By: ABP Desam | Updated at : 18 Feb 2023 08:35 AM (IST)
Edited By: jyothi
రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు - శివనామస్మరణతో మారుమోగుతున్న శైవాలయాలు
Maha Shivaratri 2023: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినం ఘనంగా జరుగుతోంది. ఏ శివాలయం చూసిన భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుంచే భక్తులు శివయ్యకు ప్రత్యేక పూజలు చేసేందుకు ఆలయాలకు చేరుకుంటున్నారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ శైవక్షేత్రాలు మహాశివరాత్రి శోభను సంతరించుకున్నాయి. శుక్రవారం రోజు నుంచే చాలా మంది భక్తులు ఆలయాలకు తరలి వెళ్తున్నారు. అయితే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా ఉండేందుకు ఆలయ కమిటీలు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయాలను రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయంతో పాటు ఆదిలాబాద్ జిల్లాలోని బాసర సరస్వతీ క్షేత్రం, ఏడుపాయల వనరుద్గా భవాని మాత ఆలయం, మేడ్చల్ జిల్లాలోని కీసరగుట్ట, జోగులాంబ గద్వాల జిల్లాలోని జోగులాంబ ఆలయం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర-ముక్తీశ్వర స్వామి, కోటగుళ్లు, ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాల్లో భక్తులు కిటకిట లాడుతున్నారు.
మహబూబాబాద్ జిల్లాలోని కురవి వీర భద్రస్వామి, పాలకుర్తి సోమేశ్వర స్వామి, వరంగల్ లోని స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి, కాశీబుగ్గలోని కాశీవిశ్వేశ్వర ఆలయం, నల్గొండ జిల్లా మేళ్ల చెరువులోని స్వయంభూ శంభు లింగేశ్వరాలయం, నార్కట్ పల్లి మండలం చెరువు గట్టులోని పార్వతీ జడల రామ లింగేశ్వరాలయం, దామచర్ల మండలంలోని వాడపల్లి శైవాలయం, నల్గొండలోని పానగల్లు చాయా సోమేశ్వరాలయం శివరాత్రి వేడుకలకు ముస్తాబు అయ్యాయి. కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం శివరాత్రికి ఒకరోజు ముందు నుంచే శివ నామ స్మరణతో మార్మోగుతుంది. శివాలయాల్లో భక్తుల రద్దీ కారణంగా ఎలాంటి అవాంచనీయ ఘటనలు, చోరీలు జరగకుండా పోలీసలు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలందరికనీ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ అందరిలో ప్రేమ, ఆప్యాయత, సోదరభావం వెల్లవిరియాలని గవర్నర్ ఆకాంక్షించారు.
Wishing you all happy and blessed Maha Shivratri.
May the blessings of Lord Shiva stay with all of us forever.
அனைவருக்கும் #மஹாசிவராத்திரி🙏 திருநாள் நல்வாழ்த்துக்கள்.
రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి పర్వదినం శుభాకాంక్షలు.#Mahashivratri#Mahashivratri2023 pic.twitter.com/wcptZ3iM8V — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) February 18, 2023
వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే వేడుకల్లో మొదటి రోజు శుక్రవారం శివనామస్మరణతో పట్టణం మార్మోగింది. స్వామివారి గర్భాలయంలో జరిగే అభిషఏక పూజలను రద్దు చేశారు. శని, ఆది వారాల్లో భక్తులందరికీ లఘు దర్శనమే కల్పించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శివార్చ వేడుకలను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, కప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుతో కలిసి శ్రీ పార్వతీపురం రాజరాజేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
వేములవాడకు హెలికాప్టర్ సేవలు..
మహాశివరాత్రి జాతర కోసం ఏపీ, హైదరాబాద్ నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం వేములవాడ ఆలయ అధికారులు హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. నేరుగా రాజన్న ఆలయ చెరువు ప్రాంతంలో దిగేందుకు ఏర్పాట్లు చేశారు.
Breaking News Live Telugu Updates: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వినియోగించుకున్న సీఎం జగన్
New Contraceptive Tool: గర్భనిరోధకానికి కొత్త సాధనం - తెలుగు రాష్ట్రాల్లో అమలుకు ప్రయత్నాలు
TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!
TS SSC Exams: 'టెన్త్' విద్యార్థులకు అలర్ట్, పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకున్న విద్యాశాఖ!
KCR Tour: నేడు 4 జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన - పూర్తి షెడ్యూల్ ఇదీ
TSPSC Issue : తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య టీఎస్పీఎస్సీ రచ్చ ఖాయమా ? కఠిన చర్యలు తీసుకోబోతున్నారా?
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా
రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష, పరువు నష్టం కేసులో దోషిగా తేల్చిన కోర్టు
Hindenburg Research: మరో బాంబ్ పేల్చిన హిండెన్‌బర్గ్, కొత్త రిపోర్ట్‌పై సిగ్నల్