అన్వేషించండి

Road Cum Railway Bridge : మిడ్‌మానేరుపై రోడ్‌ కం రైల్‌ బ్రిడ్జ్‌-రైల్వేకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదన

తెలంగాణకు రోడ్డు కం రైలు వంతెన రాబోతోంది. మిడ్‌మానేరుపై ఈ వంతెన నిర్మించాలని కేసీఆర్‌ సర్కార్‌ భావిస్తోంది. దీనికి సంబంధించి ప్రతిపాదనలను కూడా రైల్వేశాఖకు పంపింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.

అభివృద్ధి దిశగా దూసుకుపోతున్న తెలంగాణలో అబ్బురపరిచే మరో కొత్త ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనుంది. రాజమండ్రిలో ఉన్న రోడ్‌ కం రైల్‌ బ్రిడ్జి తరహా నిర్మాణం చేపట్టేందుకు  తెలంగాణ సర్కార్‌ అడుగులు ముందుకు వేస్తోంది. వాటర్‌ హబ్‌గా ఉన్న మిడ్‌మానేరుపై... రోడ్ కం రైలు వంతెన కట్టాలని ప్లాన్‌ చేస్తోంది. దీనిని సంబంధించిన ప్రపోజల్స్‌ ఇప్పటికే రైల్వే శాఖకు పంపింది కేసీఆర్‌ సర్కార్. మిడ్‌మానేరుపై కింద రైల్వేట్రాక్, పైన రోడ్డు నిర్మించేలా ప్రతిపాదన చేసింది. ఇది సాకారమైతే... తెలంగాణ ప్రజలకు అద్భుతమైన ప్రాజెక్ట్‌ అందుబాటలోకి రావడమే కాదు... రైలులో ప్రయాణిస్తూ మిడ్‌మానేరు అందాలు చూసి కొత్త అనుభూతిని పొందే అవకాశం కలుగుతుంది. 

ఇప్పటికే... హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌ను కలుపుతూ...  మనోహరాబాద్‌- కొత్తపల్లి రైలు మార్గం నిర్మాణంలో ఉంది. ఈ మార్గంలోనే... మిడ్‌మానేరుపై రోడ్‌ కం రైలు వంతెన  నిర్మాణించాలని భావిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. మనోహరాబాద్‌- కొత్తపల్లి రైలు మార్గంలో... గజ్వేల్‌ నుంచి సిద్ధిపేట వరకు నిర్మాణం పూర్తయ్యింది. ఈ లైన్‌లో అప్పుడప్పుడూ  గూడ్స్‌ రైళ్లు తిరుగుతున్నాయి. ఇక..  సిద్ధిపేట నుంచి సిరిసిల్ల వరకు భూసేకరణ పూర్తి కావడంతో... నిర్మాణ పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది. ఇక ఆ మార్గంలో  పనులు మొదలు పెట్టడమే తరువాయి. ఆపై... సిరిసిల్ల నుంచి వేములవాడ మీదుగా కొత్తపల్లి వరకు భూసేకరణ పూర్తి చేయాల్సి ఉంది. ఈ మార్గంలోనే.. మిడ్‌మానేరుపై రోడ్‌  కం రైలు వంతెన కట్టాలన్నది తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదన. 

