Pedpadalli MP Seat: పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఎవరికో? పోటీ పడుతున్న ఇద్దరు!
Peddapalli Politics: పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈసారి ఎవరు దిగబోతున్నారని ఆసక్తికరంగా మారింది.
Karimnagar Politics: టీఆర్ఎస్ లో పెద్దపల్లి ఎంపీ సీటుపై రాజకీయంగా ఉత్కంఠ రేపుతోంది. పెద్దపెల్లి ఎంపీ వారిలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ దిగుతారని ప్రచారం జరుగుతుంది. వెంకటేష్ నేతకు ఈసారి గెట్ గ్యారెంటీ లేదు అంటున్నాయి పార్టీ వర్గాలు. దీంతో కొప్పుల ఈశ్వర్ కు టికెట్ ఇస్తే వెంకటేష్ పోటీ నుంచి తప్పుకుంటారు అంటున్నాయి. పెద్దపల్లి టికెట్ ను త్వరలో ఫైనల్ చేయనుంది బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం.
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈసారి ఎవరు దిగబోతున్నారని ఆసక్తికరంగా మారింది. పెద్దపల్లి టీఆర్ఎస్ కు సంబంధించి సిట్టింగ్ ఎంపీ స్థానాన్ని మార్చబోతున్నారని ఇప్పటికే పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది. అయితే ఈ నేపథ్యంలోనే సిట్టింగ్ ఎంపీ అయినటువంటి వెంకటేష్ నేతకు కాకుండా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను బరిలోకి దింపబోతున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎంపీ ఉన్నటువంటి వెంకటేష్ నేత ఇలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. రాజకీయపరంగా ఓవైపు పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉంటారా లేదా మరొక పార్టీ నుంచి ఎంపీగా బరిలోకి దిగుతారా లేకపోతే ప్రస్తుతం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కి ప్రత్యర్థిగా నిలబడబోతున్నారా అన్న విషయం ఆసక్తికరమైన చర్చగా మారింది.
ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న వెంకటేష్ నేత మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పార్టీలో గురు శిష్యులుగా అనుబంధంగానే పార్టీలో కొంతమంది నేతలు కొనియాడుతుంటారు. 2018 ఎన్నికల్లో చెన్నూరు ఎమ్మెల్యేగా వెంకటేష్ నేత పోటీ చేయడం జరిగింది ఆ సమయంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అనంతరం వెంకటేష్ నేత రాజకీయ పరిణామాలతో బీఆర్ఎస్ గూటికి చేరారు అప్పటి పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపెల్లి ఎంపీగా పోటీ చేశారు విజయం సాధించడం జరిగింది ఆ తర్వాత ఎంపీ గానే కొనసాగుతున్నప్పటికీ తనకంటూ ఇమేజ్ క్యాడర్ సంపాదించుకోకపోవడం పెద్దపెల్లి నియోజకవర్గంలో చాలావరకు పరిచయం లేకపోవడంతో వెంకటేష్ నేతకు మైనస్ గా మారిందని చర్చ సాగుతోంది ఈ నేపథ్యంలోనే సిట్టింగ్ ఎంపీ స్థానాన్ని మార్చాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అందుతుంది దీంతో బలమైన నాయకుడు అయినటువంటి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు ఈసారి అవకాశం కల్పించే విధంగా అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లుగా చర్చ సాగుతుంది.
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కార్మిక నాయకుడిగా రాజకీయ రంగ ప్రవేశం ప్రవేశం జరిగింది. మేడారం నియోజకవర్గం కావచ్చు ధర్మపురి నియోజకవర్గం పార్లమెంటు పరిధిలోని చాలా ప్రాంతాల్లో పర్యటించారు. మంత్రి కాక కూడా కొనసాగించారు కార్మిక వర్గంలో బలమైన పట్టున్న నాయకుడిగా కొప్పుల ఈశ్వర్ కు పేరు ఉంది. ఇవన్నీ కూడా కొప్పులకు మైలేజ్ అనుకూలించే అవకాశం ఉండడంతో అందుకే కొప్పుల ఈశ్వర్ ఈసారి బరిలోకి దింపాలని వీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బిజెపికి బలమైన అభ్యర్థి లేకపోవడం మరొకసారి విజయం సాధించాలని బీఆర్ఎస్ నేత కేసిఆర్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ నేపథ్యంలో కొన్ని స్థానాలు మార్పు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిని మార్చేందుకు అధినేత కేసిఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అందుకే బలమైన అభ్యర్థి కొప్పుల ఈశ్వరుని బరిలోకి దించనున్నట్టు తెలుస్తుంది మారిన ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఒకవైపు బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ బరిలోకి దిగితే బిజెపి కాంగ్రెస్ ఎవరిని బరిలోకి దింపుతారనే విషయమైతే సస్పెన్స్ గా మారింది.