొరాటంలో విజయం సాధించాడు తాగుబోతుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు. మంచిర్యాల జిల్లాలో తాగుబోతుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొట్రంగి తరుణ్ బీర్ల కోసం చేసిన పోరాటంలో విజయం సాధించాడు. మంచిర్యాలలోని పలు వైన్ షాప్ లలో, బార్లలో కింగ్ ఫిషర్ లైట్ బీర్లు అందుబాటులో లేకపోవడంతో నిన్న సోమవారం (ఏప్రిల్ 29) జిల్లా ఎక్సెజ్ అధికారికి వినతి పత్రం అందజేశారు. రాష్ట్రానికి ఆదాయం సమకూర్చే తమకు బీర్లు అందుబాటులో లేకపోవడం ఇబ్బందిగా మారిందని లెటర్ ప్యాడ్ మీద రాతపూర్వకంగా విజ్ఞప్తి చేశారు.
దీంతో స్పందించిన అధికారులు తెల్లారేసరికి వైన్స్, బార్లలో కింగ్ ఫిషర్ లైట్ బీర్లు అందుబాటులో ఉంచారు. మంగళవారం (ఏప్రిల్ 30) తరుణ్ ఓ వైన్ షాపులో లైట్ బిర్లను కొనుగోలు చేశాడు. అధికారులు ఆన్ని షాపుల్లో బీర్లను అందుబాటులో ఉంచడంతో పలు వైన్స్, బార్లు తిరుగుతున్న మందుబాబులు తరుణ్ ను పిలిచి అభినందించి శాలువాతో సన్మానించారు. 24 గంటల్లో తమ డిమాండ్ ను నెరవేర్చడంతో తాగుబోతుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. మొత్తానికి తరుణ్ బీర్ల కోసం న్యాయమైన డిమాండ్ ని అధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు వైన్ షాపుల్లో బీర్లను అందుబాటులో ఉంచారు. ఇప్పుడూ ఈ విషయం సర్వత్ర చర్చనీయాంశం అవుతోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)