Gutta Sukhender Reddy : కుమారుడికి టిక్కెట్ ఇవ్వకపోతే శాసనమండలి చైర్మన్ పార్టీ మారిపోతారా ? -ఇదిగో క్లారిటీ
BRS : శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తాను పార్టీ మారుతున్నట్లుగా వస్తున్న వార్తలపై స్పందించారు. తన కుమారుడి టిక్కెట్‌పై త్వరలోనే క్లారిటీ వస్తుందన్నారు.
Legislative Council Chairman Gutta Sukhender Reddy : లోక్‌సభ ఎన్నికల్లో తన కుమారడికి కేసీఆర్ నల్లగొండ లేదా భువనగిరి సీట్లలో ఓ చోట టిక్కెట్ ఇవ్వకపోతే శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెబుతారని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. పార్టీ మారుతున్నాను అనేది పుకార్లు మాత్రమే . నాకు పార్టీ మరాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. తాను బి ఆర్ యస్ పార్టీ అధిష్టానం పైన అసంతృప్తిగా ఉన్నట్లుగా వార్తలను ప్రసారం చేస్తున్నారని . అది కారెక్ కాదన్నారు. సోషల్ మీడియాలో అంత దుష్ప్రచారం చేశారని విమర్శించారు.
నల్గొండ ఎంపీ ,లేదా భువనగిరి ఎంపీగా పోటీ చేయడానికి తన కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడని.. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేస్తాం. పార్టీ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు పార్టీ కోసం పని చేసి కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. మరో రెండు మూడు రోజుల్లో క్లారిటీ వస్తుందని భావిస్తున్నామన్నారు. కొంత మందికి పార్టీపై అసంతృప్తి ఉండవచ్చని చెప్పారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అభివృద్ధి చేసిన మంత్రులు కూడా భారీ తేడాతో ఓడిపోయారని తెలిపారు. ఓటమికి వ్యక్తులు కారణం కారన్నారు.
నల్లగొండ జిల్లాలో పార్టీ అభ్యర్థుల ఓటమికి తానే కారణమని సొంత పార్టీలో విమర్శలు వస్తున్న విషయంపై స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థుల ఓటమికి తానే కారణమైతే ఖమ్మం, మహబూబ్ నగర్ , వరంగల్ జిల్లాలో ఓటమికి ఎవరు కారణమని గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల్లో గాలి వచ్చింది.. పార్టీ ఓడిపోయిందన్నారు. అభివృద్ధి చేసిన మంత్రులు కూడా ఓడిపోయారని చెప్పారు. కేసీఆర్ గారి పైన ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలించాయని.. ఇప్పటికే తన కుమారుడు జిల్లా నేతలను అందరిని కలిశాడని గుత్తా తెలిపారు. అందరితో సమన్వయంతో కలుపుకుపోయే మనస్తత్వం అమిత్ దన్నారు. పార్టీ అధినేత ఏ నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉంటామని ప్రకటించారు. కాంగ్రెస్ లోకి పోయేదానికి టిక్కె్ట ఎందుకు అడుగుతామని ప్రశ్నించారు. హైకమాండ్ ఎవరికి టికెట్ ఇచ్చినా వారి గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు.
నాగార్జున సాగర్ , శ్రీశైలం ప్రాజెక్టు లు కృష్ణా రివర్ బోర్డ్ పరిధిలోకి వెళితే రాష్ట్రానికి గొడ్డలి పెట్టులాంటిదని.. రానున్న రోజుల్లో త్రాగునీరు సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. నీటి సమస్యపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు పనులను పర్యవేక్షణ చేసి ,నీటి సమస్యను రాకుండా చూసుకోవాలి ..ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టుల పెండింగ్ పనులు అన్ని పూర్తి చేయాలన్నారు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన స్వంత జిల్లాలో పెండింగ్ లో ఉన్న పనులపైన ప్రత్యేక దృష్టి పెట్టాలి .. ఇంకా 9.5 కిలోమీటర్లు వర్క్ పూర్తి చేస్తే SLBC సొరంగం పనులు పూర్తి అవుతాయన్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాలు పాత అసెంబ్లీ హాల్ లో జరుపుకోవాలని చూస్తున్నాం. అంతే వేగంగా పనులు జరుగుతున్నాయన్నారు.