అన్వేషించండి

KTR News: పదేళ్ల బీఆర్ఎస్ కష్టానికి ఫలితం దక్కింది, కేంద్రానికి ధన్యవాదాలు- కేటీఆర్

Defence lands in Hyderabad: హైదరాబాద్‌- కరీంనగర్‌ రాజీవ్ రహదారి, హైదరాబాద్-నాగపూర్ జాతీయ రహదారి రూట్లలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి భూములు ఇవ్వడానికి కేంద్రం పచ్చజెండా ఊపడంపై కేటీఆర్ స్పందించారు.

KTR responds on Defence Ministry gives nod to elevated corridors: హైదరాబాద్: ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు బీఆర్ఎస్ చేసిన సుదీర్ఘ ఫోరాటం ఫలించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌- కరీంనగర్‌ రాజీవ్ రహదారి, హైదరాబాద్-నాగపూర్ జాతీయ రహదారి రూట్లలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రక్షణ శాఖ భూములు ఇవ్వడానికి కేంద్రం పచ్చజెండా ఊపడంపై కేటీఆర్ స్పందించారు. ఇది ముమ్మాటికీ బీఆర్ఎస్ పార్టీ (BRS Party) సాధించిన విజయమని గుర్తుచేశారు. 2023 జూలై 31న జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వీటిపై నిర్ణయం తీసుకుందని, దానికి అనుగుణంగా కేంద్రం ఆమోదం తెలపడంతో సంతోషంగా ఉందన్నారు. గతంలోనే రక్షణశాఖ తమ ఆధీనంలోని 33 ఎకరాలను కేటాయించిందని, ఇప్పుడు మరో 150 ఎకరాలను కూడా అప్పగించేందుకు ముందుకు రావడంతో స్కైవేల నిర్మాణానికి ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయాయని కేటీఆర్ వెల్లడించారు. 

ఎలివేటెడ్ ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం బీఆర్ఎస్ ప్రణాళికలు
ఈ రెండు రూట్లలో రక్షణ శాఖ భూములు ఉండటం వల్ల రోడ్ల విస్తరణ సాధ్యంకాలేదన్నారు. దశాబ్దాల పాటు ప్రభుత్వాలు ఫ్లైఓవర్ల నిర్మాణానికి చొరవ తీసుకోకపోవడంతో... ప్రజలు ట్రాఫిక్ సమస్యతో ఇంతకాలం ఇబ్బందులు పడ్డారని కేటీఆర్ పేర్కొన్నారు. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ రెండు మార్గాల్లో ఎలివేటెడ్ ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం అనేక ప్రణాళికలు రూపొందించామన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు అన్ని నిరంతర సంప్రదింపులు జరిపినట్లు కేటీఆర్ తెలిపారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ప్రతి సందర్భంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తోపాటు.. అప్పటి మంత్రులు, ఎంపీలు ఢిల్లీ పెద్దలను కలిసి వినతిపత్రాలు అందజేయగా, వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఎలివేటెడ్ ఫ్లైఓవర్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన అన్ని రకాల ప్రణాళికలను కేంద్ర ప్రభుత్వానికి పంపించామని.. కేంద్రం లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు అందిస్తూ ప్రక్రియను వేగవంతం చేశామన్నారు.

ఇది సమిష్టి విజయమన్న కేటీఆర్
హైదరాబాద్‌లోని రక్షణ శాఖ భూముల మీదుగా ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణానికి మార్గం సుగమం అయింది. దాంతో ఇక ఆయా రూట్లలో వచ్చి వెళ్లే ప్రజలకు పూర్తిగా ట్రాఫిక్ కష్టాలు పూర్తిగా తీరిపోతాయని కేటీఆర్ సంతోషం వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు గత బీఆర్ఎస్ పదేళ్ల పాటు చేసిన పోరాటంలో భాగస్వాములైన అధికారులకు, యంత్రాంగానికి కేటిఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఏ ఒక్కరి వల్లో ఇది సాధ్యం కాలేదని, ఇది సమిష్టి విజయమని స్పష్టంచేశారు. ఎల్బీనగర్ తోపాటు.. ఇతర రూట్లలో ఇలాంటి అడ్డంకులు లేకపోవడంతో... గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో.. యుద్ధప్రాతిపదికన అనేక ఫ్లేఓవర్ల నిర్మాణాలు పూర్తిచేయగలిగామని గుర్తుచేశారు. తమ పాలనలో మెరుపు వేగంతో నిర్మించిన ఫ్లేఓవర్లు, అండర్ పాస్ ల వల్ల హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్యలు శాశ్వతంగా తీరిపోయాయని స్పష్టంచేశారు. 

తాజాగా, జేపీఎస్ నుంచి శామీర్ పేట, ప్యారడైజ్ నుంచి కండ్లకోయ రూట్ లలో రెండు ఫ్లై ఓవర్లకు కేంద్రం నుంచి  గ్రీన్ సిగ్నల్ లభించడంతో ఇక రాష్ట్ర ప్రభుత్వం వీటి నిర్మాణాలను అత్యధిక ప్రాధాన్యతా క్రమంలో పెట్టుకుని పనులు చేపట్టాలని కోరారు. దశాబ్దాల సమస్యకు పరిష్కారం లభించడంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఎలివేటెడ్ ఫ్లేఓవర్ల నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలన్నారు. వీటి వల్ల హైదరాబాద్ నలుదిశలా విస్తరించడంతోపాటు.. ప్రతి రూట్లో ప్రగతిపథంలో దూసుకుపోవడానికి మార్గం సుగమమైందని వెల్లడించారు. ఇన్నాళ్లకు తమ పోరాటాన్ని గుర్తించి దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వ పెద్దలకు కేటీఆర్ ఈ సందర్భంగా తెలంగాణ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Telangana News: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
Game Changer 3rd Single: 'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Telangana News: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
Game Changer 3rd Single: 'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Bangladesh:  బంగ్లాదేశ్ లో నరకం అనుభవిస్తున్న  హిందువులు - ఇస్కాన్ చిన్మయ్ కృష్ణ అరెస్టే సాక్ష్యం  !
బంగ్లాదేశ్ లో నరకం అనుభవిస్తున్న హిందువులు - ఇస్కాన్ చిన్మయ్ కృష్ణ అరెస్టే సాక్ష్యం !
Bengaluru: జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !
జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Embed widget