అన్వేషించండి

KTR : కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు - రైతులకు నష్టం చేసే ప్రసక్తే లేదన్న కేటీఆర్

రైతుల్లో వ్యతిరేకతకు కారణం అయిన కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేస్తున్నట్లుగా కేటీఆర్ ప్రకటించారు. ఆందోళనల కారణంగా నమోదైన కేసులను ఎత్తివేస్తామని రైతు జేఏసీకి భరోసా ఇచ్చారు.

 

KTR :  కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను తక్షణమే రద్దు చేస్తున్నట్లుగా మంత్రి కేటీఆర్ ప్రకటించారు.  రైతు జేఏసీ బృందం శనివారం ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌తో సమావేశం అయింది.  మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనను వెంటనే రద్దు చేస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. ఇప్పటికే రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని మాస్టర్ ప్లాన్‌ని రద్దు చేస్తున్నట్లు గతంలోనే మున్సిపల్ శాఖ ప్రకటించిందన్నారు.  మరోసారి డీటీసీపీ అధికారులతో మాట్లాడిన కేటీఆర్.. ప్రస్తుతం అమలులో ఉన్న పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే నడుచుకోవాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇప్పటికే మాస్టర్ ప్లాన్ రద్దుకు సంబంధించి మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసిందన్నారు. 

మాస్టర్ ప్లాన్ రద్దు ఉద్యమం నాటి కేసులు ఎత్తి వేస్తామని భరోసా 

రైతు జేఏసీ నిరసన కార్యక్రమాల సందర్భంగా నమోదైన కేసులను కూడా సానుకూలంగా పరిశీలించి ఎత్తేసే చర్యలు తీసుకుంటామని కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు స్థానిక జిల్లా ఎస్పీ నుంచి వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్ర డీజీపీతో మాట్లాడారు.ఈ ఏడాది జనవరిలో  కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతులు వివిధ రూపాల్లో నిరసనలు, ఆందోళనతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు.    రైతుల ఉద్యమానికి రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. భూములు పోతాయన్న ఆందోళనతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నారు. మరో రైతు ఆత్మహత్యాయత్నం చేశారు.  ఇటీవల జిల్లా కేంద్రంలో రైతుల భారీ ర్యాలీ,  కలెక్టరేట్ ఎదుట ధర్నా, జిల్లా కేంద్రం బంద్​  పోగ్రాములు సక్సెస్​ అయ్యాయి. దీంతో  రైతుల ఉద్యమం రాష్ర్ట వ్యాప్తంగా చర్చగా మారింది.  

వివాదాస్పద మాస్టర్ ప్లాన్‌కు గతంలో ముసాయిదా రెడీ 

కామారెడ్డి పట్టణానికి మున్సిపల్ అధికారులు ఓ మాస్టర్ ప్లాన్ ముసాయిదా రూపొందించారు. దానిపై ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. అయితే ఈ మాస్టర్ ప్లాన్ కారణంగా భూములు పోతున్నాయన్న ఆందోళనతో  8 గ్రామాల రైతులు ఉద్యమం ప్రారంభించారు. డ్రాఫ్ట్​ మాస్టర్​ ప్లాన్​ను 2022 నవంబర్​ చివరిలో ప్రకటించారు. ఇందులో చూపెట్టిన ఇండస్ర్టియల్​ జోన్​, గ్రీన్​ జోన్, రీక్రియేషన్​ జోన్​, 100 ఫీట్లు, 80 ఫీట్ల రోడ్ల ప్రతిపాదనలపై ఆయా గ్రామాలకు చెందిన రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది.  కామారెడ్డి మున్సిపాల్టీ పరిధిలోని అడ్లూర్​, ఇల్చిపూర్, టెకిర్యాల్​, లింగాపూర్​, పాతరాజంపేట, రామేశ్వర్​పల్లిలో పాటు సదాశివనగర్​ మండలం అడ్లూర్​ఎల్లారెడ్డికి చెందిన  రైతులంతా రైతు ఐక్య కార్యచరణ కమిటీగా ఏర్పడ్డారు. మున్సిపాల్టీలో విలీనమైన లింగాపూర్, టెకిర్యాల్, అడ్లూర్​, రామేశ్వర్​పల్లి, ఇల్చిపూర్, పాతరాజంపేట గ్రామాలతో పాటు, సదాశివనగర్​ లో  బీఆర్​ఎస్ కు  పట్టుంది. కానీ,  మాస్టర్​ ప్లాన్​పై  ఈ గ్రామాల  నుంచే వ్యతిరేకత వచ్చింది. 

కేసీఆర్ పోటీ చేస్తూండటంతో కీలక నిర్ణయం

కామారెడ్డి నుంచి కూడా ఈ సారి కేసీఆర్ పోటీ చేస్తున్నారు. దీంతో  అక్కడ ప్రజల్లో ఉన్న అసంతృప్తికి సంబంధించిన అంశాలపై నిర్ణయం తీసుకుని సమస్యలు పరిష్కరించాలనుకున్నారు. అందుకే వెంటనే.. మాస్టర్ ప్లాన్ రద్దు కోసం పోరాడిన జేఏసీని పిలిపించి మాట్లాడి.. మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్లుగా చెప్పారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
Viral News: అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !
అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !
Kia Syros: మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Fibernet Vyham: ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
Embed widget