అన్వేషించండి

Mallareddy Land Issue : పోలీసుల అదుపులో ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి - భూ వివాదమే కారణం !

Hyderabad News : భూవివాదం కేసులో మాజీ మంత్రి మల్లారెడ్డిని, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుచిత్రలో తమ భూమిలో వేరే వారు ఫెన్సింగ్ వేశారని మల్లారెడ్డి ఆరోపిస్తున్నారు


Telangana  News :  మాజీమంత్రి మల్లారెడ్డి , ఆయన అల్లురు రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  పేట్‌బషీరాబాద్‌ పీఎస్‌కు తరలించారు . సుచిత్ర పరిధిలోని సర్వే నెం.82లో భూ వివాదం నేపథ్యంలో…. ల్యాండ్‌ దగ్గరకు వచ్చి హల్‌చల్‌ సృష్టించారు మల్లారెడ్డి, రాజశేఖర్‌ రెడ్డి. ఈ తరుణంలోనే… మల్లారెడ్డిని పేట్‌బషీరాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  .కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని కాపాడుకుంటానంటూ మల్లారెడ్డి వివాదం ఉన్న స్థలంలో వీరంగం సృష్టించారు.  పోలీసుల ముందే మల్లారెడ్డి అనుచరులు ఫెన్సింగ్‌ను కూల్చివేశారు. గతంలో ఈ భూమి తమదేనంటూ 15 మంది వచ్చారు. 400 గజాల చొప్పున 1.11 ఎకరాల భూమిని కొన్నామన్నారు. కోర్టు కూడా తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని 15 మంది తెలిపారు. స్థలంపై కోర్టు ఆర్డర్‌ ఉన్నందున సామరస్యంగా పరిష్కరించుకోవాలని పోలీసులు ఇరు వర్గాలకు సూచించారు.

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా  సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో  మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన స్థలం కొర్టు వివాదంలో ఉంది. ఈ క్రమంలోనే ఈ స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారని ఆరోపిస్తూ మల్లారెడ్డి, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, తమ అనుచరులతో కలిసి స్థలంలో వేసిన భారీ కేడ్లను తొలగించారు.అక్కడున్న రెండున్నర ఎకరాల భూమి తనదే అంటూ వాగ్వాదానికి దిగారు.  అందులో  1.06 గుంటల భూమి తమదంటూ మరో 15 మంది అడ్డుకున్నారు. ఒక్కొక్కరం 400 గజాల చొప్పున గతంలో భూమి కొనుగోలు చేశామని 15 మంది చెప్తున్నారు. కోర్టు సైతం తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. మల్లారెడ్డి తన అనుచరులతో బెదిరింపులకు గురి చేస్తున్నారని వాపోయారు. పోలీసులు ఇరువురికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

 కోర్టు ఆర్డర్ ఉన్నందున సంఘటన స్థలంలో ఎలాంటి గొడవలు చేయొద్దని ఇరువర్గాలకు సర్ది చెప్పారు పోలీసులు. ఈ క్రమంలోనే మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ  ఉద్రిక్తత నెలకొంది. అయితే పోలీసులు ఎంత చెప్పినా మల్లారెడ్డి ,రాజశేఖర్ రెడ్డి వినలేదు. దీంతో మల్లారెడ్డిని  అదుపులోకి తీసుకుని పేట్ బషీరాబాద్ పీఎస్ కు తరలించారు పోలీసులు.తర్వాత మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. 

మాజీ మంత్రి మల్లారెడ్డిపై చాలా కాలంగా భూ వివాదాలు ఉన్నాయి. ఆయన ఐదేళ్లు ఎంపీగా, ఐదేళ్లు మంత్రిగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయనపై చాలా ఆరోపణలు వచ్చినప్పటికీ.. అధికారంలో ఉండటంతో ఎలాంటి కేసులు నమోదు కాలేదు. కానీ కోర్టు ఆదేశాలు  తప్పనిసరిగా కొన్ని కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం మారిన తర్వాత మరింత ఎక్కువగా ఆయనపై ఫిర్యాదులు వస్తున్నాయి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra BJP New Chief: ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
HYDRA: 'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
Sidhu True Husband: మగ సావిత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ - దాదాపుగా చనిపోయిన భార్యను బతికించుకున్న వైనం తెలిస్తే మీరే ఒప్పుకుంటారు !
మగ సావిత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ - దాదాపుగా చనిపోయిన భార్యను బతికించుకున్న వైనం తెలిస్తే మీరే ఒప్పుకుంటారు !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Aus vs India First Test Day 1 Highlights | భారత పేసర్ల ధాటికి కుయ్యో మొర్రోమన్న కంగారూలు | ABP DesamAus vs Ind First Test First Innings | పెర్త్ లో పేకమేడను తలపించిన టీమిండియా | ABP Desamపేలిన ఎలక్ట్రిక్ స్కూటీ, టాప్ కంపెనీనే.. అయినా బ్లాస్ట్!ప్రసంగం మధ్యలోనే  ఏడ్చేసిన కాకినాడ కలెక్టర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra BJP New Chief: ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
HYDRA: 'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
Sidhu True Husband: మగ సావిత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ - దాదాపుగా చనిపోయిన భార్యను బతికించుకున్న వైనం తెలిస్తే మీరే ఒప్పుకుంటారు !
మగ సావిత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ - దాదాపుగా చనిపోయిన భార్యను బతికించుకున్న వైనం తెలిస్తే మీరే ఒప్పుకుంటారు !
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Samantha: మగాళ్లు నిందించినప్పుడు తలెత్తుకుని నిలబడు... సమంత పోస్ట్ చేసిన కవిత రాసింది ఎవరో తెలుసా? 
మగాళ్లు నిందించినప్పుడు తలెత్తుకుని నిలబడు... సమంత పోస్ట్ చేసిన కవిత రాసింది ఎవరో తెలుసా? 
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
Embed widget