Breaking News: విజయవాడ: రాహుల్ హత్య కేసులో కోగంటి సత్యం అరెస్టు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
LIVE
Background
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పాదయాత్ర మరోసారి వాయిదా పడింది. ఈ నెల 24 నుంచి ప్రారభించాల్సిన ‘ప్రజా సంగ్రామ యాత్ర’ను ఈ నెల 28న ఆయన ప్రారంభించనున్నారు. బీజేపీ సీనియర్‌నేత, యూపీ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ మృతిచెందడం వల్ల పార్టీ పరంగా సంతాపదినాలు పాటిస్తుందని, ఆ కారణంగానే పాదయాత్రను వాయిదా వేసినట్లు బీజేపీ అధికారికంగా వెల్లడించింది. తొలుత ఈ పాదయాత్రను క్విట్ ఇండియా దినోత్సవం ఆగస్ట్ 9 నుంచి మొదలుపెట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కానీ, అదే సమయంలో పార్లమెంటు సమావేశాలు జరుగుతుండడం, కీలక బిల్లులపై చర్చ వంటి అంశాల నేపథ్యంలో ప్రజా సంగ్రామ యాత్రను 24కు వాయిదా వేశారు. తాజాగా కల్యాణ్‌సింగ్ మరణంతో మరో నాలుగు రోజుల పాటు పాదయాత్ర వాయిదా పడింది.
Also Read: Sangareddy: రాఖీ కట్టించుకోనని మొండికేసిన అన్న.. చెల్లెలు అఘాయిత్యం, కాలనీలో షాకింగ్ ఘటన
విజయవాడ: రాహుల్ హత్య కేసులో కోగంటి సత్యం అరెస్టు
బెజవాడలో సంచలనం సృష్టించిన వ్యాపారవేత్త రాహుల్ హత్య కేసులో కోగంటి సత్యాన్ని పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాహుల్ విజయవాడలో హత్యకు గురైన విషయం తెలిసిందే. అతని మృతదేహం కారులో పడి ఉంది. ఆ మృతదేహాన్ని రాహుల్ దిగా గుర్తించిన తర్వాత పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ మేరకు బెంగళూరులో కోగంటి సత్యాన్ని అరెస్టు చేశారు.
బీసీ కమిషన్ ఛైర్మన్ గా వకుళాభరణం కృష్ణమోహన్ రావు
బీసీ మిషన్ ఛైర్మన్ గా వకుళాభరణం కృష్ణమోహన్ రావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా ప్రభుత్వం శుభప్రద్ పటేల్, కిశోర్ గౌడ్, సీహెచ్ ఉపేంద్ర కమిషన్ లో సభ్యులుగా నియమించింది. బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యుల హోదాలతో సమానంగా సదుపాయాలు ఉంటాయి.
School Re Open: తెలంగాణలో మోగనున్న బడి గంట.. సెప్టెంబర్ ఒకటి నుంచి ఆఫ్‌లైన్ బోధన స్టార్ట్.. ఎవరెవరికి అంటే?
తెలంగాణలో బడిగంట సెప్టెంబర్ ఒకటి నుంచి మోగనుంది. కరోనా నిబంధనలు పాటిస్తూనే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని ప్రత్యక్ష తరగతులు నిర్వహించేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. థర్డ్ వేవ్‌తో ప్రమాదం లేదంటున్న వైద్యుల సూచనలతో విద్యాశాఖాధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. ఎనిమిదో తరగతి నుంచి పీజీ వరకు ఆఫ్‌లైన్ తరగతుల నిర్వహణకు అంతా రెడీ చేశారు. ఉత్తర్వులు కూడా విద్యాశాఖ జారీ చేసింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యక్ష తరగతులు ఆగస్టు 16నుంచి ప్రారంభమయ్యాయి.
వెలిగొండ ప్రాజెక్ట్ పనులను నిలిపివేయించాలి..కేఆర్ఎంబీకి తెలంగాణ లేఖ
వెలిగొండ ప్రాజెక్ట్ పనులను నిలిపివేయించాలని కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఈ మేరకు కృష్ణా బోర్డుకు రాష్ట్ర ఈఎన్సీ లేఖ రాశారు. తాగునీటి కోసం వినియోగించే జలాలు 20 శాతం మాత్రమే లెక్కించాలని లేఖలో పేర్కొన్నారు. బచావత్ ట్రైబ్యునల్ ప్రకారం 20 శాతంగానే లెక్కించాలని తెలిపారు. ఈ మేరకు వెలిగొండ ప్రాజెక్ట్ పనులను నిలిపివేయించాలని కేఆర్ఎంబీ ఛైర్మన్ కు తెలంగాణ ఈఎన్సీ లేఖ రాశారు.
Telangana EMCET: 25న తెలంగాణ ఎంసెట్ ఫలితాలు!
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల చేసేందుకు విద్యాశాఖ సన్నహాలు చేస్తోంది. బుధవారం విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఇంజనీరింగ్ అడ్మిషన్ ప్రక్రియలో ఇంటర్ వెయిటేజ్ అందుకే వీలైనంత త్వరగా ఫలితాలు రిలీజ్ చేసి అడ్మిషన్లు జరిపించాలని చూస్తున్నారు. గతంలో ఇంటర్లో 45 శాతం మార్కులు ఉంటేనే అడ్మిషన్‌కి అర్హత ఉండేది. కరోనా ఉద్ధృతి కారణంగా ఇంటర్ పరీక్షలు జరగలేదు. దీంతో ఎంసెట్‌లో క్వాలిఫై అయితే చాలు సీటు వచ్చే అవకాశం ఉంది.