Ganesh Immersion Live Updates: ముగిసిన ఖైరతాబాద్ గణేషుడి శోభాయాత్ర
Hyderabad News: గణేష్ నిమజ్జనం ఉత్సవాలకు భాగ్యనగరం సిద్ధమైంది. మంగళవారం ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం కానుంది. ఈ క్రమంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

Background
Ganesh Nimajjanam 2024 Live Updates: నవరాత్రులు పూజలందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్ధమవుతున్నాడు. భాగ్యనగరంలో మంగళవారం గణేష్ నిమజ్జన వేడుకలు జరగనున్నాయి. ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ట్యాంక్ బండ్ చుట్టూ 135, మొత్తం జీహెచ్ఎంసీ పరిధిలో 300కు పైగా క్రేన్లు అందుబాటులో ఉంచారు. మంగళవారం ఉదయం ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం కానుంది. ఉదయం 9 గంటలకు మహా హారతి, 11:30 గంటలకు కలశపూజ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత మహాగణపతి విగ్రహాన్ని టస్కర్‌పైకి ఎక్కిస్తారు. అటు, శోభాయాత్ర భద్రత కోసం పోలీస్ శాఖ 25 వేల మంది సిబ్బందిని కేేటాయించింది. బుధవారం సాయంత్రం వరకూ నగరంలోని అన్ని వినాయక విగ్రహాల నిమజ్జనం పూర్తవుతుందని భావిస్తున్నారు. అటు, చివరి రోజు ఖైరతాబాద్ గణేశున్ని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువులు, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు పోలీసులు. గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచనున్నారు. ప్రజలు నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
2 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు
అటు, గణేష్ నిమజ్జనం సందర్భంగా మంగళ, బుధవారాల్లో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి పెద్దఎత్తున గణేష్ విగ్రహాలు హుస్సేన్ సాగర్ వైపు రానుండడంతో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తామని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. మరోవైపు, గణేష్ నిమజ్జనం ఉత్సవాల సందర్భంగా అర్ధరాత్రి వరకూ ఎంఎంటీఎస్ రైళ్ల అదనపు సర్వీసులు నడపనున్నట్లు ద.మ రైల్వే అధికారులు తెలిపారు. ఆర్టీసీ సైతం ప్రత్యేక బస్సులు నడపనుంది. అర్ధరాత్రి 2 గంటల వరకూ మెట్రో సర్వీసులు నడుస్తాయని అధికారులు వెల్లడించారు.
Khairatabad Bada Ganesh Nimajjanam 2024: ముగిసిన ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం
Khairatabad Bada Ganesh Nimajjanam 2024: ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం పూర్తైంది. నాల్గో నెంబర్ క్రేన్ దగ్గర ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. ఉదయం ఆరు గంటలకు మొదలైన శోభాయాత్ర ఇప్పటి వరకు సాగింది.
Khairatabad Ganesh Nimajjanam:ముగిసిన ఖైరతాబాద్ గణేషుడి శోభాయాత్ర
Khairatabad Ganesh Nimajjanam: ఖైరతాబాద్ గణేషుడి శోభాయాత్ర ముగిసింది. నాల్గో నెంబర్ క్రేన్ దగ్గర నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరికొన్ని నిమిషాల్లో ప్రక్రియను పూర్తి చేయనున్నారు.





















