By: ABP Desam | Updated at : 07 Dec 2022 05:48 PM (IST)
పది రోజుల్లో రైతుల ఖాతాలో రైతు బంధు నిధులు జమ చేస్తామన్న కేసీఆర్
KCR Jagityal : రెండు రోజుల్లో జరగనున్న కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుని పది రోజుల్లో రైతుల ఖాతాల్లో రైతు బంధు సాయం జమ చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. జగిత్యాలలో జరిగిన బహిరంగసభలో కేసీఆర్ ప్రసంగించారు. రైతుబంధు ఇచ్చే రాష్ట్రం లేదు. రైతుబీమా ఇచ్చే దేశం లేని.. ఈ రెండూ ఇచ్చేది తెలంగాణనేనన్నారు. ధాన్యం కూడా కొనుగోలు చేయరని.. ఎక్కడా లేనివిధంగా 7వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టి పండించిన పంటను ఎక్కడ అమ్ముకోవాలనే రంది లేకుండా, అమ్మిన పంటకు ఐదురోజుల్లోనే బ్యాంకులు డబ్బులు వచ్చేలా బ్రహ్మాండంగా ధాన్యం కొనుగోలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. రైతు బంధు పథకం నగదు జమ కావడం గురించి కేసీఆర్ తనదైన శైలిలో చెప్పారు.
రైతుబంధు వస్తది? ఇంకో ఐదు పది రోజుల్లో రైతుబంధు పడుతుంది? పడాలి కదా? ఎట్ల పడుతది.. బ్యాంకుల్లో పడంగనే టింగుటింగుమని ఫోన్‌కు మెస్సేజ్ వస్తదన్నారు. కేసీఆర్ బతికున్న వరకు రైతుబంధు, రైతుబీమా ఆగదన్నారు.
వేములవాడ నియోజకవర్గంలో కథలాపూర్, బీమారం సూరమ్మ చెరువు నింపి మూడు మండలాలకు నీరిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. కేసీఆర్ కన్నా ముందు, టీఆర్‌ఎస్‌కన్నా ముందు ఎన్నో ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులను చూశారు. ఈ ప్రాంతం నుంచి మంత్రులను చూశారు. కోరుట్ల, మెట్‌పల్లి, సిరిసిల్ల, బాల్కొండలో లక్షల సంఖ్యలో బీడీ కార్మికులున్నారు. 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులున్నా తెలంగాణలో రూ.2016 పెన్షన్ ఇస్తున్నాం. రేషన్‌కార్డులతో బియ్యం, పిల్లలకు ఉద్యోగం, ఆరోగ్యశ్రీ కింద వైద్యం, కల్యాణలక్ష్మి కింద వివాహాలకు ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. రైతులకు పంటలు పండించేందుకు ఆనాడు తెలంగాణలో, కరువులో పెరుగన్నం పురుగు మందులు తాగి, దుబాయి, ముంబాయికి అనేక బాధలు పడి చెట్టుకొకరైన గుట్టకొకరైన తెలంగాణ రైతులు బాగుపడాలని చెప్పానని గుర్తు చేశారు.
భారతదేశ భవిష్యత్ గురించి, బాగుపడటం కోసం ఈ దేశం పిడికిలి ఎత్తాలి.. మన ఆస్తులను కాపాడుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ దేశం మారాల్సిన అవసరం ఉందన్నారు. మీ అందరి తోడ్పాటు, ధర్మపురి నరసింహ్మా స్వామి దయ వల్ల తెలంగాణ వచ్చింది. మన చుట్టూ జరిగే దాన్ని గమనించకపోతే ప్రమాదంలో పడుతాం. గోల్ మాట్ గోవిందం గాళ్లు, కారుకూతులు కూసేవాళ్లు తిరుగుతున్నారు. మనం అప్రమత్తంగా లేకపోతే మునిగిపోయే ప్రమాదం ఉంటది. చాలా పెద్ద దెబ్బ తగిలే ప్రమాదం ఉంటది. భారతదేశ రాజకీయాలను తెలంగాణ ప్రభావితం చేయాలి. తప్పకుండా ఈ దుష్ట సంప్రదాయాలు పోవాలన్నారు. కరెక్ట్‌గా మనం వచ్చినప్పుడే దేశంలో మోదీ ప్రధాని అయ్యిండని.. మేకిన్ ఇండియా అంటడు. పిల్లలు కాల్చే పటాకులు, పతంగులను ఎగురవేసే మాంజా చైనా నుంచి వస్తాయా? అని ప్రశ్నించారు.