నిజానికి... మిడ్‌మానేరుపై రైల్‌ బ్రిడ్జి మాత్రమే కట్టాలని భావించారు. అందుకు ఓ సమావేశం కూడా పెట్టుకున్నారు. ఆ సమావేశంలో ప్రాజెక్టుపై జరిగిన చర్చలో కొత్త ప్రతిపాదన  తెరపైకి వచ్చింది. మిడ్‌మానేరుపై రైల్‌ బ్రిడ్జితోపాటు... రోడ్డు మార్గం కూడా ఉంటే బాగుంటుందన్న ప్రతిపాదన వచ్చింది. మంత్రి కేటీఆర్‌, బీఆర్‌ఎస్‌ నేత బోయినపల్లి వినోద్‌  కుమార్ ఈ ప్రతిపాదన చేశారు. ప్రతిపాదన చేయడమే కాదు... సీఎం కేసీఆర్‌కు కూడా విషయం చెప్పారు. ప్రతిపాదన బాగుండటంతో... ముఖ్యమంత్రి కూడా ఓకే అనేశారు.  వెంటనే.. రైల్వే శాఖకు ప్రతిపాదనలు వెళ్లిపోయాయి. త్వరలోనే.. ఈ అంశంలో ఒక సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ సీఎస్‌ శాంతికుమారి,  ప్రతిపాదన తెచ్చిన వినోద్‌కుమార్‌ పాల్గొని... ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై చర్చించబోతున్నారని సమాచారం. ఈ సమావేశంలో సిరిసిల్ల, కరీంనగర్‌ జిల్లాల కలెక్టర్లు కూడా  పాల్గొని... తమ అభిప్రాయాలు పంచుకోనున్నారు.

మిడ్‌మానేరుపై రోడ్‌ కం రైలు వంతెను ఒక అద్భుత ప్రాజెక్టుగా నిలవాలని తెలంగాణ ప్రభుత్వం తాపత్రయపడుతోంది. అందుకు వినూత్న రీతిలో ఆలోచనలు చేస్తోంది.  మిడ్‌మానేరుపై కింది రైలు మార్గం, పైన రోడ్డుమార్గం ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు. తంగెళ్లపల్లి మండలం నుంచి వేములవాడ వరకు... దాదాపు కిలోమీటర్‌ మేర.. ఈ రోడ్‌ కం  రైలు వంతెన నిర్మించాలని భావిస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
Galiveedu MPDO: అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేత వీరంగం - ఎంపీడీవోను తన్ని పిడిగుద్దులు, తీవ్ర ఉద్రిక్తత
అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేత వీరంగం - ఎంపీడీవోను తన్ని పిడిగుద్దులు, తీవ్ర ఉద్రిక్తత
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రాయల చెరువులో డ్రాగన్ బోట్ రేస్‌ ప్రారంభంఎంతో అందమైన ఈ వైజాగ్ వ్యూ పాయింట్ గురించి మీకు తెలుసా..?అన్నామలై వ్యూహాలతో బలం పెంచుకుంటున్న బీజేపీనచ్చని పని చేసిన మన్మోహన్, అయినా మోదీ పొగడ్తలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
Galiveedu MPDO: అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేత వీరంగం - ఎంపీడీవోను తన్ని పిడిగుద్దులు, తీవ్ర ఉద్రిక్తత
అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేత వీరంగం - ఎంపీడీవోను తన్ని పిడిగుద్దులు, తీవ్ర ఉద్రిక్తత
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
Mother in law should die: అత్త త్వరగా చచ్చిపోవాలి - నోటుపై రాసి దేవుడి హుండీలో వేశారు - ఎంత టార్చర్ పడుతున్నారో?
అత్త త్వరగా చచ్చిపోవాలి - నోటుపై రాసి దేవుడి హుండీలో వేశారు - ఎంత టార్చర్ పడుతున్నారో?
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Gay Murderer: గే కానీ అమ్మాయిలా వేషం వేసి మగాళ్లను పిలుస్తాడు - వెళ్లారో చచ్చినట్లే - ఇప్పటికి 11 మంది !
గే కానీ అమ్మాయిలా వేషం వేసి మగాళ్లను పిలుస్తాడు - వెళ్లారో చచ్చినట్లే - ఇప్పటికి 11 మంది !
Manmohan Singh: 'మన్మోహన్ దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తెచ్చారు' - మాజీ ప్రధాని పార్థివ దేహానికి తెలుగు రాష్ట్రాల సీఎంల నివాళి
'మన్మోహన్ దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తెచ్చారు' - మాజీ ప్రధాని పార్థివ దేహానికి తెలుగు రాష్ట్రాల సీఎంల నివాళి
Embed widget