News
News
వీడియోలు ఆటలు
X

Heart Attack : మహబూబాబాద్ జిల్లాలో విషాదం, గుండెపోటుతో 13 ఏళ్ల చిన్నారి మృతి

Heart Attack : వయసుతో సంబంధం లేకుండా గుండె సమస్యలు వేధిస్తున్నాయి. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో 13 ఏండ్ల చిన్నారి గుండెపోటుతో మరణించింది.

FOLLOW US: 
Share:

Heart Attack : కరోనా తర్వాత గుండె సమస్యలు అధికం అయ్యాయని వైద్యులు అంటున్నారు. పోస్ట్ కోవిడ్ సమస్యల్లో హార్ట్ ఎటాక్ లు కలవరపెడుతున్నాయి. ఉన్నచోటనే కుప్పకూలుతున్న ఘటనలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో హార్ట్ ఎటాక్ తో చనిపోయారు. మహబూబాబాద్ జిల్లాలో 13 ఏళ్ల చిన్నారి స్రవంతి హార్ట్ ఎటాక్ తో మృతి చెందింది. మరిపెడ మండలం అబ్బాయిపాలెంలో ఈ విషాదం నెలకొంది. మార్చి 30న శ్రీరామనవమి వేడుకల్లో తోటి చిన్నారులతో పొద్దంతా ఆడుతూ పాడుతూ గడిపిన చిన్నారి రాత్రి పడుకునే సమయంలో గుండెపోటుతో చనిపోయింది. బోడతండాకు చెందిన బోడ లకపతి, బోడ వసంతలకు ఇద్దరు సంతానం. రెండో కుమార్తె స్రవంతి స్థానిక ప్రైవేట్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. నాయనమ్మ దగ్గర పడుకున్న చిన్నారిని తెల్లవారుజామున లేపే సరికి ఒక్కసారిగా కుప్పకూలింది. చిన్నారికి బాబాయ్ సీపీఆర్ చేసి వెంటనే ఆర్ఎంపీ దగ్గరకు తీసుకెళ్లాడు. అప్పటికే బాలిక చనిపోయినట్లు వైద్యుడు నిర్ధారించారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

గుండెపోటు వచ్చే ముందు కనిపించే లక్షణాలివే! 

ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా 20 ఏళ్ల యువకులు కూడా గుండెపోటు బారిన పడి మరణిస్తున్నారు. డ్యాన్స్ చేస్తూ, కాలేజీలో నడుస్తూ అక్కడికక్కడే కుప్పకూలిపోయిన యువకుల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు యాభై ఏళ్లు దాటిన వారే గుండె ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించేవారు.  ఇప్పుడు యువత కూడా గుండె జబ్బుల ప్రమాదంలో పడింది, కాబట్టి గుండెపోటు వచ్చే ముందు కనిపించే లక్షణాలపై అవగాహన పెంచుకుంటే ముందే జాగ్రత్త పడే అవకాశం ఉంది.

ఎందుకు వస్తుంది?

గుండెపోటు రావడానికి ప్రధాన కారణం రక్తనాళాల్లో రక్తప్రసరణకు అడ్డంకులు ఏర్పడడం, రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం జరిగితే  గుండె సరిగా రక్త సరఫరా చేయలేదు. దీనివల్ల గుండెపోటు వస్తుంది. ప్రపంచంలో గుండె జబ్బుల కారణంగా ప్రతి ఏటా 17 మిలియన్లకు పైగా వ్యక్తులు ప్రాణాలు కోల్పోతున్నారు. వీరిలో ఐదవ వంతు మమరణాలు సంభవిస్తున్నది మనదేశంలోనే. హృదయ సంబంధ వ్యాధులు అనేక రకాలుగా ఉంటాయి అధిక రక్తపోటు వల్ల కలిగేవి, అరిథ్మియా, హృదయ ధమణి వ్యాధి ఇలా రకరకాలుగా రక్తనాళాల్లో ఇబ్బందులను కలుగ చేసే జబ్బులు ఉన్నాయి. ఏదేమైనా చివరకు జరిగేది గుండెపోటు రావడమే. అయితే గుండెపోటు వచ్చే ముందు కొన్ని ప్రారంభ లక్షణాలు కనిపిస్తాయి. వీటిని చాలామంది తేలిగ్గా తీసుకుంటారు. 

