Karimnagar News: ఈ నిర్లక్ష్యానికి కారణం ఎవరు? మైనర్ల పేరెంట్స్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు రిక్వెస్ట్!
Telangana News | నిత్యం ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూనే ఉన్నారు. ముగ్గురు మైనర్లు స్కూటీపై వేగంగా దూసుకెళ్లారు. దాంతో వారి పేరెంట్స్ పై చర్యలకు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Minors Rash Driving in Karimnagar | దేశంలో మైనర్ డ్రైవింగ్ ప్రమాదాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో మైనర్ డ్రైవింగ్ ల ప్రమాదాలే అధికంగా ఉన్నాయని కొన్ని సర్వేల్లో వెల్లడైంది. మైనర్ డ్రైవింగ్ వల్ల ప్రమాదం జరిగి ప్రాణాలు పోతున్నాయి. తీవ్ర గాయాలతో జీవితకాలం మంచాన పడ్డ వారు కూడా ఉంటున్నారు. మైనర్ డ్రైవింగ్ లో ఏదైనా ప్రమాదం జరిగి మృతి చెందితే వారికి ఇన్సూరెన్స్ కూడా ఉండదు. ఎందుకంటే మైనర్లకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు. మరి ఎన్ని సంఘటనలు జరుగుతున్నా.. నేటికీ మైనర్ల డ్రైవింగ్ సమస్యలు మాత్రం తీయడం లేదు.
రూల్స్ మారినా నిర్లక్ష్యమే!
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రమాదాలను దృష్టి సారించిన ప్రభుత్వం మైనర్ల డ్రైవింగ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. మైనర్ డ్రైవింగ్ తో ఏదైనా ప్రమాదం జరిగితే వేల రూపాయల ఫైన్లు వేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఓ జీవాను జారీ చేసింది. రాష్ట్రంలో మైనర్ వాహనాల డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవరు కూడా ట్రాఫిక్ పోలీసులు నిర్వహిస్తున్నారు. కానీ ఎన్ని ఎన్ని ప్రభుత్వాలు మారిన ఎన్ని చట్టాలు వచ్చినా మైనర్లకు మాత్రం ఒంట్లో భయం లేకుండా పోయింది మరి ఇలా ప్రవర్తిస్తున్న వారి నిర్లక్ష్యానికి తల్లిదండ్రులే కారణమా...? లేక పోలీసులే కారణమా...? అని చర్చ మొదలైంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిత్యం ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఈ మైనర్ల వికృత చేష్టలు మాత్రం మారడం లేదు. ఇళ్లలో నుంచి వాహనాలు తీసుకువచ్చి రోడ్లపై స్టన్స్ వేస్తున్నారు. తాను ప్రమాదానికి ఒక్కడే గురికాకుండా తనతో పాటు మరొక ఇద్దరిని కూడా తీసుకువచ్చి ప్రమాదానికి గురి అయ్యేలా కారణం అవుతున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో మైనర్లు పట్టపగలే త్రిబుల్ రైడింగ్ చేస్తూ ఓవర్ స్పీడ్ తో ఇతర వాహనదారులను ఇబ్బంది పెడుతున్నారు.
స్కూటీపై మైనర్లు ట్రిపుల్ రైడింగ్!
కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఒక స్కూటీ వాహనంపై ముగ్గురు మైనర్లు వెళ్తూ ఏబీపీ దేశం కెమెరాకి చిక్కారు. ఆ ముగ్గుర్ని మీరు ఏం చదువుతున్నారు మైనర్లు కదా వాహనాలు నడపడం ఏంటని అడగగా నిర్లక్ష్యమైన సమాధానం ఇవ్వడంతో షాక్ తిన్నారు. తాను 9వ తరగతి చదువుతున్నాను ఈ ఫోటోను తీసి పోలీసులకు పంపించాలనీ ఓ బాలుడు చెప్పాడు. మరి ఇంత విచ్చలవిడిగా మైనర్లు రోడ్లపై వాహనాలతో తిరుగుతున్నారంటే దానికి కారణం ముమ్మాటికి తల్లిదండ్రులని, వారు ఇవ్వకుండా బాలుర చేతికి వాహనం ఎలా వస్తుందని అంతా అంటున్నారు. ఇలాంటి మైనర్ పిల్లలు వాహనాలు నడపటం ద్వారా ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఇప్పటికైనా పోలీసులు ఇలాంటి చిన్నారుల తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. వీరి రాంగ్ డ్రైవింగ్ వల్ల ఎవరైనా ప్రాణాలు కోల్పోయినా, లేక తీవ్ర గాయాలతో శాశ్వతంగా మంచానికే పరిమితం అయితే బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రశ్న తలెత్తుతోంది.