Bandi Sanjay vs KTR: మంత్రి కేటీఆర్, బండి సంజయ్ పొలిటికల్ పంచాంగాలు ట్రెండింగ్ - ఓ రేంజ్ లో పంచ్ లు!
KTR Ugadi panchangam vs Bandi Sanjay Ugadi panchangam: పొలిటికల్ లీడర్స్ మంత్రి కేటీఆర్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పరస్పరం పంచాంగం వివరాల తరహాలో విమర్శించుకున్నారు.
Sri Sobhakritu Nama Samvatsaram: తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ సందర్భంగా ప్రజలు తమకు కొత్త సంవత్సరంలో ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు పంచాంగ శ్రవణం వింటారు. నేడు శోభకృత్ నామ ఉగాది సంవత్సరంలోకి మనం అడుగుపెట్టాం. అయితే తెలంగాణలో రెగ్యూలర్ పంచాంగాలకు బదులుగా పొలిటికల్ లీడర్స్ పంచాంగాలు వైరల్ అవుతున్నాయి. అదేంటీ రాజకీయ నాయకులు కూడా పంచాంగం చెబుతారా, ఏంటి అని అనుమానం వచ్చిందా.. అయితే ఇది పొలిటికల్ లీడర్స్ మంత్రి కేటీఆర్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పరస్పరం పంచాంగం వివరాల తరహాలో విమర్శించుకున్నారు. అసలే తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన టీఎస్ పీఎస్సీ పేపర్ల లీకుల వ్యవహారంతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ విచారణ కొనసాగడంపై బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య పరస్పర విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని సోషల్ మీడియాలో ఈ ఇద్దరు పోస్ట్ చేసిన పంచాంగాలు ట్రెండింగ్ అవుతున్నాయి.
కేటీఆర్ పొలిటికల్ పంచాంగం ఇలా..
- ఆదాయం: అదానీకి!
- వ్యయం: జనానికి, బ్యాంకులకు!
- అవమానం: నెహ్రూకి!
- రాజపూజ్యం : గుజరాతీ గుంపుకి!!
బస్, బభ్రాజీమానం భజగోవిందం!
దేశీయ ఉగాది పంచాంగం సమాప్తం!
అని మంత్రి కేటీఆర్ పొలిటికల్ పంచాగంగాన్ని ట్వీట్ చేశారు. పైగా ఇది ఫార్వార్డ్ మెస్సేజ్ అని పోస్టులో రాసుకొచ్చారు కేటీఆర్.
As forwarded 👇😁
— KTR (@KTRBRS) March 22, 2023
ఆదాయం: అదానీకి!
వ్యయం: జనానికి, బ్యాంకులకు!
అవమానం: నెహ్రూకి!
రాజపూజ్యం: గుజరాతీ గుంపుకి!!
బస్, బభ్రాజీమానం భజగోవిందం!
దేశీయ ఉగాది పంచాంగం సమాప్తం!
బండి సంజయ్ పొలిటికల్ పంచాగం ఇలా..
బీజేపీని, ప్రధాని మోదీని విమర్శించేలా కేటీఆర్ చేసిన సెటైరికల్ పంచాంగంపై బండి సంజయ్ స్పందించారు. ఆయన సైతం తనదైన శైలిలో బీఆర్ఎస్, కేసీఆర్ ఫ్యామిలీపై తన పంచాంగం షేర్ చేశారు. పైగా ఇది ఫార్వార్డ్ మెస్సేజ్ అని ట్వీట్ లో పేర్కొన్నారు.
- ఆదాయం: కల్వకుంట్ల కుటుంబానికి
- వ్యయం: తెలంగాణ రాష్ట్రానికి
- అవమానం: ఉద్యమ వీరులకు, అమరుల త్యాగాలకు
- రాజపూజ్యం : ఉద్యమ ద్రోహులకు, దొంగలకు !!
తుస్.., పిట్టల దొర, తుపాకి చంద్రుల గడీల పంచాతీ లెక్క తేలుడే తరువాయి... పతనం ఇగ షురువాయే. అని బండి సంజయ్ ఉగాది రోజు పొలిటికల్ పంచాగాన్ని పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
As forwarded 👇
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) March 22, 2023
ఆదాయం : కల్వకుంట్ల కుటుంబానికి
వ్యయం : తెలంగాణ రాష్ట్రానికి
అవమానం : ఉద్యమ వీరులకు, అమరుల త్యాగాలకు
రాజపూజ్యం : ఉద్యమ ద్రోహులకు, దొంగలకు !!
తుస్.., పిట్టల దొర, తుపాకి చంద్రుల గడీల పంచాతీ లెక్క తేలుడే తరువాయి...పతనం ఇగ షురువాయే.
నేతల పంచాంగాలు చూసిన వారి పార్టీల అభిమానుల మధ్య పంచాంగాల వార్ నడుస్తోంది. ఓ బీఆర్ఎస్ మద్దతుదారు ఇలా పోస్ట్ చేశారు.
అంబానీని ప్రేమించుమన్నా
ఆదానిని పెంచుమన్నా
దేశమంటే పబ్లిక్ కాదోయి
దేశమంటే ప్రైవేటొయి
వొట్టిమాటలు కట్టిపెట్టోయు
గట్టి రైట్ ఆఫ్ లు తలపెట్టవోయ్
లాభాలు పొంగిపోరలే కంపెనీలు కని పెట్టవోయి
కారుచౌకగా అవి ప్రైవేటుకి కట్టపెట్టోయి
బీజేపీ మద్దతుదారులు ఇలా పోస్ట్ చేస్తున్నారు.
ఆదాయం: దొర కుటుంబానికి
వ్యయం: మెగా కాంట్రాక్టు మరియు దొర బంధువులకి
అవమానం: తెతకకు
రాజపూజ్యం:గడీల దొరసానికి
బస్, బభ్రాజీమానం భజగోవిందం!
తెలంగాణ ఉగాది పంచాంగం సమాప్తం!