ఉచితాలు ఇవ్వకూడదంట. కానీ ఎన్‌పీఏల పేరిట ఇప్పటికే 14 లక్షల కోట్ల రూపాయాలను ప్రజల ఆస్తులను దోచి పెట్టింది బీజేపీ పార్టీ 8 సంవత్సరాల నుంచి. లక్షలాది మంది ఉద్యోగులు ఉన్న ఎల్ఐసీని అమ్మేస్తాం అంటున్నారు. కేంద్ర బడ్జెట్‌కు సమానంగా ఎల్ఐసీ రూ. 35 లక్షల కోట్ల ఆస్తులు కలిగి ఉంది. ప్రజల సొత్తు మీ జాగీర్ లాగా, మీ అబ్బ సొత్తులాగా, ప్రజల సొత్తును షావుకార్లకు కట్టబెడుతామంటే భారతదేశం పిడికిలి ఎత్తాలి అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఎల్ఐసీలో ఉండే ఏజెంట్ మిత్రులు పిడికిలి బిగించి సైనికులు కావాలి. మన ఆస్తులను కాపాడుకోవాలి. కరెంట్‌ను ఎలా ప్రయివేటికరిస్తారు. ఈ అరాచకం ఇలానే కొనసాగితే పెట్టుబడిదారుల రాజ్యం అవుతది తప్పపేద ప్రజల సంక్షేమం చూడరు. దయచేసి ఆలోచించాలి. సబ్ కా వికాస్ అన్నారు కానీ వికాసం లేదు. మేకిన్ ఇండియాలో ఏం రాకపోయినప్పటికీ.. దేశంలో 10 వేల పరిశ్రమలు మూతపడ్డాయన్నారు.
Revanth Reddy: వైఎస్సార్ కు చేవెళ్ల చెల్లెమ్మ సెంటిమెంట్ అయితే నాకు ఆ ఎమ్మెల్యే ఇంటి ఆడబిడ్డ: రేవంత్ రెడ్డి
Telangana Budget 2023: రూ.3 వేల నిరుద్యోగ భృతిపై బడ్జెట్ లో ఎందుకు ప్రస్తావించలేదు?: ఎంపీ సోయం బాపూరావు
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతుల ఆందోళన - ఆసిఫాబాద్ లో పరిస్థితి ఉద్రిక్తం!
Telangana Budget 2023: రాష్ట్రంలో 52 శాతానికి పైగా ఉన్న బీసీలకు 2 శాతం నిధులేనా?: బడ్జెట్ పై బండి సంజయ్
SIT To Supreme Court : సుప్రీంకోర్టుకు వెళ్లనున్న సిట్ - ఎమ్మెల్యేలకు ఎర కేసు ఏ మలుపులు తిరగబోతోంది ?
Majilis Congress : మజ్లిస్‌ను దువ్వే ప్రయత్నంలో కాంగ్రెస్ - వర్కవుట్ అవుతుందా ?
Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!
Man Marries Triplets: ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు- టైం టేబుల్ వేసుకొని భర్తతో కాపురం!
Adani Group : అదానీకి మరో షాక్, రూ.5400 కోట్ల బిడ్ రద్దు చేసిన యూపీ డిస్కమ్