Ktr: 'వంద రోజుల్లో వంద తప్పులు' - 'అబద్ధాల హస్తం' అంటూ కేటీఆర్ సంచలన ట్వీట్
Telangana News: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించింది. సర్కారుకు 100 ప్రశ్నలు సంధిస్తూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ట్విట్ చేశారు.
Ktr Tweet on Congress 100 Days Ruling: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై వంద రోజులు పూర్తైంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదివారంతో 100 రోజుల పాలనను పూర్తి చేసుకున్నారు. అయితే, దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. 'వంద రోజుల్లో వంద తప్పులు.. పదేళ్ల తర్వాత రైతులకు తిప్పలు.. 4 కోట్ల తెలంగాణ ప్రజలను నమ్మించి మోసం చేసిన అబద్ధాల హస్తం' అంటూ మండిపడ్డారు. 'రూ.2 లక్షల రుణమాఫీ ఏమైంది.?, రైతుభరోసా కింద రూ.15 వేలు ఇంకెప్పుడు.?' అని కాంగ్రెస్ ప్రభుత్వానికి వంద ప్రశ్నలు సంధించారు.
వంద రోజుల్లో.. వంద తప్పులు..
— BRS Party (@BRSparty) March 17, 2024
పదేళ్ల తరువాత.. రైతులకు తిప్పలు..
నాలుగు కోట్ల ప్రజలను నమ్మించి మోసం చేసిన
" అబద్ధాల హస్తం " @INCTelangana
1. రూ. 2 లక్షల రుణమాఫీ ఏమైంది ?
2. రైతుభరోసా కింద రూ.15 వేలు ఇంకెప్పుడు ?
3. రైతుబంధును సీరియల్ లాగా ఎంతకాలం సాగదీస్తారు ?
4. వరి పంటకు…
Also Read: Aroori Ramesh: బీజేపీలో చేరిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే - రెండ్రోజుల్లోనే ట్విస్ట్!