KTR Karnataka : మరోసారి కర్ణాటక ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు - ఈ సారి ఎందుకంటే ?
విధి నిర్వహణలో చనిపోయిన సైనికులకు నష్టపరిహారం ఇవ్వకూడదని కర్ణాటక సర్కార్ నిర్ణయించడంపై కేటీఆర్ విమర్శలు చేశారు.
KTR Karnataka : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ .. తెలంగాణ సర్కార్ తీసుకున్న ఓ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది సైనికులను అవమానించడమేనన్నారు. అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేందుకు నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్‌లో కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే అమరవీరుల కుటుంబాలకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియా, ఇతర సదుపాయాలను నిలిపివేస్తామని స్పష్టం చేసింది. అమరవీరుల కుటుంబ సభ్యులకు ఇచ్చే నష్ట పరిహారం, భూమికి బదులుగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది.
కర్ణాకట కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని కేటీఆర్ విమర్శించారు. జాతీయవాదం గురించి పెద్దగా మాట్లాడే పార్టీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అవమానకరమని కేటీఆర్ ట్వీట్ చేశారు. సాయుధ దళాల్లో పని చేసిన సైనికులను మనం గౌరవించుకోవాలి కానీ ఆర్థిక భారంగా పరిగణించరాదు అని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని కర్ణాటక ప్రభుత్వం ఉపసంహరించుకుంటుందని ఆశిస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
This is a disgraceful decision coming from a party that talks big on Nationalism
— KTR (@KTRTRS) August 26, 2022
Respect & dignity to our seniors who worked in armed forces should not be treated as an economic burden
Hope wisdom prevails & the decision will be revoked by Karnataka Govt#JaiJawan pic.twitter.com/Dqli69NVJO
కర్ణాటక కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మాజీ సైనికులు వ్యతిరేకిస్తున్నారు. నిబంనల ప్రకారం విధినిర్వహణలో చనిపోయిన సైనికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రెండు ఎకరాల సాగు భూమి లేదా 8 ఎకరాల మెట్ట భూములు ఇవ్వాలి. ఇండియాలో చాలా రాష్ట్రాలు ఎనే అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తున్నాయని అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగంతో పాటు భూమి, పరిహారం కూడా ఇస్తున్నాయని కర్ణాటక ప్రభుత్వం మాత్రం అమరవీరుల కుటుంబాలను పట్టించుకోవడం లేదని అంటున్నారు.
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం చైనా బలగాలతో గాల్వన్‌లో జరిగిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన కల్నల్ సంతోష్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించింది. అలాగే రూ. ఐదు కోట్ల ఆర్థిక సాయం కూడా చేశారు. అందుకే కర్ణాటక లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేటీఆర్ వ్యతిరేకిస్తున్నట్లుగా తెలుస్తోంది.
కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వంపై కేటీఆర్ కొన్ని విషయాల్లో విమర్శలు చేస్తూ ఉంటారు. ఇటీవల ఓ పారిశ్రామికవేత్త బెంగళూరులో సమస్యలను ట్వీట్ చేస్తే.. ఆయనను కేటీఆర్ హైదరాబాద్‌కు ఆహ్వానించారు. అప్పట్లో కర్ణాటక బీజేపీ ప్రభుత్వంలో ఉన్న వారు కేటీఆర్‌పై విమర్శలు చేశారు. ఆ తర్వాత మునావర్ ఫారుఖీ స్టాండప్ కామెడీ కి అనుమతులు రద్దు చేయడంపైనా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. తాజాగా ఇప్పుడు మరోసారి అమరవీరుల కుటుంబాలకు ఇచ్చే సాయంపైనా విమర్శలుచేశారు.