Ktr Review : పరిశ్రమలకు రాజమార్గం.. సమీక్షలో అధికారులకు కేటీఆర్ దిశానిర్దేశం..!
తెలంగాణలో కొత్తగా రాబోతున్న పారిశ్రామిక పార్కుల్లో కాలుష్య నియంత్రణ చర్యలపై కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఔటర్ లోపల ఉన్న పరిశ్రమల్ని బయటకు తరలించేలా అధికారులకు సూచనలు ఇచ్చారు.

కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు అవతలకు తరలించేంలా పరిశ్రమల మంత్రి కేసీఆర్ అధికారులకు ప్రత్యేకమైన సూచనలు ఇచ్చారు. తెలంగాణ పరిశ్రమల శాఖ కార్యకలాపాలపై టిఎస్ఐఐసి కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణలో ఉన్న పారిశ్రామిక పార్కుల అభివృద్ధిపైన ప్రధానంగా అధికారులకు సూచనలు చేశారు. ముఖ్యంగా నూతన పారిశ్రామిక పార్కుల్లో కాలుష్య నియంత్రణ కోసం అవసరమైన చర్యలపై అడిగి తెలుసుకున్నారు. కొత్త పరిశ్రమలు పెద్ద ఎత్తున వస్తున్నందున.. కాలుష్య నియంత్రణపై ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. దీని కోసం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తో పనిచేయాలని పరిశ్రమల శాఖ అధికారులకు కేటీఆర్ సూచించారు.
ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న పరిశ్రమలను నగరం బయటకు తరలించేందుకు చేస్తున్న ప్రయత్నాలను తెలుసుకున్నారు. చాలా రోజుల నుంచి ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా పరిశ్రమలను అలా ఔటర్ వెలుపల ఏర్పాటయ్యేలా చూశారు. ఇంకా కొన్ని పరిశ్రమలో నగరంలోనే ఉన్నాయి. ఇవి కాలుష్య కారకం కావడంతో వాటి తరలింపుపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ పరిశ్రమల తరలింపు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని.. ఈ దిశగా పరిశ్రమల శాఖలో ఉన్న వివిధ డైరెక్టర్లు తమ పరిధిలోకి ఉన్న పరిశ్రమల తరలింపు వ్యవహారాలను సమన్వయం చేసుకోవాలని కేటీఆర్ ఆదేశించారు.
హైదరాబాద్‌లో ఔటర్ లోపల ఉన్న పరిశ్రమల సమగ్ర సమాచారాన్ని.. వాటి ఉత్పత్తుల శైలి.. కాలుష్యం ఎంత మేర విడుదలవుతుంది.. వంటి సమాచారాన్ని ప్రత్యేకంగా తెలుసుకోవాలని అధికారులకు కేటీఆర్ సూచించారు. క్షేత్రస్థాయిలో అధికారుల బృందం పర్యటించి నగరంలో ఉన్న పరిశ్రమలకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని సిద్ధం చేయాలని ఆదేశించారు. అలా చేసినప్పుడే.. తగినన్ని జాగ్రత్తలు.. కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకోగలమని కేటీఆర్ భావిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయి. నూతన పరిశ్రమల్లో తెలంగాణ స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు
కరోనా పరిస్థితుల నేపధ్యంలోనూ పెద్ద ఎత్తున పరిశ్రమలు తెలంగాణకు వస్తున్నాయి. ఈ క్రమంలో మరింత మెరుగైన సౌకర్యాలు .. పెట్టుబడిదారులకు కల్పించాలని కేటీఆర్ భావిస్తున్నారు. పరిశ్రమల శాఖలో ఉన్న వివిధ విభాగాల వారీగా ఆయా డైరెక్టర్లతో రాష్ట్రానికి రానున్న పెట్టుబడి ప్రపోజల్స్, వాటి పురోగతిపైనా ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ప్రభుత్వం పెట్టుబడిదారులపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుందని.. పరిశ్రమలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామన్న సంకేతాలను పంపాలని కేటీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులంతా పాల్గొన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

