Attack On KTR Vehicle : ముషీరాబాద్‌లో కేటీఆర్ కారుపై దాడి - క్షమాపణలు చెప్పాలని ఆందోళనకారుల డిమాండ్ - అసలు గొడవ అదే్
KTR : మూసి నిర్వాసితులకు భరోసా ఇచ్చేందుకు వెళ్తున్న కేటీఆర్ పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. ముషీరాబాద్‌లో ఆయన కారును అడ్డుకున్నారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Attacked On Vehicle of BRS party Working President KTR : ముషీరాబాద్‌లోని మూసి నిర్వాసిత ప్రాంతాల్లో ఉన్న వారికి ధైర్యం చెప్పేందుకు వెళ్తున్న కేటీఆర్ కాన్వాయ్ ను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు. మంత్రి కొండా సరేఖపై బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా విభాగం చేస్తున్న తప్పుడు ప్రచారంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కొండ సురేఖకు వెంటనే క్షమాపణ చెప్పాలని ఆందోళనకారులు నినాదాలు చేశారు. నిన్న తెలంగాణ భవన్ బయట కాంగ్రెస్ శ్రేణులను కొట్టినందుకు క్షమాపణ చెప్పాలన్నారు. ఈ సందర్భంగా ముషీరాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
కొండా సురేఖపై బీఆర్ఎస్ సోషల్ మీడియా అసభ్యకర పోస్టులు
మంత్రి కొండా సురేఖపై వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త ఒకరు పెట్టి పోస్టు తీవ్ర వివాదాస్పదమయింది. మహిళా మంత్రుల్ని కనీసం గౌరవించడం లేదని కిరాయి సోషల్ మీడియా సైనికులతో వ్యక్తిత్వ హననాన్ని చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు .కొండ సురేఖ తనపై సోషల్ మీడియా కార్యకర్త పెట్టిన పోస్టుతో ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణ భవన్ ముట్టడికి ప్రయత్నించారు. అయితే అక్కడ బీఆర్ఎస్ కార్యక్తరులు అడ్డుకన్నారు. ఇప్పుడు కేటీఆర్ మూసి నిర్వాసిత ప్రాంతాల్లో ప్రజలను కలిసేందుకు వస్తున్నట్లుగా తెలియడంతో అడ్డుకునేందుకు ప్రణాళిక సిద్దం చేసుకున్నారు. కొండా సురేఖకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ కాన్వాయ్ ఎదుట ఆందోళనకు దిగారు.
పోస్టులపై చింతిచిన హరీష్ రావు
మరో వైపు కొండా సురేఖపై సోషల్ మీడియా కార్యకర్త పెట్టిన పోస్ట అభ్యంతరకరమైనదేనని.. హరీష్ రావు అంగీకరంచారు. మహిళలను గౌరవించడం అందరి బాధ్యత అని చెబుతూ.. ఆమెకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ఆయన తెలిపారు. ‘‘మహిళల పట్ల అగౌరవంగా ప్రవర్తించడాన్ని ఎవరూ సహించబోరు. బీఆర్‌ఎస్ అయినా.. వ్యక్తిగతంగా నేనైనా ఇలాంటివి ఉపేక్షించం. సోషల్ మీడియా వేదికగా జరిగే వికృత చేష్టలను ఖండిస్తున్నానని తెలిపారు. సోషల్ మీడియాలో బాధ్యతగా వ్యవహరించాలని అందర్నీ కోరుతున్నానని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
దమ్ముంటే నాలాల మీదున్న జీహెచ్ఎంసీ బిల్డింగ్, హైడ్రా ఆఫీసులు కూల్చండి: కేటీఆర్ డిమాండ్
మూసి నిర్వాసితులకు ధైర్యం చెబుతున్న కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందీరకరణను చేపట్టాలని నిర్ణయించడంతో.. ఆ నది తీరాన్ని ఆక్రమించుకున్న వారందర్నీ ఖాళీ చేయించాలని నిర్ణయించుకుంది. అయితే ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా కేటీఆర్ మూసి నిర్వాసితులకు అండగా నిలబడాలని నిర్ణయించుకున్నారు. మూసీ రివర్ బెల్ట్ (Musi River Belt)లో ఉన్న కాలనీలను సందర్శిస్తున్నారు. హైదరాబాద్ లో లక్షలాది మందికి ప్రభుత్వం నిద్ర లేకుండా చేస్తుందని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. ఎవరు ఎప్పుడొచ్చి ఇళ్లను కూల్చుతారో తెలియని పరిస్థితుల్లో ప్రజలు ఆవేదనలో ఉన్నారని మండిడుతున్నారు. ప్రతి ఇంటిపై కేసీఆర్ అని రాయాలని ఎవరు వచ్చి కూలుస్తారో చూస్తామని సవాల్ చేశారు. వరుసగా రెండో రోజు కూడా మూసి బాధితులకు దైర్యం చెప్పేందుకు వెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగింది.
Also Read: KTR News: కేసీఆర్ ఫ్యామిలీ కూడా బాధితులే, ఆ బాధలు మాకంటే ఎవరికి బాగా తెలుసు: కేటీఆర్