అన్వేషించండి

Bandi Sanjay vs KTR: బండి సంజయ్‌ను కోర్టుకు లాగిన కేటీఆర్ - మీడియా, సోషల్‌మీడియాపైనా దావా - ఇదే కారణం !

KTR: బండి సంజయ్ తో పాటు మీడియా, సోషల్ మీడియాపై కేటీఆర్ పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు.క్షమాపణలు చెప్పడంతో పాటు పది కోట్లు చెల్లించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

KTR files defamation petition against Bandi Sanjay:  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తో పాటు కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా సంస్థలపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు.   2025 ఆగస్టు 8న బండి సంజయ్ "తప్పుడు, అసభ్యకరమైన, నిరాధారమైన" వ్యాఖ్యలు  చేశారని.. వాటిని ఆయా మీడియాలు విస్తృతంగా ప్రసారం చేశాయని కేటీఆర్ ఆరోపించారు. కేటీఆర్ తన న్యాయవాది ద్వారా ఈ పిటిషన్ దాఖలు చేశారు.  చేశారు, రూ.10 కోట్ల నష్టపరిహారం, బహిరంగ క్షమాపణతో పాటు  పరువు నష్టం కలిగించే కంటెంట్ తొలగించాలని పిటిషన్‌లో కోరారు. విచారణ జరిపిన కోర్టు 15వ తేదీన విచారణకు రావాలని సమన్లు జారీ చేసింది. 

బండి సంజయ్ వ్యాఖ్యలలో తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) దుర్వినియోగం, ఫోన్ ట్యాపింగ్, ఆర్థిక అవకతవకలు,  కేటీఆర్‌ను డ్రగ్స్ వాడకంతో ముడిపెట్టి ఆరోపణలు చేశారు.  ఈ ఆరోపణలు రాజకీయ కక్షతో గౌరవాన్ని, వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి ఉద్దేశించినవని కేటీఆర్ భావిస్తున్నారు. ఈ ఆరోపణలు చేసిన తర్వాత 2025 ఆగస్టు 11న కేటీఆర్ లీగల్ నోటీసు పంపినప్పటికీ, బండి సంజయ్ బేషరతు క్షమాపణ చెప్పడానికి నిరాకరించారు, దీంతో కేటీఆర్ సివిల్ కోర్టును ఆశ్రయించారు.  

బండి సంజయ్ ఏమన్నారంటే ?
 
కేటీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్ఐబీని దుర్వినియోగం చేసి, వేలాది ఫోన్‌లను ట్యాపిగ్ చేశారు. అందులో రాజకీయ నాయకులు, హైకోర్టు జడ్జి, ప్రస్తుత ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిలతో పాటు సొంతం కుటుంబ సభ్యుల ఫోన్‌లను ట్యాప్ చేశారని ఆరోపించారు. తర్వాత మరో ప్రెస్ మీట్‌లో  కేటీఆర్ డ్రగ్స్ వాడకం , ఫోన్ ట్యాపింగ్‌లో పాల్గొన్నారని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలు "బాధ్యతారహితమైనవి, ఆధారాలు లేనివి,  గౌరవాన్ని దెబ్బతీసే ఉద్దేశ్యంతో చేసినవి" అని కేటీఆర్ కోర్టుకు చెప్పారు. 

కేటీఆర్ ఇచ్చిన లీగల్ నోటీసుకు బండి సంజయ్  అక్టోబరు 29న స్పందించారు.  ఆరోపణలను "తప్పుడు, దురుద్దేశపూరితం" అని తిరస్కరించారు. తాను కేటీఆర్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించలేదని, ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అవినీతి గురించి మాత్రమే మాట్లాడానని వాదించారు. తాను భయపడేదిలేదని ప్రకటించారు.                  

పిటిషన్‌లో కేటీఆర్ పేర్కొన్న ప్రధాన డిమాండ్లు 
 
1. బండి సంజయ్ నుంచి బేషరతు, బహిరంగ క్షమాపణ.  
2. పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను ప్రచురించకుండా లేదా ప్రసారం చేయకుండా నిందితులను నిరోధించే కోర్టు ఉత్తర్వులు.  
3. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు, మీడియా పోర్టల్‌ల నుంచి పరువు నష్టం కలిగించే కథనాలు, వీడియోలు, పోస్టులను తక్షణమే తొలగించడం.  
4. రూ.10 కోట్ల నష్టపరిహారం 

15వ తేదీన బండి సంజయ్ కోర్టుకు హాజర్వాల్సిఉంది. అయితే హాజరవుతారా లేదా అన్నది బండి సంజయ్ లీగల్ టీమ్ డిసైడ్ చేసే అవకాశం ఉంది.                          

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Embed widget