అన్వేషించండి

ఆ గుంటూరు లెక్చరర్‌ గూబ పగులగొట్టాడు.. ఇంటర్ అనుభవాలు పంచుకున్న కేటీఆర్. 

KTR News: మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తన కాలేజ్ డేస్‌ గుర్తు చేసుకున్నారు. అప్పట్లో గుంటూరులో చదువుకున్న ఆయన.. అక్కడ లెక్చరర్లు తనను కొట్టారంటూ.. నవ్వుకుంటూ చెప్పారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • KTR ఇంటర్మీడియెట్ గుంటూరు విజ్ఞాన్‌లో చదివారు.
  • స్నేహితుడి కోసం హైదరాబాద్ నుండి గుంటూరు వెళ్ళారు.
  • గణితం పట్ల అయిష్టంతో బైపీసీని ఎంచుకున్నారు.
  • సంస్కృతంలో తక్కువ మార్కులు రావడంతో టీచర్ కొట్టారు.

BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఎంత వాగ్ధాటితో మాట్లాడతారో అందరికీ తెలుసు. మొదట్లో ఉద్యోగం చేసిన ఆయన రాజకీయాల్లోకి వచ్చాక గొప్ప స్పీకర్‌గా ఎదిగారు. BRS పార్టీని ప్రత్యక్షంగా నడిపిస్తోంది ఆయనే. ఎడ్యుకేషన్ అంతా తెలంగాణ, యుఎస్‌లో చేసిన KTR ఇంటర్మీడియెట్ గుంటూరు విజ్ఞాన్‌లో చదివారు. రాజకీయాల్లో బాగా పరిచయం ఉన్న వాళ్లకి ఈ విషయం కూడా తెలుసు. అయితే తన ఇంటర్మీడియెట్ రోజులకు సంబంధించి కొన్ని ఆసక్తికర సంగతులు పంచుకున్నారు. ఈ మధ్య విద్యార్థులతో ఇంటరాక్ట్ అయిన ఆయన అప్పటి సంగతులు పంచుకున్నారు. తాను బయోటెక్నాలజీ ఎందుకు చదివారని విద్యార్థులు ప్రశ్నించినప్పుడు దాని వెనుక ఉన్న సంగతిని ఆసక్తికరంగా చెప్పారు. 

నాకు మాథ్‌ అంటేనే పడదు.. కానీ మా కల్యాణ్ గాడు కొంపముంచాడు.. 

"నేను పదోతరగతి పూర్తి చేశాక.. హైదరాబాద్‌లోని ఓ కాలేజీలో చేరా. అయితే నా  చిన్నప్పటి దోస్తుగాడు..గుంటూరు విజ్ఞాన్‌లో చేరడంతో నేను కూడా  అక్కడకి వెళ్లాలని ఇంట్లో పట్టుబట్టా నా కోరిక మీద మా నాన్న అక్కడ సీటు సంపాదించి.. స్వయంగా కేసీఆర్ కారులో ఆయన్ను విజ్ఞాన్‌కు తీసుకెళ్ళారు. అప్పటి సంగతిని KTR చాలా ఆసక్తికరంగా చెప్పారు. "నేను గుంటూరు వెళతా అనడంతో మా నాన్న స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ నన్ను గుంటూరు వరకూ తీసుకెళ్లారు. నేను హైదరాబాద్‌లో HEC గ్రూపులో చేరా..అక్కడకు వెళ్లి HEC అనగానే అదోలా చూశారు. సరే CEC ఇవ్వండి అంటే అదిక్కడ ఉండదు అన్నారు. ఏముంది అంటే MPC,BIPC మాత్రమే అన్నారు."- KTR 


వెనక్కి వెళితే బెల్ట్ ట్రీట్ మెంట్ ఉంటది.. 

"ఇక ఆ రెండు మాత్రమే ఉన్నాయన్నాక వెనక్కు వెళ్లి మా నాన్నకి చెబితే ఏముంటది..? 300 కిలోమీటర్లు డ్రైవ్ చేసి వచ్చాక చదవను అంటే బెల్టు ట్రీట్‌ముంట్ ఉంటది.. ( నవ్వుతూ...) మాథ్స్ అంటే అసలు పడదు.. ఇక చివరకు మిగిలింది బైపీసీ మాత్రమే.. ఫిజిక్స్ లో కూడా మాథ్స్ ఉంటుందని అప్పుడు మర్చిపోయా..కానీ ఇక చేయగలిగింది. మీరు మైక్రోబయాలజీ ఎందుకు చదివారు అని మీరు అడిగితే.. నేను ఇష్టపడి చదవలేదు.. తప్పక చదివాను.." 


సంస్కృతం మాస్టారు గూబ మీద ఒక్కటిచ్చారు 

ఇక విజ్ఞాన్ లోకి వెళ్లాక సెకండ్ లాంగ్వేజ్ తెలుగు లేదన్నారు. సంస్కృతం అంటే.. నేను హైదరాబాద్ లో చదివా.. హిందీలాంటిదే కదా.. మనకోలెక్క కాదు అనుకున్నా.. చాలా ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఎగ్జామ్ రాశా.. ఈ గుంటూరోళ్లకి హిందీ యాడ వస్తది..మనం హైదరాబాద్ అనుకుంటా బిల్డప్ ఇచ్చా.. ( సరదాగా..) చివరకు 25కి 4 మార్కులు వచ్చాయి.. సీతారామయ్యగారని.. సంస్కృతం టీచర్.. గూబ మీద ఒక్కటిచ్చారు. అప్పటి దాకా టీచర్లు కొడతారని నాకు తెలీదు. నన్నెప్పుడూ కొట్టలేదు. మొదటి సారి నన్ను కొట్టినప్పుడు షాక్ అయ్యా.. అని అప్పటి సంగతులు పంచుకున్నారు. 

కేటీఆర్ ఈ విషయాలన్నీ చాలా సరదాగా పంచుకున్నారు. అసలు స్టూడెంట్స్‌ను కొడతారని తనకు తెలీదన్నారు. ఆ కోపంతో బట్టీ బట్టి చదివి స్టేట్ 11th ర్యాంక్ సాధించానన్నారు. 

ఆ తర్వాత కేటీఆర్ హైదరాబాద్‌లో డిగ్రీ పూర్తి చేసి.. పూణే యూనివర్సిటీ నుంచి MSC బయోటెక్నాలజీ చేశారు. ఆ తర్వాత న్యూయార్క్‌లో MBA పూర్తి చేసి.. అమెరికాలోనే ఆరేళ్లు ఉద్యోగం చేశారు. 

టాప్ హెడ్ లైన్స్

VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
KTR Complaints to Rahul Gandhi: రేవంత్‌పై రాహుల్‌కు కేటీఆర్ వరుస ఫిర్యాదులు - చర్యలు తీసుకోరని తెలిసీ బిఆర్ఎస్ వేస్తున్న మైండ్ గేమ్ ఏంటి?
రేవంత్‌పై రాహుల్‌కు కేటీఆర్ వరుస ఫిర్యాదులు - చర్యలు తీసుకోరని తెలిసీ బిఆర్ఎస్ వేస్తున్న మైండ్ గేమ్ ఏంటి?
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget