Mahbubnagar local body byelection : ఫలితం జూన్ 2 తర్వాతే - మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కౌంటింగ్ వాయిదా !
Telangana News : మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఉపఎన్నిక కౌంటింగ్ కోడ్ కారణంగా వాయిదాపడింది. జూన్ 2 తర్వాతే నిర్వహించనున్నారు.
Mahbubnagar local body MLC by-election : మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ వాయిదా పడింది. మార్చి 28న మహబూబ్ నగర్ లోని MLC పదవికి ఎన్నికలు నిర్వహించారు. అయితే ఏప్రిల్ 2న జరగాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ వాయిదా వేయాలంటూ జిల్లా కలెక్టర్ ను ఎన్నికల కమిషనర్ ఆదేశింది. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో కౌంటింగ్ నిలిపివేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందని ఎన్నికల కమిషన్ ఈనిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ పూర్తిన తర్వాత ఈ ఎన్నికల ఫలితాలు తెలపాలని ఈసీ ఆదేశించింది. తిరిగి జూన్ 2న ఎన్నికల కౌంటింగ్ నిర్వహించాలని ఈసీ సూచిందింది.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్‌కుమార్‌రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్‌గౌడ్ బరిలో నిలిచారు. మార్చి ఇరవై ఎనిమిదో తేదీన జరిగిన పోలింగ్‌లో 99.86 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం1439 మందికి గానూ 1437 మంది స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాగర్‌కర్నూలు,నారాయణపేట కేంద్రాల్లో ఇద్దరు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకోలేదు. మొత్తం 10 పోలింగ్ కేంద్రాలకు గానూ 8 కేంద్రాల్లో 100 శాతం ఓటింగ్ నమోదైంది.కొడంగల్ ఎంపీడీవో కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ అఫిషియో ఓటు వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో ఆయన ఓటు వేశారు.
అధికార కాంగ్రెస్ నుంచి.. టిటిడి బోర్డు మాజీ మెంబర్ జీవన్ రెడ్డి బరిలో ఉండగా.. బీఆర్ఎస్ తరఫున జడ్పీ మాజీ చైర్మన్ నవీన్ కుమార్ రెడ్డి, ఇండిపెండెంట్ గా సుదర్శన్ గౌడ్ పోటీ పడుతున్నారు. ఎలాగైనా సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని కాపాడుకోవాలని బీఆర్ఎస్ తపన పడుతుండగా.. అధికార కాంగ్రెస్ ఆ స్థానాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నాలు చేసింది. పూర్తి స్తాయిలో బలం ఉన్నా.. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలో ఓడిపోతే బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలినట్లవుతుంది. అయితే కౌంటింగ్ వాయిదా పడటంతో బీఆర్ఎస్ ఊపిరి పీల్చుకున్నట్లవుతోంది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరగుతున్న మొద టి ఎన్నికలు కావడం, సిఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కావడంతో ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మా రాయి. కాంగ్రెస్ ఆపరేషన్ నిర్వహించి అనే క మంది బిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులను చేర్చుకుంది. బిజె పి, ఇతర పార్టీలకు చెందిన వారు కూడా కాంగ్రెస్‌కు మద్ద తు ఇస్తున్నారు. మహబూబ్‌నగర్, గద్వాల మున్సిపల్ చైర్మ న్లు, కౌన్సిలర్లు అనేక మంది కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నా రు. నాగర్‌కర్నూల్ మినహా అన్ని జిల్లాల జడ్‌పి చైర్మన్లు కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే బీఆర్ఎస్ నేతలు క్యాంపులు నిర్వహించి ఓటర్లను కాపాడుకున్నారు. ఫలితం ఎవరిదన్నది.. వచ్చే జూన్ లోనే తేలనుంది.