కనిపించే లక్షణాలు

1. ఛాతి నొప్పి వస్తూ పోతూ ఉంటుంది. 
2. శ్వాస సరిగా ఆడదు.
3. చేయి లేదా భుజం నొప్పి వేధిస్తూ ఉంటుంది.
4. బలహీనంగా ఉన్నట్టు అనిపిస్తుంది.

 ఈ లక్షణాలు గుండెపోటు రావడానికి కొన్ని వారాలు లేదా రోజులు ముందు జరగవచ్చు. కొందరి విషయంలో గంటల ముందు కూడా ఇవి కనిపించే అవకాశం ఉంది. మెడ గట్టిగా పట్టేయడం, భుజం నొప్పి, అజీర్ణం, అలసట, చల్లని చెమటలు పట్టడం కూడా గుండెపోటు రాకకు ముందస్తు సంకేతాలే. అలాగే మానసిక ఆందోళన, ఏదో వినాశనం జరగబోతుంది అంటూ వచ్చే ఆలోచనలు, గుండె దడ, శ్వాస సరిగా ఆడక పోవడం కూడా తీవ్రంగా పరిగణించాల్సిన లక్షణాలు. ఇక్కడ చెప్పినవన్నీ రోజుల్లో కాసేపు వచ్చి పోతుండటంతో ఎక్కువమంది వీటిని తేలిగ్గా తీసుకుంటారు. ఇవి కొన్ని నిమిషాల పాటు లేదా సెకండ్ల పాటు కనిపించినా కూడా గుండె వైద్యులను కలిసి పరిస్థితిని వివరించడం చాలా ముఖ్యం.

Published at : 31 Mar 2023 04:47 PM (IST) Tags: Mahabubabad Heart Attack Death TS News Minor Girl

సంబంధిత కథనాలు

Raghunandan Rao: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు లీగల్ నోటీసులు, రూ.1000 కోట్ల పరువునష్టం దావా

Raghunandan Rao: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు లీగల్ నోటీసులు, రూ.1000 కోట్ల పరువునష్టం దావా

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

TSPSC Paper Leak: పేపర్ లీక్ కేసులో సంచలనం, ఎగ్జామ్ లో బ్లూటూత్ వాడిన ముగ్గురు అభ్యర్థుల అరెస్ట్

TSPSC Paper Leak: పేపర్ లీక్ కేసులో సంచలనం, ఎగ్జామ్ లో బ్లూటూత్ వాడిన ముగ్గురు అభ్యర్థుల అరెస్ట్

Warangal CP: హోంగార్డుకు వరంగల్ సీపీ సత్కారం, అతను చేసిన పనికి సీపీ ఫిదా!

Warangal CP: హోంగార్డుకు వరంగల్ సీపీ సత్కారం, అతను చేసిన పనికి సీపీ ఫిదా!

టాప్ స్టోరీస్

4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం

4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం

Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?

Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?

'యూత్‌ ను ఎంకరేజ్‌ చేయాలే, ధమ్‌ ధమ్‌ చేయొద్దు' - జక్కన్న ట్వీట్ వైరల్!

'యూత్‌ ను ఎంకరేజ్‌ చేయాలే, ధమ్‌ ధమ్‌ చేయొద్దు'  - జక్కన్న ట్వీట్ వైరల్!

Bonda Uma: టీడీపీ సంక్షేమ మేనిఫెస్టోతో తాడేపల్లి పునాదులు కదులుతున్నాయి- బొండా ఉమా

Bonda Uma: టీడీపీ సంక్షేమ మేనిఫెస్టోతో తాడేపల్లి పునాదులు కదులుతున్నాయి- బొండా ఉమా