By: ABP Desam | Updated at : 23 Mar 2022 08:24 PM (IST)
ధాన్యం సేకరణపై మోదీకి కేసీఆర్ లేఖ
తెలంగాణలో పండిన ధాన్యమంతా కొనుగోలు చేయాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. మొత్తం ధాన్యం సేకరించకపోతే కనీస మద్ధతు ధరకు అర్థం ఉండదని లేఖలో పేర్కొన్నారు. ధాన్యాన్ని పూర్తిగా సేకరించకపోతే తెలంగాణ రైతులు, వ్యవసాయరంగంపై తీవ్ర ప్రభావం ఉంటుందన్నారు. జాతీయ ఆహార భద్రతా లక్ష్యానికి విఘాతం కలుగుతుందని లేఖలో వివరించారు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్‌కు కేంద్రం బాధ్యత ఉంటుందని కేసీఆర్ లేఖలో గుర్తు చేశారు. పంజాబ్, హర్యానాలో మాదిరిగానే తెలంగాణలో కూడా ధాన్యాన్ని సేకరించాలని .. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధఆనం ఉండటం మంచిది కాదన్నారు.
ఇక బీజేపీ , టీఆర్ఎస్ మధ్య ఎస్టీ రిజర్వేషన్ల మంటలు - కేంద్రమంత్రి సమాధానంతో ప్రారంభమైన రచ్చ !
అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వ్యవసాయ నిపుణులతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఈ లేఖలో కోరారు.రైతు పండించిన మొత్తం ధాన్యాన్ని సేకరించకపోతే, కనీస మద్దతు ధరకు ఏం అర్థముంటుందని కేసీఆర్ సూటిగా ప్రశ్నించారు. ఆహార భద్రతా లక్ష్యానికి కూడా తూట్లు పొడిచినట్లే అవుతుందని సీఎం తేల్చి చెప్పారు. దేశ మంతా ఒకే రకమైన ధాన్య సేకరణ విధానం ఉండాలని, కేంద్ర ప్రభుత్వం పండిన ధాన్యాన్ని గనక పూర్తిగా సేకరించకపోతే సాగు రంగంపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని కేసీఆర్ హెచ్చరించారు.
తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై మరోసారి కేంద్రం క్లారిటీ, లోక్‌సభలో మంత్రి కుండబద్దలు
తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న పటిష్ఠమైన చర్యల వల్ల రాష్ట్రంలో ధాన్యం దిగుబడి బాగా పెరిగిందని, వ్యవసాయం సుస్థిరపడిందన్నారు. పంటల వైవిధ్యత కోసమే తమ ప్రభుత్వం ఇతర పంటలను కూడా ప్రోత్సహిస్తోందని కేసీఆర్ కేంద్రానికి క్లారిటీ ఇచ్చారు. రబీ సీజన్‌లో 52 లక్షల ఎకరాల్లో వరి పంటను సాగు చేయించామని, ఎలాంటి ఆంక్షలు లేకుండా వరిని కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ ప్రధాని మోదీని కోరారు.
ధాన్యం సేకరణ అంశం బీజేపీ, టీఆర్ఎస్ మధ్య రాజకీయ ఘర్షణకు కారణం అవుతోంది. ధాన్యం మొత్తం కోనుగోలు చేయాలన్న డిమాండ్‌తో టీఆర్ఎస్ మంత్రులు ఢిల్లీ వెళ్లిన సమయంలో కేసీఆర్ ప్రధానికి లేఖ రాయడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం మంత్రుల బృందం ఢల్లీలోనే ఉంది. రాష్ట్ర మంత్రులకు పీయూష్ గోయల్ సమయం ఇచ్చారు. గురువారం ఉదయం 11.40 గంటలకు పార్లమెంట్ ఛాంబర్‌లో తెరాస మంత్రులు, ఎంపీలు గోయల్‌తో సమావేశం కానున్నారు. సమావేశంలో ధాన్యం కొనుగోలుపై క్లారిటీ వస్తుందని టీఆర్ఎస్ నేతలు ఆశిస్తున్నారు. లేకపోతే కేంద్రంపై యుద్దం ప్రకటించాలని ఇప్పటికే నిర్ణయించారు.
Nalgonda Accident : నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం, రథానికి విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురు మృతి
TSRTC Water Bottle : టీఎస్ఆర్టీసీ వాటర్ బాటిల్స్ కు పేరు, డిజైన్ సూచించండి, ప్రైజ్ మనీ గెలుచుకోండి
MLC Kavitha: జూన్ 4 నుంచి సీహెచ్ కొండూరు లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహ ప్రతిష్ఠ, ఆహ్వానం పలుకుతున్న ఎమ్మెల్సీ కవిత
Karimnagar News : ప్రభుత్వం ఓకే చెప్పింది ..కానీ భూమి ఏది ? క్రీడా మైదానాల కోసం ఎన్ని కష్టాలో
Rgv Complaint : నా సంతకం ఫోర్జరీ చేశారు, నట్టి ఎంటర్టైన్మెంట్ పై ఆర్జీవీ పోలీస్ కేసు
Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు
Redmi 11 5G Launch: రెడ్మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!
Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?
Tirumala News : తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!